breaking news
lawyers arrest
-
లాయర్లపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా పెనుగొండలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో గందరగోళం జరిగింది. సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా.... రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు. లాయర్ల నినాదాలు హోరెత్తడంతో చంద్రబాబు ప్రసంగానికి ఆటంకం ఏర్పడింది. దీంతో లాయర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న లాయర్లను పోలీసులు లాక్కెళ్లారు. కాగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళన చేస్తున్న పలువురు లాయర్లను ఇవాళ ఉదయం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే చంద్రబాబు పర్యటన ఉందని తమను అదుపులోకి తీసుకోవడం దారుణమని న్యాయవాదులు మండిపడ్డారు. చంద్రబాబు కేంద్రం వద్ద మోకరిల్లి ఏపీ ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారని వారు విమర్శించారు. -
పరీక్ష అడ్డుకున్నందుకు లాయర్ల అరెస్ట్
హైదరాబాద్ : జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్‌పేటలో జరుగుతున్న జూనియర్ సివిల్ జడ్జిల నియామక పరీక్షను నిర్వహించరాదంటూ, పరీక్షను అడ్డుకునేందుకు తెలంగాణకి చెందిన కొందరు న్యాయవాదులు ప్రయత్నించారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసులు పరీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించిన న్యాయవాదులను అరెస్ట్ చేశారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సివిల్ జడ్జి పోస్టుల భర్తీ కోసం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాను తెలంగాణ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ కోరిన విషయం తెలిసిందే. మంజూరు చేసిన పోస్టుల ఆధారంగా తెలంగాణ, ఏపీలకు జిల్లా జడ్జీలు, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీల కేడర్‌ను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేసింది. జేఏసీ కన్వీనర్, కో కన్వీనర్లు ఎం.రాజేందర్‌రెడ్డి, గండ్ర మోహనరావు మంగళవారం ప్రధాన న్యాయమూర్తికి గతంలో లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను తెలంగాణ, ఏపీలకు 42:58 నిష్పత్తిలో కేటాయించాలని, ఖాళీల భర్తీకి ఇరు రాష్ట్రాలకూ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు. జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకి విభజనకు ముందే నోటిఫికేషన్ జారీ చేశారని గుర్తు చేశారు. కేంద్రం ఇప్పటికే హైకోర్టు విభజన చర్యలు ప్రారంభించిందని, అందులో భాగంగా ఇరు హైకోర్టులకు న్యాయమూర్తుల సంఖ్యను ఖరారు చేసిందని తెలిపారు.