ఓటమి భయంతోనే టీడీపీ కుట్ర

TDP Collapse With Fear Of Defeat - Sakshi

పంచాయతీ పేరు : ఇందుగపల్లి

మొత్తం ఓటర్లు : 1787 

మొత్తం వార్డులు : 10

ఫారం 7 కింద వచ్చిన దరఖాస్తులు : 28

సాక్షి, ఇందుగపల్లి(వత్సవాయి) : గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. వాస్తవంగా ఒక వ్యక్తికి రెండు ప్రాంతాల్లో  ఓట్లు కలిగి ఉంటే ఒక ప్రాంతంలో తొలగించాలని ఫారం–7 కింద దరఖాస్తులు చేసుకోవాలి కానీ మండలంలోని పలు గ్రామాల్లో దీనికి విరుద్దంగా జరుగుతుంది.

గ్రామాల్లో నివాసం ఉండే వారికి కూడా ఓటు తొలగించాలని అధికారులకు దరఖాస్తులు అందిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులైన వారి ఓట్లు తొలగించాలని దరఖాస్తులు అందాయి. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కల్లిబొల్లి మాటలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఆ తరువాత హామీలను అమలుచేయకపోవడంతోతీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

 
వైఎస్సార్‌ సీపీ  ఓట్లపైనే కుట్ర....
వైఎస్సార్‌ సీపీ పట్ల ప్రజలు నమ్మకంతో ఆ పార్టీకి అనుకూలంగా ఉండడంతో మరలా ఎలాగైనా అ«ధికారాన్ని దక్కించుకోవాలనే దుర్భద్దితో ఓట్ల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. పైగా వైఎస్సార్‌ సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, బూత్‌ కన్వీనర్ల పేరుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారు. గ్రామాల్లో  బీఎల్‌వోలు తొలగింపులు జాబితాలు తీసుకుని సదరు ఓటు తొలగింపుకు ఎంపికైన వ్యక్తికి ఇంటికి వెళ్లి రశీదులు అందిస్తున్నారు.

దీంతో కొందరు ఓటర్లు కంగుతింటున్నారు. మేము గ్రామంలోనే నివాసం ఉంటున్నామని మా ఓటు ఎందుకు తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మా ఓటు తొలగించాలని ఎవరు దరఖాస్తులు పెట్టారు అని అడిగినా సమాధానం చెప్పలేని పరిస్థితిలో బీఎల్‌వోలు ఉన్నారు. రెవెన్యూ కార్యాలయంలో అడిగినా మాకు తెలియదు మీబీఎల్‌వోలను అడగండి అని సమాధానం తప్ప మరొకటి లేదు.

 
ఇందుగపల్లి పంచాయతీ పరిధిలో...
ఇందుగపల్లి గ్రామంలో 20 ఓట్లు తొలగించాలని వైఎస్సార్‌ సీపీకి చెందిన గ్రామ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, కిలారు హనుమయ్య పేరుతో ఫారం – 7 కింద దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేశారు. వాటిలో ఎక్కువగా వైఎస్సార్‌ సీపీకి చెందిన ఓట్లే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను తీసుకుని హనుమయ్య ఇంటికి బీఎల్‌వోలు వెళ్లగా ఆయన నిర్ఘాంతపోయారు.

మా కార్యకర్తల ఓట్లు తొలగించమని నేను దరఖాస్తులు అందించడం ఏమిటి అని అడగ్గా మాకు తెలియదు ఆన్‌లైన్‌లో మీ పేరుమీద దరఖాస్తులు అందాయి అని చెప్పడంతో ఇదంతా టీడీపీ నాయకుల కుట్ర అని మా కార్యకర్తలు అందరూ గ్రామంలోనే ఉన్నారు అని చెప్పారు.

వైఎస్సార్‌ సీపీపై నిందవేసేందుకే

వైఎస్సార్‌ సీపీపై నిందవేసేందుకే ఆన్‌లైన్‌లో కొందరు పనిగట్టుకుని ఫారం – 7 లను అందిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడడంతో టీడీపీ నాయకుల కుట్రలకు అంతులేకుండా పోతుంది. సరైన సమయంలో వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. నేను వైఎస్సార్‌ సీపీలో ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు నాపేరు పెట్టారు. 
                                  -చావా కృష్ణారావు గ్రామస్తుడు

ప్రజలు నమ్మిన వారికే ఓటేస్తారు

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇద్దరు పోటీపడితే ఒక్కరే గెలుస్తారు ప్రజలు ఎవరిని నిమ్మితే వారికే ఓట్లు వేసి గెలిపిçస్తారు. అలా కాకుండా గ్రామాల్లో నివాసం ఉండే వారి ఓట్లు తొలగించి గెలవాలనుకోవడం విడ్డూరం. ఈ విధంగా చేయడం వల్ల గ్రామాల్లో వివాదాలు తలెత్తుతాయి. నేను గ్రామంలోనే ఉంటున్నా నాపేరును తొలగించేందుకు దరఖాస్తు అందించారు. 
                                           -గంధసిరి త్రివేణి విద్యార్థిని 

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top