AP: ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల | Schedule For Mpp And Zp Presidential Elections Released | Sakshi
Sakshi News home page

AP: ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

Nov 10 2026 1:11 PM | Updated on Nov 10 2026 1:34 PM

Schedule For Mpp And Zp Presidential Elections Released

సాక్షి, అమరావతి: ఎంపీపీలు, జడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19న 659 మండల పరిషత్‌ల్లో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు, 20న 28 జిల్లా పరిషత్‌ల్లో ఛైర్‌పర్సన్‌, వైస్ చైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత ఎంపీపీల్లో ఒక్కొక్కరు, జడ్పీల్లో ఇద్దరు చొప్పున కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

కాగా, కోర్టు కేసులు తదితర కారణాలతో మొదటి విడతలో ఎన్నికలు జరగని 23 పట్టణ స్థానిక సంస్థలకు వచ్చేనెలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌­ఈసీ) కసరత్తు చేస్తోంది. కోర్టు కేసుల చిక్కులు వీడడంతో ఎన్నికల నిర్వహ­ణపై దృష్టి పెట్టింది. రాజమహేంద్రవరం, కాకినాడ, శ్రీకాకుళం, మంగళగిరి–తాడేపల్లి నగరాలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్‌ జారీచేసి, డిసెంబరు మొదటి లేదా రెండో వారంలో పోలింగ్‌ నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది.

ఈ నెల 20వ తేదీ తరువాత నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికలు జరగనున్న 23 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 24.93 లక్షల మంది ఓటర్లున్నారు.

ఇదీ చదవండి: గెలుపు కాదు అరాచకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement