దీపావళికి 'గ్రీన్ క్రాకర్స్‌'కు సుప్రీంకోర్టు అనుమతి | Supreme Court allows green crackers for Diwali Festival | Sakshi
Sakshi News home page

దీపావళికి 'గ్రీన్ క్రాకర్స్‌'కు సుప్రీంకోర్టు అనుమతి

Nov 2 2026 3:45 PM | Updated on Nov 2 2026 3:58 PM

Supreme Court allows green crackers for Diwali Festival

సాక్షి, ఢిల్లీ:  దీపావళి సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే నవంబర్ 7, 8 తేదీల్లో మాత్రమే ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి అవకాశం కల్పించింది. దీపావళి అనంతరం అంటే నవంబర్ 9 నుంచి మళ్లీ పూర్తిస్థాయి క్రాకర్స్ నిషేధం అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దీపావళి రోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, మళ్లీ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలి. అంతేకాదు ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, విద్యాసంస్థలు వంటి ప్రాంతాలకు 300 మీటర్ల పరిధిలో ఎలాంటి క్రాకర్స్ కాల్చకూడదు. ఆయా ప్రాంతాలను నో-క్రాకర్ జోన్లుగా ప్రకటించాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే తయారీదారులు, వ్యాపారులు సమర్పించిన సెక్యూరిటీ డిపాజిట్‌ను జప్తు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గ్రీన్ క్రాకర్స్ ప్రత్యేకత ఏమిటంటే?
CSIR-NEERI అభివృద్ధి చేసిన గ్రీన్ క్రాకర్స్ సంప్రదాయ టపాసులతో పోలిస్తే సుమారు 30 శాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయని చెబుతున్నారు. వీటి వల్ల పొగ, దుమ్ము, శబ్దం కూడా తక్కువగా ఉంటాయి. అయితే వీటిని పూర్తిగా కాలుష్యరహితమైనవిగా భావించకూడదు. గ్రీన్ క్రాకర్స్ కాల్చినప్పుడు కూడా కొంతమేర కాలుష్య కారకాలు గాలిలోకి విడుదలవుతాయి. అందువల్ల వీటి వినియోగంలోనూ జాగ్రత్తలు అవసరం.

ఇదీ చదవండి: రాప్తాడు బాలికకు వైఎస్ జగన్ పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement