అగ్రనటుడు కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. అయితే కమల్‌హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకి ‘సాండియార్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. మరెన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ‘రామాయణం’ విజువల్స్ పై డైరెక్టర్ శంకర్ ఏమన్నారంటే..?)


