World
-
ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా?
విమానం ప్రయాణం అంటేనే ఖర్చు ఎక్కువ. విమానాశ్రయంలో మామూలు కాఫీ లేదా వాటర్ బాటిల్ కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది విమానాశ్రయం అయితే. బిల్లు చూసి గుడ్లు తేలేయాల్సిందే. ఇంతకీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానాశ్రయం ఏదో తెలుసా? అక్కడ ఒక్కో అరటి పండు ఖరీదు ఎంతో తెలిస్తే షాకవుతారు.మిర్రర్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు ఇస్తాంబుల్ విమానాశ్రయం "ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది". ఇస్తాంబుల్ విమానాశ్రయం (Istanbul Airport) టర్కీలోని ఇస్తాంబుల్‌కు సేవలందిస్తున్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలలో అతిపెద్దది, ప్రధాన విమానాశ్రయం. ఐరోపాలో 2వ అత్యంత రద్దీగా ఉంటుంది. మధ్యప్రాచ్యంలో 2వ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయమిది. అంత ప్రతిష్టాత్మకమైన ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కో అరటిపండుకు రూ.565. ఒక్కో బీరుకు రూ.1,697 వసూలు చేయడం వార్తల్లో నిలిచింది. ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరా కూడా ఈ విషయంపై నివేదించింది, ఇటాలియన్ ప్రయాణికుడు లియోనార్డ్ బెర్బెరిని ఉటంకిస్తూ, 90 గ్రాముల లాసాగ్నా ( పాస్తాలాంటిది) రూ. 2,376 చెల్లించాడని పేర్కొంది. అయితే ఆహార నాణ్యత ఖరీదైన ధరకు సరిపోలడం లేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడట కూడా.ఇదీ చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలుక్రోసెంట్స్ (బ్రెడ్ లాంటిది)రూ. 1,410-1,698 మధ్య ఉంటుంది. ఇటాలియన్ చికెన్ సలాడ్ల ధర ఏకంగా రూ. 1,698 లియోనార్డ్ కూడా కనుగొన్నాడు. అంతేకాదు, బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్ లాంటి వాటిల్లో ప్యాకెట్ ఫుడ్ ధర చాలా ఎక్కువగాఉందని తెలిపాడు ఆయన చెప్పిన దాని ప్రకారం మెక్‌డొనాల్డ్స్ వద్ద బిగ్ మాక్ , డబుల్ క్వార్టర్ పౌండర్ ధర సుమారు రూ. 2 వేలు, 2,450గా ఉన్నాయి.ఇక నాలుగు ఫ్రైడ్ చికెన్ వింగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ,కోకా-కోలా ధర రూ. 1,698కు పై మాటేనట. చదవండి: నీతా అంబానీ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ సెన్స్ అది మరి! ఆమె టీ కప్ స్పెషల్ ఏంటో?ఇస్తాంబుల్ విమానాశ్రయం రోజుకు 2 లక్షల 20వేల మందికంటే ఎక్కువమంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నప్పటికీ, ఇక్కడి ధరలు మాత్రం విదేశీ పర్యాటకులకు షాకిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో హై-ఎండ్ ట్రాన్సిట్ హబ్‌గా పేరొందిన ఇస్తాంబుల్ విమానాశ్రయంపై రాబోయే నెలల్లో విమర్శలు మరింత వెల్లువెత్తే అవకాశం ఉందని అంచనా. -
నేపాల్ పరిణామాలకు బాధ్యులెవరు?
మహారాజు జ్ఞానేంద్రకు మద్దతుగా నేపాల్‌లో ఏదో ఒక ప్రాంతంలోఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఇవి నేపాల్‌లో ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్చ్ 28వ తేదీన ఇవి ఘర్షణ స్థాయికి చేరి ఇద్దరు వ్యక్తులు మరణించగా అనేకమంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. ఇందుకు మహారాజు, ఆయన మద్దతుదారులు బాధ్యులని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు రాజు 8 లక్షల రూపాయల జరి మానా చెల్లించాలని కూడా ఆదేశించింది. దీన్ని ప్యాలెస్ఖండించింది. మరోవైపు ప్రభువు మద్దతుదారులంతా నిధులు సేకరించి సొమ్ము చెల్లించటానికి సిద్ధమవుతున్నారు.ఒకప్పుడు రాచరికాన్ని కాదనుకున్న నేపాలీ సమాజం ఇప్పుడు రాజుకు ఎందుకు మద్దతు పలుకుతోంది? ఇందుకు నేపాల్ పాలకుల తీరే కారణం. 2008లో నేపాల్‌లో రాచరికం రద్దయిన తర్వాత 17 ఏళ్ల కాలంలో 18 ప్రభుత్వాలు నేపాల్‌ను పాలించాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా సజావుగా పాలించిన రికార్డు లేదు. అవసరార్థం సర్దుబాట్లు చేసుకుని సంకీర్ణ ప్రభుత్వాలను నడిపారు. ఇప్పటి కేపీ ఓలి, షేర్ కుమార్ దుబా, ప్రచండ... ఇలా ప్రధానులంతా తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న వారే. రాజకీయ అస్థిరత ఒకవైపు, అవినీతి మరోవైపు నేపాల్‌ను దారుణంగా దెబ్బతీశాయి. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఉపాధి అవకాశాలు తగ్గి పోయాయి. యువత దేశాన్ని వదిలి ఉపాధి కోసం బయట దేశాలకు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజు మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. రాచరికాన్నిరద్దు చేయటం వల్ల నేపాల్ సార్వభౌమాత్వానికి దెబ్బ తగిలిందనీ, తిరిగి రాజు అధికారం చేపడితే ప్రపంచ దేశాల్లో నేపాల్ గుర్తింపు సంపాదిస్తుందని భావిస్తున్న వాళ్లు కొందరు ఉన్నారు. మరొక అంశం ‘హిందూత్వ’. నేపాల్‌ను హిందూ స్టేట్‌గా మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇందుకోసం తెరవెనక ప్రయత్నాలు సాగుతున్నాయి. మహరాజు జ్ఞానేంద్ర ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ కావటం, ఆయన ఫొటోలు నేపాల్ వీధుల్లో దర్శనం ఇవ్వటం వంటి ఇటీవల పరిణామాలు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. అల్లర్ల వెనక భారత్ ఉందని నేపాల్ ప్రభుత్వం ఆరోపించటానికి ఇది కూడా ఒక కారణమని మనం భావించవచ్చు. ఇప్పుడు చెలరేగుతున్న ఆందోళనలు రానున్న రోజుల్లో ఎటు దారితీస్తాయో తెలి యదు. నేపాల్‌లో ఆందో ళనలకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నాయకత్వం వహిస్తున్నా, ఇందులో అసాంఘిక శక్తులతో పాటు చైనా పాత్రను కొట్టేయలేం. చాలా కాలంగా చైనా ఆధ్వ ర్యంలో నేపాల్‌లో భారత్ వ్యతిరేక కార్యక్రమాలు సాగుతున్నాయి. దీనికి కమ్యూనిస్టు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. సరిహద్దులో ఆగడాలను చూసీ చూడకుండా వదిలేస్తోంది. భారత్‌తో సంబంధాలు దెబ్బ తిన్నప్పుడు రాజు జ్ఞానేంద్ర చైనాతో స్నేహంగా మసిలిన మాట నిజమే. అలాగని ఆయనకు ఇప్పుడుచైనా మద్దతుగా ఉంటుందని భావించలేం. నేపాల్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని యూఎస్, యూకే, ఇండి యాలు గుర్తిస్తున్నాయి. ప్రజాపాలన నుంచి రాచరికంలోకి మారినంత మాత్రాన నేపాల్ అభివృద్ధి ఫలాలను అందుకుంటుందని చెప్పలేం. రాజు అధికారంలోకి వస్తే అన్నీ సర్దుకుంటాయన్న భావన తార్కికంగా సమంజసంగా లేదు. మార్పు మంచిదే. అదీ అభివృద్ధికి తోవ చూపించినప్పుడే కదా? డా.పార్థసారథి చిరువోలు సీనియర్ జర్నలిస్ట్ -
బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!
నమ్మేవాళ్లుండాలే గానీ ఎంతటి మోసానికి పాల్పడవచ్చు. కానీ మోసం ఎంతోకాలం దాగదు. ఎప్పటికైనా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం తప్పదు.చైనాకు చెందిన ఒక మహిళ స్టోరీలో అక్షరాలా ఇదే జరిగింది. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ నాడకమాడి, బంధువులను నిలువునా ముంచేసింది. చివరికి ఆమె కుట్ర గుట్టు రట్టు అయింది. విచారించిన కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. ఇంతకీ ఆమె వలలో బంధువులు ఎలా పడ్డారు? ఈ స్కామ్ వెలుగులోకి ఎలా వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరీ స్టోరీ చదవాల్సిందే!చైనాకు చెందిన మంగ్ (40) అనే మహిళ పెద్ద ప్లానే వేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆమె ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నిర్వహించేది. కానీ అందులో నష్టాలు రావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసింది. బిలియనీర్, రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ బంధువులను నమ్మించింది. ఫ్యామిలీని సైతం మోసం చేయాలనుకుంది. మందస్తు పథకం ప్రకారం డ్రైవర్ జియాంగ్ను పావుగా ఎంచుకుంది. ఈ విషయంలో జియాంగ్ను కూడా బాగానే బుట్టలో వేసుకుంది. ప్రేమిస్తున్నట్టు నమ్మిచింది. తన వయస్సు కారణంగా వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని అందుకే పెళ్లి చేసుకుందామంటూ ఒప్పించింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇక ఆ తరువాత తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. అనేక పెద్ద ప్రాజెక్టుల వెనుక రియల్టర్ అయిన తన భర్త జియాంగ్ ఉన్నాడని బంధువులను నమ్మించింది. తక్కువ ధరకే, అతి చౌకగా విలువైన ఆస్తులను దక్కించుకోవచ్చని ఆశపెట్టింది. అంతేకాదు మెంగ్ రూ.1.2 కోట్ల విలువైన ఒక చిన్న ఫ్లాట్‌ను కూడా కొనుగోలు చేసి, దానిని సగం ధరకు బంధువుకు విక్రయించింది.తనకు గొప్ప ధర వచ్చిందని బంధువులకు అబద్ధం చెప్పమని జియాంగ్ను కోరింది. మరో అడుగు ముందుకేసి, కొత్త నివాస భవనాల షోరూమ్‌లకు తీసుకెళ్లి, చదరపు మీటరుకు రూ. 61వేలవరకు తగ్గుతుందని ఆశచూపిచింది. దీంతో ఆమె మోసానని పసిగట్టలేని బంధువులు రూ.14 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు) మేర డబ్బులను ముట్ట చెప్పారు.కనీసం ఐదుగురు బంధువులు ఫ్లాట్లను కొనడానికి ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. కొందరు మంచి ఆస్తికి మారాలనే ఆశతో ఉన్న ఫ్లాట్లను కూడా అమ్మేశారు.ఇక్కడే సమస్య మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రాపర్టీ బంధువులకు స్వాధీనం చేయలేదు మంగ్.ఇదీ చదవండి: అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?డిస్కౌంట్లో ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ దాట వేస్తూ వచ్చింది. ఆ తరువాత కొన్ని ఫ్లాట్లను అద్దెకు తీసుకుని, ఇవి మనవే అని వారికి చూపించింది. ఇలా కాలం గడుస్తున్నకొద్దీ, సాకులుచెబుతోంది తప్ప ఆస్తి తమ చేతికి రాకపోవడంతో ఏదో తప్పు జరిగిందని గ్రహించిన బంధువులలో ఒకరు, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారిని సంప్రదించాడు. దీంతో ఆమె అసలు స్కాం బైటపడింది. అవి అసలువి కాదని తేలిపోయింది. మెంగ్ నివసిస్తున్న ఫ్లాట్ ఆమెది కాదని వెల్లడైంది.దీంతో బాధితులంతా పోలీసులు ఆశ్రయించారు.ఈ కేసును విచారించిన కోర్టు మోసం చేసినందుకు మంగ్‌కు 12 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఫ్లాట్ల విషయంలో లీజు ఒప్పందాలపై సంతకం చేసినందుకు నకిలీ భర్త జియాంగ్‌కు కూడా ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఇతర బంధువుల ముందు అబద్ధం చెప్పిన మరో బంధువుకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. (ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త) -
మోదీ ఉక్రెయిన్ పర్యటన.. జెలెన్స్కీ భుజంపై చేతులు వేసి..
కీవ్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. భేటీలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి జెలెన్స్కీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీని అలిగనం చేసుకొని అక్కడి నుంచి రష్య దాడిలో మరణించిన చిన్నారుల స్మారక ప్రాంతానికి తీసుకొళ్లారు. వెళ్లే సమయంలో జెలెన్స్కీ భుజంపై చేతులు వేసిన మోదీ ఆత్మియంగా పలకరిస్తూ ముందుకు సాగారు. అక్కడ మరణించిన చిన్నారులకు మోదీ నివాళులర్పించారు.ఆ తర్వాత రష్యా దాడితో దెబ్బతిన్న ఉక్రెయిన్‌లో ఎలాంటి పరిణామలు చోటు చేసుకున్నాయి. ఎంత మేరకు చిన్నాభిన్నామైందో తెలుపుతూ స్థానిక మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను వీక్షించారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అంతకుముందు రెండు రోజుల పోలెండ్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి 10 గంటల పాటు రైల్‌ఫోర్స్ వన్ రైలులో ప్రయాణించి ఉక్రెయిన్ చేరుకున్నారు.President @ZelenskyyUa and I paid homage at the Martyrologist Exposition in Kyiv. Conflict is particularly devastating for young children. My heart goes out to the families of children who lost their lives, and I pray that they find the strength to endure their grief. pic.twitter.com/VQH1tun5ok— Narendra Modi (@narendramodi) August 23, 2024 రష్యా పర్యటన.. వెనువెంటనే ఉక్రెయిన్‌కు మోదీరష్యా- ఉక్రెయిన్.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న దేశాలు. అలాంటి దేశాల మధ్య యుద్ధం ఆపే దిశగా ప్రధాని మోదీ శాంతిమంత్రమెయ్యాలని చూస్తున్నారు. అందుకే రష్యాలో పర్యటించిన ఆరు వారాల తర్వాత ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. 22వ ఇండియా-రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఆహ్వానంతో ఈ ఏడాది జులై 8న మాస్కోలో పర్యటించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా పుతిన్‌ను మోదీ ఆత్మీయంగా అలింగనం చేసుకోవడం, వారిరువురూ ఆప్యాయంగా మాట్లాడుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మోదీ రష్యా వైపు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.In Ukraine today, 37 people were killed, three of whom were children, and 170 were injured, including 13 children, as a result of Russia’s brutal missile strike.A Russian missile struck the largest children's hospital in Ukraine, targeting young cancer patients. Many were… pic.twitter.com/V1k7PEz2rJ— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) July 8, 2024మోదీ తీరుపై జెలెన్స్కీ ఆగ్రహంమోదీ రష్యా పర్యటించిన రోజే కీవ్‌లోని ఓ ఆస్ప్రతిలో దాడి జరిగింది. రష్యా జరిపిన దాడిలో 37 మంది చిన్నారులు మృతి చెందారు. వారి మరణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెలెన్స్కీ మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు అక్కడికి వెళ్లి ప్రపంచంలోని అతిపెద్ద క్రిమినల్‌ను కౌగిలించుకోవడం చాలా బాధకరం అని వ్యాఖ్యానించారు.అయినప్పటికీ సమస్యను పరిష్కరించుకోవాలంటే ఘర్షణకు దిగకుండా.. చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని మొదటి నుంచి రష్యా-ఉక్రెయిన్ల మధ్య సఖ్యత కోరుకుంటున్న మోదీ.. తాజా ఉక్రెయిన్‌లో పర్యటించడంపై ప్రపంచ దేశాలు తాజాగా పరిణామాల్ని ఆసక్తికరంగా గమనిస్తున్నాయి.జెలెన్స్కీతో ప్రధాని మోదీ రెండో సారి భేటీజెలెన్స్కీతో ప్రధాని మోదీ రెండో సారి భేటీ అయ్యారు. తొలిసారి ఈ ఏడాది ఇటలీలోని అపులియాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సందర్భంగా జెలెన్స్కీని కలిశారు. ఆ సమావేశంలో ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న సమస్యల్ని పరిష్కరించేందుకు భారత్ తన శక్తిమేర ప్రయత్నిస్తోందని, చర్చలు-దౌత్యం ద్వారా శాంతికి మార్గం ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌లో వివాదానికి పరిష్కారం కనుగొనడంలో భారత్ చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని జెలెన్స్కీకి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. -
అమల్లోకి కొత్త చట్టం.. ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత విసిగిస్తే బాస్‌పై చర్యలే
ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత కూడా పలు యాజమాన్యాలు ఉద్యోగులకు ఫోన్స్ చేసి పని పేరుతో విసిగిస్తుంటాయి. ఆ వర్క్ పెండింగ్ లో ఉంది. ఈ పని చేయండి అంటూ హుకుం జారీ చేస్తుంటాయి. కానీ ఆగస్ట్ 26 నుంచి ఆ పప్పులేం ఉడకవ్. ఆఫీస్ అవర్స్ దాటిన తర్వాత పనిపేరుతో ఉద్యోగుల్ని విసిగించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్వం సిద్ధమైంది.గతేడాది ఫెయిర్ వర్క్ అమెండ్మెంట్ (రైట్ టు డిస్కనెక్ట్) చట్టం ఫెయిర్ వర్క్ యాక్ట్ 2009ని ఆస్ట్రేలియా ప్రభుత్వం సవరించింది. సవరించిన చట్టానికి ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆగస్టు 26 నుండి కొత్త పని చట్టాలు అమల్లోకి రానున్నాయి.పని సంబంధిత మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. తద్వారా ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులకు ఫోన్ చేసి ఆఫీస్ పని గురించి ఆరాతీయడం, లేదంటే వారికి వర్క్ ఫ్రమ్ ఇవ్వడం కుదరదు. ఒకవేళ తమ బాస్ అప్పగించిన పని చేయాలా? వద్దా? అని ఉద్యోగులు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.కాగా, విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన ఉద్యోగులు.. ఆఫీస్‌తో సంత్సంబంధాలు కొనసాగించడకుండా ఉండేలా ఇప్పటికే పలు దేశాలు చట్టాల్ని సవరించాయి. తాజాగా వాటి సరసన ఆస్ట్రేలియా చేరింది. ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యంగా చట్టాల్ని అమలు చేసిన దేశాల జాబితాలో ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, అర్జెంటీనా, చిలీ, లక్సెంబర్గ్, మెక్సికో, ఫిలిప్పీన్స్, రష్యా, స్లోవేకియా, స్పెయిన్, అంటారియో,ఐర్లాండ్‌లు ఉన్నాయి. -
అప్పుడు వై2కే బగ్‌తో అతలాకుతలం .. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్
20 ఏళ్ల క్రితం వై2కే బగ్ (దానికి మరో పేరు మిలీనియం బగ్) కంప్యూటర్లను గడగడలాడించింది. ఈ బగ్ వల్ల అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏ తరహా ఇబ్బందులు తలెత్తాయో ఇవాళ (జులై 19) మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ వై2కే బగ్ కథాకమామిషు ఏంటి? వై2కే బగ్‌కి క్రౌడ్ స్ట్రైక్‌కి ఏదైనా సంబంధం ఉందా?ప్రపంచంలోని అన్నీ దేశాల మైక్రోసాఫ్ట్ సర్వర్లలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పర్సనల్ కంప్యూటర్లలోని విండోస్-11, 10లో ఆపరేటింగ్ సిస్టమ్‌లో సమస్య తలెత్తింది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్‌తో నడుస్తున్న పీసీలు, ల్యాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ప్రత్యక్షమవుతుంది. పలుమార్లు పీసీలు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్ అవుతున్నాయి. విండోస్‌లోని సాంకేతిక సమస్యలతో భారత్, అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. బోర్డింగ్ పాస్‌లను సైతం చేతి రాత ఉపయోగించాల్సి వచ్చింది. అయితే విండోస్‌లోని తలెత్తిన సమస్యల్ని పరిష్కరించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మైక్రోసాఫ్ట్‌ను విజ్ఞప్తి చేస్తుండగా ..ఈ ప్రస్తుత పరిస్థితి 2000 ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పెట్టిన వై2కే బగ్ లాగా తీవ్ర ఆందోళనను రేకెత్తిచ్చింది. సర్వర్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలకు మైక్రోసాఫ్ట్ పరిష్కారం చూపింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో సమస్యలు అదుపులోకి వచ్చాయి. ఏంటి ఈ వై2కే బగ్?1960-1980లలో కంప్యూటర్ల ఆపరేటింగ్ సిస్టమ్ తయారుచేసే సమయంలో డేటా స్టోరేజీని ఆదా చేసేందుకు కంప్యూటర్ ఇంజనీర్లు సంవత్సరానికి రెండు అంకెల ‘19’ కోడ్‌ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 31,1999 తర్వాత కొత్త ఏడాది అంటే 2000 సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత పోగ్రామర్లు వినియోగించిన కోడ్‌ను 00గా భావించి 2000 ఏడాదిగా కాకుండా 1900గా కంప్యూటర్లు అర్థం చేసుకున్నాయి.ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే 100 సంవత్సరాలుగా తీసుకుని ప్రోగ్రామర్లు తేది పరిమాణాన్ని 100 సంవత్సరాలుగా తీసుకుని (1900 నుండి 1999 వరకు) ప్రోగ్రాం రాసారు. 1999 వరకు ఏ సమస్యా లేకుండా సాగిపోయింది. అయితే 2000వ సంవత్సరం రాగానే కంప్యూటర్లు దాన్ని 00గా పరిగణించాయి. ఏడాది 2000 అయితే ప్రోగ్రామర్లు ఫిక్స్ చేసిన 19 కోడ్ కారణంగా 1900 తీసుకున్నాయి. ఫలితంగా ఆ ఏడాది టెక్నాలజీ రంగం అతలాకుతలమైంది. ఇతర రంగాలు సైతం తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కున్నాయి. బగ్‌ను పరిష్కరించేందుకు ప్రోగ్రాం అందుబాటులోకి రావడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది. కానీ పాత సంవత్సరం ముగిసి.. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత వై2కే కారణంగా కొత్త సమస్యలు ఉత్పన్నమవ్వడం సాధారణమేనని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. క్రౌడ్ స్ట్రైక్ వర్సెస్ వై2కే బగ్ఆ వై2కే బగ్‌కి తాజా మైక్రోసాఫ్ట్ సర్వర్‌లో ఇబ్బందులకు ఏదైనా సంబంధం ఉందా అంటే లేదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ ప్రముఖ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర టెక్నాలజీ కంపెనీలకు, పలు ప్రభుత్వ విభాగాలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్‌కు క్రౌడ్‌స్ట్రైక్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. దాని ఫలితంగానే మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్‌లోని ఇబ్బందులు తలెత్తి సిస్టమ్‌లు షట్‌డౌన్ , రీస్టార్ట్ అవుతున్నాయని టెక్నాలజీ రంగ నిపుణులు చెబుతున్నారు. -
రష్యా చేసిన నష్టానికి రష్యా నిధులే వాడతారట.!
యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ ఆదుకునేందుకు G7 దేశాలు కొత్త వ్యూహం అనుసరిస్తున్నాయి. వేర్వేరు దేశాల్లో స్తంభింపజేసిన రష్యా నిధులను ఉక్రెయిన్‌కు కేటాయించాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి 50 బిలియన్ డాలర్లు సాయం చేయాలని నిర్ణయించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత.. 300 బిలియన్ యూరోల రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను G7 దేశాలు స్తంభింపజేశాయి. దీనిపై వచ్చిన వడ్డీలో 50 బిలియన్ డాలర్లను రుణం కింద అందించాలని ఈయూ ప్రతిపాదించింది.యుద్ధంలో ధ్వంసమైన ఉక్రెయిన్ను పునర్ నిర్మించాలంటే 486 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులనే కాకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులైన ఒలిగార్చ్ ఆస్తులను కూడా EU, G7 దేశాలు స్తంభింపజేశాయి. పడవలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆస్తుల మొత్తం విలువ 397 బిలియన్ డాలర్లుగా యుక్రేనియన్ థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ ఐడియాస్ అంచనా వేసింది.ఇక రష్యాకు చెందిన మెజార్టీ ఆస్తులను ఈయూ దేశాలు స్తంభింపచేశాయి. దాదాపు 185 బిలియన్ యూరోలు బెల్జియంలోని అంతర్జాతీయ డిపాజిట్ సంస్థ అయిన యూరోక్లియర్ జప్తు చేయగా.. మిగతా ఆస్తులను బ్రిటన్, ఆస్ట్రియా, జపాన్, స్విట్జర్లాండ్, యూఎస్ దేశాలు సీజ్ చేశాయి. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో ఈయూ దేశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. నిజానికి.. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ డబ్బును పశ్చిమ దేశాలు జప్తు చేయకుండా అంతర్జాతీయ చట్టం నిషేధిం విధించింది. ఇప్పుడు దీని నుంచి తప్పించుకునేందుకు సీజ్ చేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే వడ్డీని ఉక్రెయిన్‌కు రుణం కింద అందించాలని భావిస్తున్నాయి.ఉక్రెయిన్‌కు రుణం అందించే విషయంలో పలు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇంతకుముందు యూఎస్ రుణాలు అందిస్తుందని భావించగా.. ఇప్పుడు G7 దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యమయ్యాయి. ఈ దేశాల నుంచి ఎవరు రుణాన్ని అందిస్తారనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. రుణం మంజూరు చేయాలంటే ఈయూ సభ్య దేశాలన్నింటి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒకవేళ యుద్ధం నుంచి రష్యా విరమించుకొని ఆస్తులను తిరిగి ఇవ్వాల్సి వస్తే ఏం జరుగుతుందనే దానిపై కూడా ఆయా దేశాల మధ్య స్పష్టత లేన్నట్లు తెలుస్తోంది. చైనా వంటి దేశాలు పశ్చిమ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. -
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
భారీ వరదలు, విరిగిపడిన కొండచరియలు ఇండోనేషియాలో విధ్వంసం సృష్టించాయి. ఇక్కడి సులవేసి దీవిలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మృతి చెందారు. వివిధ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.అక్కడి అధికారులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని లువు జిల్లాలో గురువారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇండోనేషియాలో ఇప్పటి వరకు 13 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రబ్బరు పడవలు, ఇతర వాహనాలను ఉపయోగించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.ఇండోనేషియా కంటే ముందు బ్రెజిల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ రాష్ట్రం రియో గ్రాండే దో సుల్లో 37 మంది మృతి చెందారు. అల్ జజీరా నివేదిక ప్రకారం విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 37. 74 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. కూలిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్న బాధితులను అదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ ఎడ్వర్డో లైట్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియో ప్రభావిత ప్రాంతాలకు సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
ఎండలకు చచ్చిపోతున్న చేపలు.. వ్యాపిస్తున్న దుర్వాసన!
మండుతున్న ఎండలు మన దేశాన్నే కాదు ప్రపంచంలోని పలు దేశాలను భయపెడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు అటు జనాలను, ఇటు జీవాలను మలమలమాడిపోయేలా చేస్తున్నాయి. కరువు బారిన పడిన దక్షిణ వియత్నాంను ఈ ఎండలు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దక్షిణ వియత్నాంలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చేపలను బలి తీసుకుంటున్నాయి. 300 హెక్టార్లలో విస్తరించి ఉన్న ‘సాంగ్ మే’ చెరువులోని వేలాది చేపలు ఎండ వేడికి తాళలేక చనిపోయాయి. డాంగ్ నైలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది. 1998లో ఈ ప్రాంతంలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రిజర్వాయర్ నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం కూడా చేపలు చనిపోవడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత వేసవి కాలంటో 200 టన్నులకు పైగా చేపలు చనిపోయాయి. అత్యధిక ఉష్ణోగ్రత, నీటి కొరత కారణంగా ఈ చేపలు చనిపోయాయని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన చేపల వాసన గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో విపరీతంగా వ్యాపించడంతో ఇక్కడి జనం నానా అవస్థలు పడుతున్నారు. ఈ చనిపోయిన చేపలను చెరువులో నుంచి తొలగించే పనిలో మత్స్యకారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం విచారణ ప్రారంభించింది. -
ఆసియా అంతటా భానుడి భగభగలు
దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలకు ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పలు దేశాల్లో ఆరోగ్య హెచ్చరికలు జారీ చేయడంతో పాటు స్కూళ్లను మూసివేశారు.అటు ఫిలిప్పీన్స్ నుండి థాయ్‌లాండ్ వరకు, ఇటు భారతదేశం నుంచి బంగ్లాదేశ్ వరకు రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు మించవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అత్యధిక ఉష్ణోగ్రతల నేపధ్యంలో బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్‌లో పాఠశాలలను మూసివేశారు. మరోవైపు ఇండోనేషియాలో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో శనివారం ఉష్ణోగ్రత 38.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఇది దశాబ్దాల క్రితం నాటి ఉష్ణోగ్రతల రికార్డును అధిగమించింది.ఈ వేడి వాతావరణం మే మధ్యకాలం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి కొరత, కరెంటు కోతలు, పంట నష్టం మొదలైన సమస్యలు ఎదురవుతున్నాయి.కంబోడియా గత 170 ఏళ్లలో ఎప్పుడూ చూడని అత్యధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటోందని జలవనరులు, వాతావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చాన్ యుథా తెలిపారు. గడచిన వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. సెంట్రల్ మాగ్వే, మాండలే, సాగింగ్, బాగో ప్రాంతాల్లోని ఏడు టౌన్‌షిప్‌లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని మయన్మార్ వాతావరణ విభాగం వెల్లడించింది. మయన్మార్‌లోని పలు పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రపంచస్థాయి రికార్డులను దాటాయి.థాయ్‌లాండ్‌లోని కొన్ని ఉత్తర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. బ్యాంకాక్‌లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింగపూర్‌లోని వాతావరణ శాఖ దేశంలో ఉష్ణోగ్రతలు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. వియత్నామీస్ మీడియా నివేదికల ప్రకారం మధ్య వియత్నాంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో అడవుల్లో కార్చిచ్చు సంభవించే ప్రమాదం ఉందని జాతీయ వాతావరణ సంస్థ హెచ్చరించింది.మలేషియాలో వరుసగా మూడు రోజులు 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని మలేషియా వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆసియా అంతటా అత్యధిక ఉష్ణోగ్రతలు నెలకొన్నందున పలు చోట్ల ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డీహైడ్రేషన్, వడదెబ్బ సమస్యలతో ఆసుపత్రులలో చేరుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.వడదెబ్బ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు 30 మంది మృతి చెందారని థాయ్‌లాండ్ డిసీజ్ కంట్రోల్ విభాగం తెలిపింది. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వడదెబ్బ కాణంగా దేశంలో ఇప్పటివరకూ రెండు మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. ఫిలిప్పీన్స్‌లో విపరీతమైన వేడి వాతావరణం కారణంగా 34 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు మరణించారు. ఈ వివరాలను ఫిలిప్పీన్స్ ఆరోగ్య శాఖ తెలిపింది.బంగ్లాదేశ్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ 20 మంది వడదెబ్బ కారణంగా మృతిచెందారు. ఇండోనేషియాలో అత్యధిక ఉష్ణోగ్రతలు డెంగ్యూ జ్వరాలకు దారి తీస్తున్నాయి. దోమల ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్, కేసుల కంటే డెంగ్యూ జ్వరాలు రెండింతల మేరకు పెరిగాయని బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
దయనీయ స్థితిలో ఆఫ్గన్ శరణార్థులు
పొరుగుదేశం పాకిస్తాన్లో ఆఫ్గన్ శరణార్థులు దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లబుచ్చుతున్నారు. గత ఏడాది అక్టోబర్ నుండి ఇప్పటి వరకూ సుమారు ఆరు లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులను పాకిస్తాన్ వారి స్వస్థలాలకు బలవంతంగా తిరిగి పంపింది. అయితే ఇప్పటికీ పాక్‌లో కనీసం 10 లక్షల మంది ఆఫ్గన్ శరణార్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.బహిష్కరణ భయంతో ఆఫ్గన్ శరణార్థులు అజ్ఞాతంలో జీవిస్తున్నారు. పాకిస్తాన్లో తల దాచుకుంటున్న వీరు తిరిగి ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. తలదాచుకున్న ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. దీంతో వీరికి జీవనోపాధి, అద్దె ఇల్లు, నిత్యావసరాల కొనుగోలు మొదలైనవి ఎంతో కష్టతరంగా మారాయి.తాజాగా కరాచీ పోలీసులు 18 ఏళ్ల ఆఫ్గన్ యువకుడి నుంచి నగదు, ఫోన్, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని డిపోర్టేషన్ సెంటర్‌కు పంపారు. అక్కడి నుంచి ఆ యువకుడిని ఆఫ్ఘనిస్థాన్‌కు తరలించారు. కాగా అతని తల్లిదండ్రులు 50 ఏళ్ల క్రితం ఆఫ్గనిస్తాన్ వదిలి పాక్ తరలివచ్చారు.ఆ యువకుడు ఇంతవరకూ ఎప్పుడూ ఆఫ్గనిస్తాన్‌కు వెళ్లలేదు. అతనిని ఆఫ్గనిస్తాన్ తరలించినప్పుడు అతని దగ్గర కట్టుబట్టలు తప్ప మరేమీ లేవని స్థానికులు చెబుతున్నారు. ఆఫ్గనిస్తాన్‌లో యుద్ధ పరిస్థితుల మధ్య 17 లక్షల మంది పాకిస్తాన్‌కు వచ్చి ఆశ్రయం పొందారు. ఇలా చట్టపరమైన అనుమతులు లేకుండా వచ్చినవారిని తిరిగి ఆ దేశానికి పంపేందుకు పాక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. -
లండన్‌లో బీజేపీ మద్దతుదారుల పాదయాత్ర
ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా బ్రిటన్‌లోని ప్రవాస భారతీయులు, బీజేపీ మద్దతుదారులు లండన్‌లో రన్ ఫర్ మోదీ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనిలో పెద్ద సంఖ్యలో ఎన్నారైలు పాల్గొని బీజేపీపై, ప్రధాని మోదీపై తమకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు.2019 ఎన్నికల సమయంలోనూ రన్ ఫర్ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ యూకే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ప్రధాన కార్యదర్శి సురేష్ మంగళగిరి తెలిపారు. నాడు కూడా ప్రజలు బీజేపీపై తమ అభిమానాన్ని ఇదే రీతిలో వ్యక్తం చేశారన్నారు. బీజేపీపై, ప్రధాని మోదీపై ఎన్నారైలకు అమితమైన ప్రేమ ఉన్నదన్నారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 తొలగింపు తదితర మంచి పనులను బీజేపీ చేపట్టిందని సురేష్ పేర్కొన్నారు. లండన్‌లో నిర్వహించిన రన్ ఫర్ మోదీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మద్దతుదారులు ఆ పార్టీ జెండాలను చేత పట్టుకుని ‘భారత్ మాతా కీ జై’ ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో 400కు పైగా ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
రుణం కోసం ఐఎంఎఫ్‌ను సంప్రదించిన పాక్!
పొరుగు దేశం పాకిస్తాన్ రుణ సాయం కోసం మరోమారు చేయి చాచింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తమ దేశానికి కొత్త రుణం కోసం అభ్యర్థించారు.పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమావేశంలో పాక్‌కు మూడు బిలియన్ యూఎస్ డాలర్లు ఎస్బీఏ కింద అందించేందుకు ఐఎంఎఫ్ మద్దతు ఇచ్చినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను పీటీవీ న్యూస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలిపింది. కాగా స్టాండ్‌బై అరేంజ్మెంట్ (ఎస్బీఏ) కింద 1.1 బిలియన్ డాలర్ల రుణంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సోమవారం సమావేశం కానుంది.గత ఏడాది జూన్‌లో జరిగిన ఐఎంఎఫ్ కార్యక్రమంలో పాకిస్తాన్ మూడు బిలియన్ డాలర్ల రుణం అందుకుంది. తాజాగా జరిగిన డబ్ల్యుఈఎఫ్ ప్రత్యేక సమావేశంలో పాక్ ప్రధాని షరీఫ్ ‘ప్రపంచ ఆరోగ్య అజెండాను పునర్నిర్వచించడం’పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ అసమానతలను ప్రస్తావించారు. 2003లో సౌదీ అరేబియా వెళ్లినప్పుడు తనకు క్యాన్సర్ సోకిందని షరీఫ్ తెలిపారు. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్లి వేల డాలర్లు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి ఖరీదైన చికిత్సను తమ దేశంలోని ప్రజలు భరించలేరని తెలిపారు.తాను పాకిస్తాన్‌కు తిరిగి వచ్చినప్పుడు, పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, తమ ప్రభుత్వం కిడ్నీ, కాలేయ వ్యాధులతో పాటు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించిందని షాబాజ్ చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఆరోగ్య అసమానతలను, లోపాలను బహిర్గతం చేసిందని షరీఫ్ పేర్కొన్నారు. -
అమెరికా వృద్ధిలో భారతీయుల వాటా ఎంత?
అమెరికాలో నివసిస్తున్న మన భారతీయుల్లో 65,960 మందికి అగ్రరాజ్య పౌరసత్వం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. అనేకమంది మనవారు అక్కడ ఎప్పటి నుంచో నివసిస్తున్నా అందరికీ అక్కడి పౌరసత్వం లేదు. మనదేశంలో పుట్టి అక్కడ జీవిస్తున్నవారిలో దాదాపు 42 శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సీ ఆర్ ఎస్ నివేదిక తెలుపుతోంది.2023 నాటికి గ్రీన్ కార్డ్ లేదా లీగల్ పర్మినెంట్ రెసిడెన్సీ వున్న 2,90,000 మంది భారతీయులకు సహజ విధానంలో పౌరసత్వం పొందే అవకాశం వుందని చెబుతున్నారు.అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు ఆ దేశ జనాభాలో 14శాతం. గతంతో పోల్చుకుంటే అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది.సాఫ్ట్ వేర్ రంగం పెరుగుతున్న కొద్దీ మనవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. విద్యార్థులు కూడా పెరుగుతున్నారు. తెలుగువారు కూడా బాగా పెరుగుతున్నారు.1.35 శాతంతో దాదాపు 50లక్షల మందికి పైగా మనవారు అగ్రరాజ్యంలో నివసిస్తున్నారు. కొత్తగా 65,960 మంది అధికారిక అమెరికా పౌరులయ్యారు. అగ్రరాజ్య పౌరసత్వం పొందాల్సిన మనవాళ్ళు ఇంకా చాలామంది వున్నారు.17 వ శతాబ్దం నుంచే మనవాళ్ళు అమెరికాకు వెళ్తున్నారు, కొందరు అక్కడే జీవిస్తున్నారు.వాళ్ళ అవసరాల కోసం మనవారిని వాళ్ళ సేవకులుగా తీసుకెళ్లడం అప్పటి నుంచే ప్రారంభమైంది."వాళ్లు సేవకులు కాదు బానిసలు" అని మన చరిత్రకారులు అంటున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మనవారిని వాళ్ళ కాలనీలకు తరలించుకొని తీసుకెళ్లారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇది మరో రూపం తీసుకుంది. కొంతమంది ఉపాధి కోసం, కొంతమంది విద్య కోసం అమెరికా బాట పట్టారు. ఈ నాలుగు దశాబ్దాలలో ఆ సంఖ్య క్రమంగా గణనీయంగా పెరిగింది.1900 ప్రాంతంలో సిక్కులు ఎక్కువగా కాలిఫోర్నియా ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. స్వామి వివేకానంద చికాగో ప్రయాణం, ఉపన్యాసం పెద్ద ప్రభావాన్ని చూపించింది. వేదాంత సొసైటీ స్థాపనకు దారితీసింది. సిక్కులను కూడా అమెరికాలో ఒకప్పుడు హిందువులనే పిలిచేవారు. ఒక దశలో,భారతదేశం నుంచి వలసలను అరికట్టాలని కూడా అమెరికా చూసింది. ఇమిగ్రేషన్ చట్టాన్ని మరింత బలంగా నిర్మాణం చేయడంతో మన వాళ్ళ అమెరికా వలసలు తగ్గిపోయాయి. 1920ప్రాంతంలో భారతీయ అమెరికన్ల జనాభా కేవలం 6,400. ప్రస్తుతం 50లక్షలు. ఈ వందేళ్లలో మనవాళ్ళ జనాభా ఎన్నిరెట్లు పెరిగిందో? దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.మన జనాభా పెరగడానికి కారణాలలో విద్య ప్రధానమైంది. దానికి మూలం మన ప్రతిభ. 1920ల్లో మన ప్రతిభ చూపించి వాళ్ళను గెలిచినవారిలో మన యల్లాప్రగడ సుబ్బారావు పేరెన్నిక కన్నవారు. గోవింద్ బిహారీ లాల్ కూడా చాలా గొప్పవారు. జర్నలిజంలో ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడు. అక్కడి నుంచి మొదలైన మన భారతీయ ప్రతిభా ప్రయాణం నేడు ఐటీ దిగ్గజాలు సత్య నాదెండ్ల, సుందర పిచ్చయ్య వంటివారు వరకూ సాగింది. మన దేశ మూలాలు కలిగిన కమలా హ్యారిస్ ప్రస్తుతం అగ్రరాజ్య ఉపాధ్యాక్షురాలుగా పదవిని అలంకరించారు. బానిసల గతి నుంచి బాసుల స్థాయికి మన భారతీయులు ఎదగడం గర్వకారణం.వ్యాపార, వాణిజ్యాలలో మనవారు అక్కడ అద్భుతంగా రాణిస్తున్నారు.మానవవనరులలో మనది గౌరవనీయమైన స్థానం. వైట్ హౌస్ లోనూ మనవారి ప్రాతినిధ్యం పెరుగుతోంది. అమెరికా ఎన్నికల్లో ఆర్ధిక సహాయం అందించేవారిలో మనవాళ్ళు కీలకంగా వున్నారు. కాకపోతే, రాజకీయ భాగస్వామ్యంలో మాత్రం వెనుకబడి వున్నారు. అమెరికాలో ఓటు హక్కున్న మనవాళ్ళు చాలామంది అస్సలు ఓటే వెయ్యరని మన వాళ్లే అంటారు. ఇది ఏ మాత్రం ఆహ్వానించదగిన విషయం కాదు. ఎన్నికల్లో నిలుచుండే అభ్యర్థులకు డబ్బులిస్తే సరిపోదు. ఎన్నికల్లో నిలబడాలి, ముఖ్యంగా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి.సాఫ్ట్ వేర్ రంగం తాజాది. వైద్యం, విద్య, పరిశోధన, మార్కెటింగ్ విభాగాల్లోనూ మనవాళ్ళు గౌరవనీయమైన సంఖ్యలోనే వున్నారు.అంతర్జాతీయ సంబంధాలలో అమెరికా ఒకప్పుడు పాకిస్తాన్ కే ఎక్కువ మద్దతు చూపించేది. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా అధికారం పీఠం ఎక్కిన తర్వాత మన విదేశాంగ విధానంలో కొత్త వ్యూహాలు అల్లడం మొదలుపెట్టారు. అందులో అమెరికా బంధాలు కీలకమైనవి. చైనాతో ఎప్పటికైనా ఇబ్బందులు వస్తాయని ఆయన ముందే గ్రహించి ఈ అడుగు వేశారు. మన్ మోహన్ సింగ్ అదే బాటలో నడిచారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక సరికొత్త రూపును తెచ్చారు. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ తో వ్యక్తిగత స్నేహాన్ని నెరిపారు. ట్రంప్ ఎన్నికలకు అమెరికా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. ట్రంప్ ను ఇండియా ఆహ్వానించి గుజరాత్ లో లక్షమందితో పెద్ద సభ ఏర్పాటు చేసి, ట్రంప్ ను తన్మయంలో మునకలు వేయించారు.అమెరికాలో ప్రధానంగా వున్న రాజకీయ పార్టీలు రెండు. ఒకటి డెమోక్రటిక్ పార్టీ , రెండోది రిపబ్లికన్ పార్టీ. మనవాళ్ళు మొదటి నుంచి ఎక్కువ శాతం సహజంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతు అందించారు. క్రమంగా రిపబ్లికన్ పార్టీ వైపు కూడా మొగ్గు చూపడం ప్రారంభించారు. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ సమయంలో ఈ పరిణామం జరిగిందని అంటారు. బిల్ క్లింటన్, బరాక్ ఒబామా నుంచి జో బైడెన్ వరకూ అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారు భారతదేశం పట్ల ప్రత్యేక ప్రేమ చూపించి నట్లు కనిపించినా, వారి ప్రేమ ఒకింత పాకిస్తాన్ వైపే ఎక్కువగా ఉండేదని కొందరు వ్యాఖ్యానిస్తారు. వీరితో పోల్చుకుంటే డోనాల్డ్ ట్రంప్ కు భారత్ పట్ల ఆకర్షణ, అనురాగం ఎక్కువని కొందరు అంటారు.రేపు జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ - బైడెన్ మధ్య హోరాహోరి పోరు వుంది. ట్రంప్ అధికారంలోకి వస్తే భారత్ కు, అక్కడ నివసించే భారతీయులకు ఎక్కువ మేలు జరుగుతుందని ఒక వర్గం అంటోంది. మనది ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్. మనతో అగ్రరాజ్యానికి చాలా అవసరం వుంది. గతంతో పోల్చుకుంటే మన అవసరం ఆ దేశానికి పెరుగుతోంది. అమెరికా - భారత్ మధ్య వాణిజ్య, వ్యాపారాలు పెరుగుతున్నాయి. ఇంకా పెరగాల్సి వుంది. పెట్టుబడులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అక్కడ నివసించే మన వారికి పన్నుల రాయతీలోనూ, వ్యాపార ప్రోత్సాహకాలలోనూ, పౌరసత్వ కల్పనలోనూ, రాజకీయ భాగస్వామ్యంలోనూ ఇంకా సహకారం ఎంతో పెరగాల్సి వుంది. ఇమిగ్రేషన్, వీసాల అనుమతులు, ఉద్యోగాల కల్పనలో అగ్రరాజ్యం ఇంకా ఉదారంగా వ్యవహరించాలి.ప్రస్తుతం,అమెరికాలో కీలక భూమిక పోషిస్తున్న భారతీయులు భవిష్యత్తులో మరింత కీలకమైన వ్యక్తులుగా, వ్యవస్థలుగా మారతారని నిస్సందేహంగా చెప్పవచ్చు. అగ్రరాజ్యంలో భారతీయుల అధికారిక అమెరికా పౌరుల సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరుగుతుందని అంచనా వెయ్యవచ్చు.ఇప్పటికే పౌరసత్వం వున్న కొందరికి సంపూర్ణమైన స్వేచ్ఛ లేదు.దానికి కూడా పరిష్కారం లభించాలి. ఉభయ పౌరసత్వం ( అమెరికా - భారత్ ) పట్ల కూడా అడుగులు పడవచ్చు.- మాశర్మ. సీనియర్ జర్నలిస్టు -
ఈ జనహననం ఇంకెన్నాళ్లు?
ఇంటి దీపమని ముద్దాడితే మూతి కాలినట్టు గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న జనహననాన్ని సమర్థిస్తున్న అమెరికాకూ, దాని పాశ్చాత్య మిత్రులకూ ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్టుంది. కాల్పుల విరమణకు సిద్ధపడి సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి తోడ్పడాలని, పౌరులకు ఎలాంటి హానీ కలగకుండా చూడాలని ఆ దేశాలు తాజాగా ఇజ్రాయెల్‌ను కోరుతున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడి హమాస్ విచక్షణారహితంగా 1,200 మందిని కాల్చిచంపి 240 మందిని అపహరించుకుపోయినప్పుడు ఆ దేశాలన్నీ ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలను ముక్తకంఠంతో సమర్థించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హుటాహుటీన ఇజ్రాయెల్ వెళ్లి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు సంఘీభావం ప్రకటించారు. ఆయనకు అండదండలందిస్తామని హామీ ఇచ్చారు. హమాస్‌పై యుద్ధం పేరుతో గాజాలో ఇజ్రాయెల్ సైన్యం పౌరుల ప్రాణాలు తీస్తున్నప్పుడూ... జనా వాసాలను బాంబులతో నేలమట్టం చేస్తున్నప్పుడూ అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలునోరు మెదపలేదు. ఉత్తర గాజాపై బాంబుల మోత మోగించబోతున్నామని, దాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హుకుం జారీచేసినప్పుడు 20 లక్షలమంది పౌరులు ప్రాణభయంతో అప్పటికే కిక్కిరిసి వున్న దక్షిణ ప్రాంతానికి వలసపోయారు. సహాయ శిబిరాలన్నీ కిక్కిరిసిపోగా ఎండకు ఎండి వానకు తడిసి అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారు. అంత దారుణ పరిస్థితుల్లోనూ పాశ్చాత్య ప్రపంచం మౌనాన్నే ఆశ్రయించింది. పైగా ఈ దశలో పోరు విరమిస్తే అది హమాస్‌ను మరింత బలోపేతం చేస్తుందని అమెరికా వ్యాఖ్యానించింది. రెండు నెలలు గడిచి, 20,000 మందికి పైగా పౌరులు హతమయ్యాక ఇప్పుడు ఆ దేశం నోట ‘కాల్పుల విరమణ’ ప్రతిపాదన వినిపిస్తోంది. కారణమేమిటో తెలుస్తూనే వుంది. హమాస్ స్థావరాలను గుర్తించి కేవలం వాటిపైన మాత్రమే దాడులు చేయాలన్న సలహానూ, సాధ్యమైనంత త్వరగా పాలస్తీనా ఆవిర్భావానికి సహకరించాలన్న సూచననూ నెతన్యాహూ బుట్టదాఖలా చేశారు. దాంతోపాటు శనివారం హమాస్ చెరనుంచి తప్పించుకునో, వాళ్ల అనుమతితోనో బయటకు వచ్చిన ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులను సైన్యం వెనకా ముందూ చూడకుండా కాల్చిచంపిన ఉదంతం ఈ దాడుల ఉద్దేశాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం సైతం అది ఘోరతప్పిదమని అంగీకరించింది. ఆ తర్వాతే యుద్ధం ‘గతి తప్పిందని’ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ నిర్ధారణకొచ్చారు. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఆయనతో స్వరం కలిపాయి. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధంవల్ల అమాయక పౌరుల ప్రాణాలు పోతున్నాయని అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలూ ఏడాదిన్నరగా అంతర్జాతీయ వేదికలపైనా, బయటా ఆరోపిస్తు న్నాయి. కానీ గాజా విషయంలో మాత్రం వేరే ప్రమాణాలు పాటించాయి. కాల్పుల విరమణ ప్రక టించాలని ఇజ్రాయెల్‌ను కోరే తీర్మానాన్ని భద్రతామండలిలో అమెరికా మూడుసార్లు వీటోచేసింది. బైడెన్ తన ‘అత్యవసర అధికారాలను’ వినియోగించి ఆ దేశానికి ఆయుధాలు కూడా సర ఫరా చేశారు. చేసేవన్నీ చేశాక ఇప్పుడు సాధారణ పౌరుల ప్రాణాలకు హాని కలగకూడదని, కేవలం హమాస్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకోవాలని సుద్దులు చెప్పటంలోని ఆంతర్యమేమిటి? ఇజ్రాయెల్ చర్యల పర్యవసానంగా చోటుచేసుకుంటున్న ఉత్పాతాల గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ వంటి పత్రి కల్లో వస్తున్న కథనాలు దిగ్భ్రాంతికరంగా వుంటున్నాయి. నసర్ అల్ అస్తాద్ అనే వ్యక్తి మినహా ఆ కుటుంబం, వారి బంధువర్గం మొత్తం 100 మంది ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారని, మొత్తం ఆ వంశమే తుడిచిపెట్టుకుపోయిందని ఆ కథనం సారాంశం. ఈ రెండున్నర నెలల్లో ఐక్యరాజ్యసమితి సహాయ బృందాలకు సంబంధించిన కార్యకర్తలు 135 మంది దాడుల్లో చనిపోయారు. సమితి 78 యేళ్ల చరిత్రలో ఏ ఘర్షణలోనూ ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు లేవు. ఈనెల 10న జరిగిన వైమానిక దాడిలో తమ కార్యకర్త, అతని భార్య, నలుగురు పిల్లలు, అతని బంధువర్గంలోని అనేకులు మరణించారని అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ప్రకటించింది. అయిదేళ్ల క్రితం సూడాన్, అల్జీరియా, యూఏఈ తదితర దేశాల్లోని వివిధ నిర్మాణ సంస్థల్లో హమాస్ 50 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందనటానికి స్పష్టమైన ఆధారాలు లభించినా నెతన్యాహూ ప్రభుత్వం మౌనంగా వుండిపోయింది. ఆయుధాల కొనుగోలుకూ, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ డబ్బంతా వినియోగిస్తుంటే కళ్లుమూసుకున్న ప్రభుత్వం హమాస్ అక్టోబర్ దాడి తర్వాత హమాస్‌తో ఏమాత్రం సంబంధంలేని ప్రజానీకంపై విరుచుకుపడుతున్న తీరు తీవ్ర అభ్యంతరకరం. నెతన్యాహూ ధోరణికి ఆయన కేబినెట్లో వున్న తీవ్ర మితవాద పక్ష నేతలే కారణమని అమెరికా చేస్తున్న వాదన పాక్షిక సత్యమే. న్యాయస్థానాలు తన జోలికి రాకుండా అడ్డుకోవటానికి చట్టం తీసు కొచ్చి ఇజ్రాయెల్ పౌర సమాజం అసంతృప్తిని మూటగట్టుకున్న నెతన్యాహూ, హమాస్ దాడి తర్వాత మరింత అప్రదిష్టపాలయ్యారు. ఈ దాడులు ఆగాక నెతన్యాహూ నిర్వాకంపై ఎటూ ఆరా వుంటుంది, ఆయన రాజీనామా కోసం జనం ఉద్యమిస్తారు. కాస్త ముందో, వెనకో పార్లమెంటు ఎన్నికలు కూడా తప్పకపోవచ్చు. ఇది తెలిసే నెతన్యాహూ దాడుల విరమణకు ససేమిరా అంటు న్నారు. పాలస్తీనా ఏర్పాటుకు నిరాకరిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు హమాస్ చేసిన నష్టం కంటే తానే గాజాకు ఎక్కువ నష్టం చేశానని చెప్పటమే ఆయన ఉద్దేశం. ఈ జనహననాన్ని సాగనీయొద్దు. మొదట్లో ఇజ్రాయెల్‌కు మద్దతు పలికిన పాశ్చాత్య ప్రపంచమే ఈ బాధ్యత తీసుకుని పాపప్రక్షాళన చేసుకోవాలి. లేనట్టయితే మానవాళి క్షమించదు. -
Video: ‘రోబో కుక్క’ పరుగు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు
సాధారణంగా 100 మీటర్ల పరుగు పందెంలో అథ్లెట్స్ సరికొత్త రికార్డులను సృష్టించడం చూస్తూ ఉంటాం. ఉసేన్ బోల్ట్, టైసన్ గే వంటి ప్రపంచస్థాయి స్పింటర్లు ఎన్నో అరుదైన ఘనతలు తమ పేరిట లిఖించుకున్నారు. కానీ తాజాగా 100 మీటర్ల రేసులో ఒక రోబోడాగ్ చరిత్ర సృష్టించింది. హౌండ్ అనే రోబో కుక్క 100 మీటర్ల రేసును కేవలం 19.87 సెకన్లలోనే పూర్తి చేసి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డునను సాధించింది. ఈ రోబో గంటకు 11.26 మైళ్ల వేగంతో పరుగు పందెన్ని పూర్తి చేసింది. ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డులకెక్కిన తొలి నాలుగు కాళ్ల రోబోగా హుండూ చరిత్రలోకి ఎక్కింది. ఈ రోబోను దక్షిణ కొరియాలోని డేజియోన్లోని కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన యంగ్-హా షిన్ రూపొందించారు. 45 కేజీల బరువున్న ఈ రోబో పరుగుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: WI vs ENG: చివరి ఓవర్లో 21 పరుగులు.. ఇంగ్లండ్ సంచలనం! పాపం రస్సెల్ -
సుదూర విశ్వంలో అఖండ జలనిధి! భూమి కంటే 140 లక్షల కోట్ల రెట్లు
ఖగోళ శాస్త్రవేత్తలు సంచలన విషయాన్ని కనుగొన్నారు. మనకు తెలిసిన విశ్వంలో ఇప్పటివరకు ఎవరూ కనుక్కోని ఊహకే అందనంత అతిపెద్ద, అత్యంత సుదూర నీటి మేఘాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై ఉన్న నీటి కంటే 140 లక్షల కోట్ల రెట్ల భారీ జలనిధిని బహిర్గతం చేశారు. యూనిలాడ్ (UNILAD) అనే బ్రిటిష్ ఇంటర్నెట్ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. క్వేసార్ (quasar) అని పిలిచే ఒక భారీ ఫీడింగ్ బ్లాక్ హోల్ చుట్టూ ఇది నీటి ఆవిరి రూపంలో విస్తరించింది. ఈ విస్తారమైన కాస్మిక్ నీటి వనరు వేల కోట్ల కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉంది. అంతరిక్షంలో ఉన్న నీటితో పోలిస్తే ఈ నీటి ఆవిరి మేఘం వెచ్చగా ఉంటుంది. భూమిపై ఉండే వాతావరణం కంటే 300 లక్షల రెట్లు తక్కువ సాంద్రత ఉంటుంది. పరిమాణానికి తగ్గట్టే అంతరిక్షంలోని ఈ నీటి మేఘం వందల కాంతి సంవత్సరాల విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన మ్యాట్ బ్రాఫోర్డ్ ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యతను తెలియజేశారు. అత్యంత ప్రారంభ సమయాల్లోనే నీరు విశ్వం అంతటా వ్యాపించి ఉందనటానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. -
Italy:ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్,ఎక్స్‌ప్రెస్ రైళ్లు
రోమ్: ఇటలీలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఉత్తర ఇటలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొలోగ్నా, రిమినీ స్టేషన్ల మధ్య ఒక హై స్పీడ్ రైలును మరో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 17 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. అయితే తక్కువ వేగంలో వెళ్తుండగా రెండు రైళ్లు ఢీకొట్టుకోవడంతో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని రైలు ఆపరేటర్ చెప్పారు. దేశ డిప్యూటీ పీఎం, రవాణా మంత్రి కూడా అయిన మాట్టే సాల్వినీ ఈ ప్రమాదంపై స్పందించారు. రైళ్లు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు చిన్న గాయాలే అయ్యాయని తెలిపారు. ఢీ కొట్టుకున్న రైళ్లలో హై స్పీడ్ రైలు ముందుభాగం నుజ్జునుజ్జవగా ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని రైల్వే అధికారులు తెలిపారు. -
నుమోనియా కేసుల వ్యాప్తిపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: చైనాలో ఇటీవల నమోదైన శ్వాససంబంధ అనారోగ్య కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. చిన్నపిల్లలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన ఈ నుమోనియా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందన ఆ దేశ వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.‘దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో నుమోనియా కేసులు రావడం ఒక్కసారిగా తగ్గిపోయింది’అని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ చీఫ్ మీ ఫెంగ్ మీడియాకు తెలిపారు. నుమోనియా కేసుల నమోదు ఒక్కసారిగా పడిపోయిందని చైనా వెల్లడించడకంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. కొవిడ్ భయాలు ఇంకా తొలగిపోని నేపథ్యంలో చైనాలో శ్వాససంబంధిత అనారోగ్య కేసులు మళ్లీ వ్యాప్తి చెందుతున్నాయన్న వార్తలు రావడంతో అన్ని దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. భారత్‌లోనూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఈ విషయంలో ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో నుమోనియా తరహా శ్వాసకోశ అనారోగ్య కేసుల నమోదు ఒక్కసారిగా పెరుగుతోందని గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చైనా తెలిపింది. అయితే కేసుల నమోదుకు కొత్త వైరస్ కారణం కాదని వెల్లడించింది.కేసుల వ్యాప్తి వేగంగా ఉండటానికి కొవిడ్ ఆంక్షలు ఎత్తివేయడమే కారణమని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఇదీచదవండి..దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్ -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: మళ్లీ ఆయనే హాట్ ఫేవరెట్!
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఫేవరెట్‌గా మారుతున్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన సర్వేలో ప్రస్తుత అధ్యకక్షుడు జో బైడెన్‌కంటే 4 శాతం ఎక్కువ అప్రూవల్ రేటుతో ట్రంప్ ముందున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ను 43 శాతం మంది ప్రజలు ఆమోదించగా ట్రంప్‌ను 47 శాతం మంది ఆమోదించడం విశేషం. అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి జో బైడెన్ అప్రూవల్ రేటు 43 శాతానికి పడిపోవడం ఇదే తొలిసారి. 2024 అధ్యక్ష ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ టైమ్ ఉండడంతో డెమొక్రాట్లకు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. దీంతో డెమొక్రాట్లు రెండోసారి అధ్యక్షపదవికి జోబైడెన్ పోటీలో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. బైడెన్ రెండోసారి పోటీచేయవద్దనేందుకు వాళ్లు మరో కారణం కూడా చూపుతున్నారు. ఎన్నికల నాటికి ఆయన వయసు 81కి చేరనుందని, ఈ వయసులో మళ్లీ పోటీ ఎందుకని కొందరు డెమొక్రాట్ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి పోటీలో ట్రంప్‌కు తిరుగులేని మద్దతు లభిస్తోంది. పార్టీలో ట్రంప్ పోటీదారులెవరూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు. అయితే ట్రంప్ మీదున్న క్రిమినల్ కేసులు, గతంలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి వంటి అంశాలు ఆయన అభ్యర్థిత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీచదవండి..ఈ రెస్టారెంట్లో చెంపదెబ్బలు వడ్డిస్తారు! -
15.5 కోట్ల సంవత్సరాల క్రితం మాయం.. ఆసియా ఖండంలో ప్రత్యక్షం!
15.5 కోట్ల ఏళ్ల క్రితం మాయమైన ఖండాన్ని ఆసియా ఖండంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘ఆర్గోల్యాండ్’ (Argoland) అని పిలిచే ఈ ఖండానికి సంబంధించిన శకలాలను ఆగ్నేయాసియాలో కనుగొన్నారు. ఈ శకలాలు మొదట్లో ఆస్ట్రేలియా ఖండంలో భాగంగా ఉండేవి. తర్వాత ఇండోనేషియా తూర్పు భాగం వైపు మళ్లాయి. ఒకప్పుడు 15.5 కోట్ల సంవత్సరాల పురాతన భూభాగంలో భాగంగా ఉండే ఈ ఖండం యునైటెడ్ స్టేట్స్ మాదిరిగా చాలా పెద్దగా విస్తరించి ఉండేది. ఆర్గోల్యాండ్ శకలాల పరిశోధన ఏడేళ్లపాటు సాగిందని నెదర్లాండ్స్‌లోని ఉట్రేచ్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన భూవిజ్ఞాన శాస్త్రవేత్త, రచయిత ఎల్డర్ట్ అడ్వోకాట్ పేర్కొన్నారు. ఆగ్నేయాసియా ప్రాంతంలో అక్కడక్కడా విసిరేసినట్టుండే ఈ శకలాలు ఒకే భూభాగం నుంచి వేరుపడినవని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు. ఈ శకలాల వరుసను ‘ఆర్గోలాండ్’ అని పిలిచేవారు. ప్రారంభంలో ఇదంతా ఒకే భూభాగంగా ఉండేది. 15.5 కోట్ల ఏళ్ల నాటి ప్రస్థానం ఆగ్నేయాసియా భూభాగం ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాల మాదిరిగా కాకుండా అనేక శకలాలుగా విచ్ఛిన్నమై ఉంటుంది. దీంతో ఆర్గోల్యాండ్ అనేక ముక్కలుగా విడిపోవడంతో దాని ఉనికి మరుగునపడిపోయింది. ప్రస్తుతం ఈ శకలాలకు సంబంధించి లభ్యమైన మ్యాప్ ఆధారంగా ఆర్గోల్యాండ్ అదృశ్యం కాలేదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణతో శాస్త్రవేత్తలు 15.5 కోట్ల నాటి ఆర్గోల్యాండ్ ప్రస్థానాన్ని గుర్తించారు. ఇది దృఢమైన ఒకే భూభాగం కాకుండా సూక్ష్మఖండాల శ్రేణి కాబట్టి ఈ ఖండానికి శాస్త్రవేత్తలు ఆర్గోల్యాండ్కు బదులుగా ‘ఆర్గోపెలాగో’ అని పేరు పెట్టారు. సైన్స్ జర్నల్ ‘గోండ్వానా రీసెర్చ్’లో అక్టోబరు 19న ప్రచురితమైన ఈ పరిశోధన భూ గ్రహం పరిణామం గురించిన ఆధారాలను అందించడమే కాకుండా ప్రస్తుత జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలు ఎలా అభివృద్ధి చెందాయనే విషయాలను కూడా వెలుగులోకి తెచ్చింది. Argoland was once part of the ancient supercontinent of Gondwana. Prior to the current scattered arrangement of continents, there existed supercontinents.@elonmusk pic.twitter.com/KSrK9q3JJk — JeepsyX (@JeepsyX) November 13, 2023 -
Europe : వలసల వలలో యూరప్
యూరప్ ను వలసలు చుట్టుముట్టేస్తున్నాయి. ఈ ఖండంలోని చాలా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అల్లర్లు,నేరాలు,ఘోరాలు,అశాంతి ఆ దేశాలను అల్లకల్లోలం చేస్తున్నాయి.వీటికి పరిష్కారం లభించకపోగా,మరింత రగిలే ప్రమాదఘంటికలే వినిపిస్తున్నాయి. వలసలు ఏ ఖండానికి,ఏ దేశానికి కొత్తకాదు.ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చినవారితోనూ, సక్రమంగా వలస వచ్చినవారితోనూ సమస్యలు పెరుగుతూనే వున్నాయి.భారతదేశం కూడా అందుకు మినహాయింపు కాదు. వలసలతో అశాంతి ప్రస్తుత అంశం యూరప్ విషయానికి వస్తే, వలసలు ప్రబలి,రోజుకొకరకమైన దుర్వార్త అక్కడి నుంచి వినాల్సివస్తోంది.ఇప్పటికే ఫ్రాన్స్ లో అల్లర్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. నెదర్లాండ్ లో ప్రభుత్వమే కూలిపోయింది.స్వీడన్ లో ఘర్షణలు లేని రోజంటూ లేదు. స్విట్జర్లాండ్ లో అశాంతి రాజ్యమేలుతోంది. బెల్జియం,జర్ననీలో అల్లర్లు,నేరాలుఘోరాలకు అదుపే లేదు.మానవతా దృక్పధంతో శరణు ఇచ్చినందుకు యూరప్ మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తోంది.శరణుకోరి ఆయా దేశాలలో ప్రవేశించినవారి సంఖ్య కోట్లకు చేరుకుంది.వీరంతా మిగిలిన సామాజిక సమస్యలను సృష్టించడమే గాక,రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు.ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్ధకమవుతోంది. శరణార్థుల దారి యూరపే.! యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంతో యుగొస్లావియా, ఉక్రెయిన్,సిరియా,ఆఫ్ఘనిస్థాన్ మొదలైన దేశాలలో బాధపడేవారు యూరప్ దేశాల వైపు వస్తున్నారు. అతి ప్రమాదకరమైన విధానాల్లో సముద్ర ప్రయాణాలు చేస్తూ, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.ముఖ్యంగా 2015లో వలసలు పెద్దఎత్తున పోటెత్తాయి.ఆ సంవత్సరాన్ని 'వలసల సంవత్సరం'గా అభివర్ణించారు.2007-2011మధ్య కూడా వలసలు పెద్ద సంఖ్యలోనే జరిగాయి.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పెరగడం కూడా వలసలపైన కీలక ప్రభావం చూపించింది, ఇంకా చూపిస్తూనే వుంది. లక్షల మంది వలస 2022నాటికి వలస వచ్చిన జనాభా చూస్తే, జర్మనీలో 10.9మిలియన్లు, స్పెయిన్ లో 5.4మిలియన్లు, ఫ్రాన్స్ లో 5.3మిలియన్లు,ఇటలీలో 5మిలియన్లు ఉన్నట్లు సమాచారం. ఒక్క 2022లోనే యూరోపియన్ యూనియన్ లో ఆశ్రమం కోరిన వారి సంఖ్య 6,32,430.అందులో ఆమోదం పొందిన వారి సంఖ్య 3.10 లక్షలు.ఇన్నేళ్ల పాటు వచ్చినవారు,వస్తున్నవారిలో అధికారికంగా కంటే అనధికారికంగా వచ్చిన వారి సంఖ్య అంచనాలకు మించి వుంటుంది. లక్షల్లో వలసవస్తున్న వీరిని కొన్ని దేశాలు అడ్డుకుంటున్నాయి. జర్మనీ వంటికొన్ని దేశాలు మాత్రం ఆదుకుంటున్నాయి. నాటి పాపం నేడు అనుభవిస్తున్నారు పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా నుంచి పెద్దసంఖ్యలో వలసలు జరిగాయి. అరబ్ విప్లవం తర్వాత టునీసియా, లిబియా,ఈజిప్ట్,యెమెన్, అల్జీరియా వంటి దేశాల నుంచి వలసలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారిలో ఎక్కువమంది గ్రీస్ ద్వారా వెళ్లినట్లు తెలుస్తోంది.వలసల ప్రభావం ఆర్ధిక, సామాజిక,రాజకీయ వ్యవస్థలపై పడుతోంది.నివాసం,ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకు పెనుసమస్యగా మారింది. వివిధ సమాజాల మధ్య సాంస్కృతిక ప్రయాణం పెద్దసవాల్ విసురుతోంది. ప్రస్తుతం యూరప్ లో ప్రముఖంగా కనిపిస్తున్న ఈ జాఢ్యం మిగిలిన ఖండాలలోనూ రేపోమాపో శృతిమించకపోదు. సున్నితం.. కీలకం భిన్న సంస్కృతులకు, మతాలకు నిలయమై,అనేక దాడులకు ఆలవాలమై,ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరిస్తున్న భారతదేశం వలసల విషయంలో,ముఖ్యంగా మిగిలిన దేశాల నుంచి అక్రమంగా చొరబడిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరప్ వలసల అంశంపై ప్రపంచ దేశాధినేతలు దృష్టి పెట్టాలి. ఆయా దేశాల అంతర్గత సమస్యలను అరికట్టడంలోనూ, మతోన్మాద ఉగ్రవాదం ప్రబలకుండా చూడడంలోనూ అందరూ కలిసి సాగాలి.యూరప్ అనుభవాలు మిగిలిన ఖండాలకు పెద్దగుణపాఠం కావాలి. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
Africa : పాత దుస్తులే వాళ్లకి ఫ్యాషన్!
సాక్షి, అమరావతి: అమెరికా, చైనా వంటి అగ్ర దేశాల్లో వాడేసి వదిలేసిన పాత దుస్తులే ఆఫ్రికా ప్రజలకు కొత్త ఫ్యాషన్. దీంతో ఆఫ్రికా ఖండాన్ని సెకండ్ హ్యాండ్ వ్రస్తాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి వ్యాపారస్తులు విదేశాల నుంచి టన్నుల కొద్దీ పాత దుస్తుల్ని దిగుమతి చేసుకుని పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ఇలా వచ్చిన వాటిలో 50 శాతం పైగా వాడుకోవడానికి వీలుగా లేక పోవడంతో చెత్తకుప్పలుగా మిగిలిపోతున్నాయి. ఆ దుస్తులు ఆఫ్రికాలోని పర్యావరణానికి సవాలు విసురుతున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఆఫ్రికా దేశాల్లోనే పండిస్తున్నా.. పేదరికం కారణంగా అక్కడి ప్రజలు మాత్రం దిగుమతి చేసుకున్న సెకెండ్ హ్యాండ్ దుస్తులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఇటీవల ‘ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా’ ద్వారా ఖండం అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల వ్యాపారాన్ని నిషేధించాలని నిర్ణయించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. లక్షల టన్నుల్లో దిగుమతి ఆఫ్రికా ఖండంలో మాగ్రెబ్ (అరబ్ సంస్కృతి గల దేశాలు), సబ్ సహారా దేశాలు ఉన్నాయి. 2021లో మాగ్రెబ్ దేశాల్లో సెకండ్ హ్యాండ్ దుస్తుల మొత్తం దిగుమతులు సుమారు 107 మిలియన్ డాలర్లు కాగా, సబ్ సహారాలో 1,734 మిలియన్ డాలర్లుకు పైగా ఉంది. ‘గ్రీన్‌పీస్ ఆఫ్రికా’ సంస్థ సర్వే ప్రకారం మడగాస్కర్ ఏటా లక్ష టన్నుల సెకండ్ హ్యాండ్ దుస్తులను దిగుమతి చేసుకుంటే, కెన్యా 900 మిలియన్ల దుస్తులు, ఘనా 720 మిలియన్ల పాత దుస్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. పాత వ్రస్తాల దిగుమతిపై సరైన చట్టాలు లేకపోవడం, చెత్తగా మిగిలిన వాటిని ప్రాసెస్ చేయడంపై సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ఈ దేశాలు సెకండ్ హ్యాండ్ దుస్తుల చెత్త కుప్పలుగా మారుతున్నాయి. దిగుమతైన దుస్తుల్లో 60% పైగా ప్లాస్టిక్ కలిసిన వ్రస్తాలే ఉండడంతో వాటిని తగులబెట్టినా.. భూమిలో పాతిపెట్టినా పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ట్రాషన్: ది స్టెల్త్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ క్లాత్స్ టు కెన్యా’ నివేదిక ఆఫ్రికాకు సెకండ్ హ్యాండ్ దుస్తుల దిగుమతులు డిమాండ్‌ను మించిపోయాయని, అవి ఇక్కడి పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యర్థాల వల్ల నదులు, సముద్రాలు, పట్టణాలు, అడవులు, ప్రజల ఆరోగ్యం కలుíÙతమవుతున్నట్టు నివేదించింది. ఈ దేశాల్లో 2029 నాటికి సెకెండ్ హ్యాండ్ దుస్తుల వార్షిక విలువ 27.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది ఆఫ్రికా మొత్తం ఆదాయంలో 12.4 శాతం. ఆఫ్రికాలో రెండో అతిపెద్ద ఉపాధి రంగం పేదరికం తాండవించే ఆఫ్రికా దేశాల్లో చవకైన దుస్తులకు డిమాండ్ ఉంది. అక్కడ వ్యవసాయం తర్వాత సెకండ్ హ్యాండ్ వస్త్రాల మార్కెట్టే అతిపెద్ద ఉపాధి రంగం. ఈ తరహా దుస్తులకు అతిపెద్ద ఎగుమతిదారు బ్రిటన్. ఆ దేశం నుంచి 14 మిలియన్ టన్నులు, అమెరికా నుంచి 7 లక్షల టన్నులు వాడేసిన దుస్తులను ఏటా ఆఫ్రికాకు ఎగుమతి చేస్తుండగా, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాతి స్థానంలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ నుంచి కూడా ఆఫ్రికాకు ఈ వ్రస్తాలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్క ఘనా దేశానికే ప్రతివారం యూరప్, యూఎస్, ఆ్రస్టేలియా నుంచి 15 మిలియన్ల సెకండ్ హ్యాండ్ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. సెకెండ్‌హ్యాండ్ దుస్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే కెన్యాలో ప్రతిరోజూ 4 వేల టన్నుల వస్త్ర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కెన్యా ప్రభుత్వానికి సెకండ్ హ్యాండ్ వ్రస్తాల దిగుమతి, ఇతర దేశాలు విరాళంగా ఇచ్చిన వాటిపై విధించే పన్ను ముఖ్య ఆదాయ వనరు. ఈ దేశంలో 91.5 శాతం కుటుంబాలు సెకండ్ హ్యాండ్ దుస్తులను కొనుగోలు చేస్తున్నాయని అంచనా. పత్తి ప్రధాన ఉత్పత్తిదారైన జింబాబ్వే పెట్టుబడుల కొరత కారణంగా 85 శాతం పత్తిని ఎగుమతి చేస్తూ, 95 శాతం వ్రస్తాలు దిగుమతి చేసుకుంటోంది. గ్రీన్‌పీస్ ఆఫ్రికా 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆఫ్రికా దేశాలకు విరాళంగా ఇచ్చే సెకెండ్ హ్యాండ్ దుస్తుల్లో 40 శాతం పైగా ధరించేందుకు పనికిరానివే. వాటిని బహిరంగ ప్రదేశాల్లో వదిలేయడమో, నదుల్లో పారవేయడమో చేస్తున్నారు. -
సంపన్న రాజ్యాల కపటత్వం
‘పర్యావరణ పరిరక్షణ విషయంలో నిర్లిప్తంగా ఉండటం ద్వారా మానవాళి నరకానికి ద్వారాలు తెరుస్తోంది సుమా...’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించిన మర్నాడే 2015 ప్యారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సుకు పూచీపడిన లక్ష్యాలను నీరుగారుస్తూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిర్ణయాలు తీసుకున్నారు. సహజంగానే పర్యావరణ ఉద్యమకారులను ఈ ప్రకటన దిగ్భ్రాంతిపరిచింది. గతంలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక గత ప్రభుత్వ నిర్ణయాలను తాము ఆమోదించబోమని ప్యారిస్ ఒడంబడిక నుంచి వైదొలగారు. తిరిగి జో బైడెన్ వచ్చాకే అమెరికా పాత విధానానికి మళ్లింది. సునాక్ అంత మాట అనకపోయినా ఆయన తాజా చర్యలు మాత్రం అలానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాన్ని 2030 నుంచి నిలిపేస్తామని ప్యారిస్ శిఖరాగ్ర సదస్సులో బ్రిటన్ వాగ్దానం చేయగా, దీన్ని ఆయన మరో అయిదేళ్లు పొడిగించారు. అలాగే 2035 నాటికి కొత్త గ్యాస్ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కన బెట్టారు. 2050 నాటికల్లా కర్బన ఉద్గారాలను సంపూర్ణంగా తొలగించటమే లక్ష్యమని చెబుతూనే ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలను వాయిదా వేయటం సంపన్న రాజ్యాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. హరిత లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకుంటే ఉపాధి దెబ్బతింటుందని, జనాగ్రహం వెల్లువెత్తుతుందని ఆయన చెబుతున్న మాటలు కేవలం సాకు మాత్రమే. కర్బన ఉద్గారాలకు కారణమయ్యే పరిశ్రమలు మూతబడినా, హరిత ఇంధనంతో పనిచేసే పరిశ్రమల్లో ఉపాధి లభిస్తుంది. భిన్నరూపాల్లో సబ్సిడీలు, ఆర్థిక సాయం అందిస్తే ప్రజలకు అంత కష్టం అనిపించదు. అందుకు భిన్నంగా ఆ లక్ష్యాల నుంచే తప్పుకోవటం అన్యాయం. వచ్చే ఎన్నికల్లో మధ్యతరగతి మద్దతు కోసం వారికి నొప్పి కలిగించే నిర్ణయాలు తీసుకోరాదని సునాక్ భావిస్తున్నారు. ఇందుకు పర్యావరణం బలయ్యే ప్రమాదం ఉన్నా ఆయనకు పట్టడం లేదు. అసలు సంపన్న రాజ్యాల తీరుతెన్నులను ఐక్యరాజ్యసమితి సదస్సే పట్టిచూపింది. ఆ సదస్సుకు 34 దేశాల ప్రతినిధులు హాజరుకావాల్సివుండగా ప్రధాన కాలుష్యకారక దేశాలైన అమెరికా, చైనా లతో సహా ఎవరూ రాలేదు. నిజానికి బ్రిటన్ ప్రధాని హోదాలో పాల్గొనే అవకాశం తొలిసారి వచ్చినందున రిషి సునాక్ తప్పక హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన గైర్హాజరు కావటమే కాదు... పర్యావరణానికి ముప్పు తెచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు లక్ష్యసాధన దిశగా తీసుకున్న చర్యలేమిటో, వైఫల్యాలుంటే కారణాలేమిటో చెప్పాలని సమితి అన్ని దేశాలనూ కోరింది. సరైన చర్యలు తీసుకుంటున్న దేశాలు ఇతర దేశాలకు స్ఫూర్తిదాయ కంగా నిలుస్తాయన్నది ఐక్యరాజ్యసమితి ఉద్దేశం. కానీ హోంవర్క్ చేయని పిల్లలు ఆ మర్నాడు బడి ఎగ్గొట్టినట్టు పర్యావరణ హిత నిర్ణయాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్న దేశాలన్నీ ఈ సదస్సుకు గైర్హాజరయ్యాయి. చిత్తశుద్ధి ఉంటే స్వచ్ఛమైన గాలి, నిరపాయకరమైన ఇంధనం అందు బాటులోకి రావటం పెద్ద కష్టం కాదని...ఈ రంగాల్లో ఉపాధి కల్పన అవకాశాలు కూడా పెరుగు తాయని గుటెరస్ చెబుతున్న మాట అరణ్యరోదనే అయింది. 2030 నాటికి బొగ్గు వినియోగం నుంచి ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) దేశాలు పూర్తిగా వైదొలగితే, మరో పదేళ్లకు ఇతర దేశాలు దాన్ని సాధించగలుగుతాయని పారిస్ సదస్సు నిర్దేశించింది. కానీ సంపన్న రాజ్యాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో ఏ ఒక్క దేశమూ ఆ దిశగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. సరి గదా కెనడా, అమెరికా, బ్రిటన్ తదితర సంపన్న దేశాలు మూతబడిన పాత ఫ్యాక్టరీలను సైతం తెరుస్తూ బొగ్గు వినియోగాన్ని మరింత పెంచాయి. ఈ ఏడాది జూన్–ఆగస్టు మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిశ్రామికీకరణకు ముందున్న వాతావరణంతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగటం ఎంతో దూరంలో లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పిన మాట అక్షరసత్యమని ఈ పరిణామం వెల్లడిస్తోంది. గుటెరస్ చేస్తున్న హెచ్చరిక మరింత గుబులు పుట్టిస్తుంది. మరో 2.8 డిగ్రీల సెల్సి యస్ ఉష్ణోగ్రత పెరిగే క్రమంలో ఉన్నామని ఆయన ప్రకటించారు. ప్యారిస్ ఒడంబడిక కుదిరిన సమ యంలో ప్రపంచ దేశాలన్నీ 2020నాటికే ఇంతకు మూడింతల క్రియాశీల కార్యాచరణకు పూనుకోవా లని సదస్సు నిర్దేశించింది. అలాగైతే తప్ప లక్ష్యసాధనను చేరుకోలేమని చెప్పింది. కానీ మరో నాలుగేళ్లకే సంపన్న రాజ్యాల నిర్వాకం బయటపడింది. 2019లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో దాదాపు 60 దేశాలు తాము పూచీపడిన లక్ష్యాలకు మించి కర్బన ఉద్గారాలను తగ్గించు కున్నామని ప్రకటించగా...అందులో అత్యధిక దేశాలు చిన్నవే, తక్కువస్థాయి కాలుష్య కారక దేశాలే. మరి సంపన్న దేశాలు ఏం చేసినట్టు? ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి, పర్యావరణానికి తూట్లు పొడిచాయి. ఈ విషయంలో కాస్తయినా సిగ్గుపడటం మానేశాయి. వాతావరణ సదస్సుకు ముందురోజే జరిగిన సమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భూగోళాన్ని వడగాడ్పులు చుట్టుముట్టడం, అడవులు తగలబడటం, కరువుకాటకాలు, వరదలు వగైరాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. శిలాజ ఇంధనాల వాడకం ఆపకపోతే ఈ ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరించారు. కానీ గత అయిదేళ్లలో సాధించిందేమిటో చెప్పాలి గనక ఆ మర్నాడు జరిగిన సదస్సుకు మాత్రం గైర్హాజరయ్యారు. ఇలాంటి ధోరణులు సరి కాదు. ఇప్పటికైనా సంపన్న రాజ్యాల తీరు మారాలి. భూగోళం ఉనికికి ముప్పు తెచ్చే చర్యలకు స్వస్తి పలకాలి. ఇది కూడా చదవండి: నారీలోకానికి నీరాజనం! -
నకిలీ నగల కేసులో ఇద్దరు భారతీయులకు జైలు
నకిలీ నగల కుంభకోణం కేసులో ఇద్దరు భారత జాతీయులు గురుప్రీత్ రామ్ సిద్దు (22), జస్విందర్ సింగ్ బ్రార్ (38)లకు సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించినట్లు స్థానిక మీడియా ద స్ట్రేయిట్ టైమ్స్ గురువారం వెల్లడించింది. రాగి వస్తువులకు బంగారం తాపడం వేసి ఆవి నిజమైన నగలని 11 దుకాణదారులను మోసం చేసిన గురుప్రీత్‌కు 15 నెలల జైలుశిక్ష విధించింది. అలాగే నకిలీ నగల ద్వారా రూ. 30 వేల నగదును పొందిన బ్రార్‌కు 10 నెలల జైలు శిక్ష విధించినట్లు తెలిపింది. వారిద్దరు సోషల్ విజిట్ పాసెస్ ద్వారా సింగపూర్ వచ్చారని పేర్కొంది. గతేడాది ఏప్రిల్, ఆక్టోబర్ మాసాల్లో బ్రార్ ఆ మోసాలకు పాల్పడ్డారని తెలిపింది. అయితే దుకాణదారుల వద్ద ఆ నగలను కుదవ పెట్టి, వారిద్దరు నగదు తీసుకువెళ్లారని చెప్పింది. అనంతరం దుకాణదారులు నగలను పరీక్షించగా అవి నకిలీ నగలని తెలింది. దాంతో దుకాణదారులు ఆ విషయాన్ని సింగపూర్ పాన్‌బ్రోకర్స్ అసోసియేషన్‌కు సమాచారం అందించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ద స్ట్రేయిట్ టైమ్స్ పేర్కొంది. అయితే తన క్లైయింట్ బ్రార్ ఈ కుంభకోణంలో పాత్ర చాలా తక్కువ అని అతని తరపు న్యాయవాది ఎస్.కే.కుమార్ న్యాయమూర్తికి విన్నవించారు. ఈ నేపథ్యంలో అతనికి తక్కువ శిక్ష విధించాలని కోరారు. శిక్ష కాలం పూర్తి అయన వెంటనే అతడు స్వదేశం వెళ్లిపోతాడని న్యాయమూర్తికి విన్నవించారు. సిద్దు, బ్రార్‌లకు సహకరించిన మరో భారతీయుడు జగత్తర్ సింగ్‌కు వచ్చే నెలలో జైలు శిక్ష ఖరారుకానుందని ద స్ట్రైయిట్ టైమ్స్ తెలిపింది. -
భారత్ కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులకు గాయాలు
భారత్, పాక్ సరిహద్దు ప్రాంతమైన లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఇరుదేశాల సైనికులు పరస్పరం జరిపిన కాల్పుల్లో బుధవారం ఇద్దరు పాకిస్థాన్ సైనికులు గాయపడ్డారు. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్త వాతావరణం నెలకొంది. తాము ఎటువంటి చర్యలకు దిగకుండానే భారత్ సైనికులు తమపై కాల్పులు జరిపారని పాకిస్థాన్ మిలటరీ అధికారి ఆరోపించారు. అయితే ఎల్ఓసీని పాక్ దళాలు అతిక్రమించిన కారణంగానే తాము కాల్పులు జరపవలసి వచ్చిందని భారత సైనిక అధికారులు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఐదుగురు భారతీయ సైనికులను హతమార్చిన పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుందని జమ్ముకాశ్మీర్‌లోని సీనియర్ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు. కాగా ఇరుదేశాల సరిహద్దుల వద్ద యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్న నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య చర్చలకు విఘాతం కలిగి అవకాశం ఉంది. గతంలో భారతీయ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి చర్చలు జరపాలని పాక్ భావించింది. అయితే ఈ ఏడాది మొదట్లో కాశ్మీర్లో పాక్ విధ్వంసానికి యత్నించింది. దాంతో ఆ చర్చల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చాయి. -
రష్యాలో రోడ్డును దొంగిలించిన మొనగాడు
ఎక్కడైనా డబ్బు దొంగతనం గురించి విన్నాం, నగల దొంగతనం గురించి విన్నాం. ఇంకా మాట్లాడితే ఇంట్లోకి చొరబడి మొత్తం దుస్తుల దగ్గర్నుంచి టీవీలు, టేప్ రికార్డర్లు.. ఇలా వస్తువులన్నింటినీ చోరీ చేయడం కూడా మనకు తెలుసు. కానీ, ఎవరైనా రోడ్డును దొంగిలించడం చూశారా? ఏంటి.. నమ్మలేకపోతున్నారా.. కానీ ఇది పచ్చి వాస్తవం. ఎప్పుడూ హడావుడిగా ఉండే ఓ జాతీయ రహదారి మీద ఉన్న మొత్తం 82 కాంక్రీటు శ్లాబు బ్లాకులను ఓ దొంగ ఎత్తుకుపోయాడు. నిరంతరం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డును అతగాడు దర్జాగా చోరీ చేస్తున్నా ఎవరికీ తెలియకపోవడం విశేషం. అతగాడు చోరీ చేసిన కాంక్రీటు శ్లాబుల విలువ అక్షరాలా 3,73,576 రూపాయలు. సిక్టివ్కర్ అనే నగరానికి శివార్లలో ఉన్న జాతీయరహదారి మీద పరిచిన శ్లాబులను అతగాడు వలుచుకుని తీసుకెళ్లిపోయాడు. ఫోర్కులిఫ్టుతో కూడిన ట్రక్కు, బుల్డోజర్ రెండింటినీ తీసుకెళ్లి మరీ అతడీ పని చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 82 బ్లాకులను రోడ్డు మీద నుంచి తీసుకెళ్లిపోయాడు. వీటిని మూడు పెద్ద పెద్ద ట్రక్కులలో లోడ్ చేసుకుని పట్టుకెళ్లాడు. రోడ్డును మూసేసినట్లు ఓ బోర్డు పెట్టి, వాహనాలు అటువైపు రాకుండా చూసుకుని మరీ ఈ చోరీ చేసినట్లు భావిస్తున్నారు. అయితే.. ఇంత గొప్పగా చోరీ చేసిన సదరు దొంగగారు చివరకు పోలీసులకు పట్టుబడిపోయాడు. పోలీసులు అనుకోకుండా ఈ మూడు వాహనాలను ఆపి తనిఖీ చేస్తుంటే అతడు దొరికాడు తప్ప, చోరీ జరిగిన విషయాన్ని పోలీసులు గమనించలేకపోయారు. ఈ దొంగతనానికి గాను అతడికి రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, కాంక్రీటు శ్లాబులు పట్టుకెళ్లి ఏం చేద్దామనుకుంటున్నాడో మాత్రం తెలియరాలేదు. -
ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి కిందకి జారిన భారత్
రూపాయి పతనం, స్టాక్ మార్కెట్ల బలహీన పడటంతో భారత్ ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి కిందకు జారింది. స్టాక్ మార్కెట్లో నిన్న సాయంత్రానికి జరిగిన మొత్తం వాణిజ్యంలో భారత్ రూ. 989 కోట్ల అమెరికన్ డాలర్లు నమోదు అయింది. ట్రిలియన్ డాలర్లకు స్వల్పంగా కొన్ని కోట్లు తగ్గటంతో ఆ క్లబ్లో భారత్ స్థానం చేజారింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ కనిష్టస్థాయికి చేరుతుంది. అంతలోనే రూపాయి విలువ పెరుగుతుంది. ఆ ఒడిదుడుకుల నేపథ్యంలో భారత్‌కు ఆ పరిస్థితి నెలకొంది. గత కొన్ని వారాలుగా ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి భారత్ వైదొలిగే సూచనలు కనిపించాయి. కానీ రూపాయి పతనం, మరల పుంజుకొవడంతో భారత్ ఆ క్లబ్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. కానీ మంగళవారం జరిగిన వాణిజ్యంలో రూపాయి పతనం అయ్యే సరికి ఆ క్లబ్ నుంచి భారత్ వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 2007లో మొట్టమొదటగా భారత్ ట్రిలియన్ డాలర్ల క్లబ్లో సభ్యత్వం పొందింది. 2008, సెప్టెంబర్‌లో ఆ క్లబ్ నుంచి వైదొలిగింది. 2009లో భారత్ మళ్లీ ట్రిలియన్ క్లబ్లో సభ్యత్వం పొందింది. భారత్ వైదొలగడంతో యూఎస్, యూకే, జపాన్, చైనా, కెనడా, హాంకాంగ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, నార్డిక్ ప్రాంతం, బ్రెజిల్ దేశాల స్టాక్ మార్కెట్లు ట్రిలియన్ డాలర్ల క్లబ్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. కాగా బ్రెజిల్, దక్షిణ కొరియా, నార్డిక్ ప్రాంతంలోని స్టాక్ మార్కెట్లు మాత్రం స్వల్ప తేడాతో ఆ క్లబ్లో కొనసాగుతున్నాయి. అయితే గతంలో రష్యా, స్పెయిన్, దక్షిణాఫ్రికాలు ఆ క్లబ్లో స్థానం పొంది మరల కొల్పోయాయి. -
మారిషస్‌లో యూఎస్ ఎంబసీ మూసివేత
మారిషస్‌లోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు ఆ కార్యాలయ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ప్రపంచంలోని పలుదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలను అల్ ఖైదా తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని సమాచారం మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విదేశాల్లోని యూఎస్ వాసులు, రాయబార కార్యాలయ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఫ్రికాతోపాటు వివిధ దేశాల రాయబార కార్యాలయాలను మూసివేయాలని అమెరికా ప్రభుత్వం ఆ ఆదేశాలు జారీ చేసింది. పలుదేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలపై దాడి చేయాలని తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా వివిధ దేశాల్లోని తమ శాఖలను ఆదేశించినట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు ఒబామా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈజిప్టు, యెమెన్, సౌదీ అరేబియా, కువైట్, మెడగాస్కర్, బురుండి దేశాలతోపాటు మరో 19 దేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలను ఇప్పటికే మూసివేసిన సంగతి తెలిసిందే. -
కరాచీలో బాంబు పేలుడు: 11 మంది చిన్నారులు మృతి
పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించి 11 మంది చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు బుధవారం ఇస్లామాబాద్‌లో వెల్లడించారు. ఈ ఘటనలో మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వారిని నగరంలోని ఆసుపత్రికి తరలించామని, అయితే వారి పరిస్థితి ఆందోళనగా ఉందని వైద్యులు తెలిపారన్నారు. నగరంలోని లయరి ప్రాంతంలో మార్కెట్ సమీపంలో పేలుడు పదార్థంతో ఉంచి మోటర్ బైక్ పేలి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఆ సమీపంలోనే చిన్నారులు పూట్‌బాల్ ఆట ముగించుకున్న కొన్ని నిముషాల వ్యవధిలోనే బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుందని లయరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రోవెన్షియల్ అసెంబ్లీ సభ్యుడు సానియా నాజ్ చెప్పారు. కాగా గాయపడిన చిన్నారులంతా 12 నుంచి 14 ఏళ్ల లోపు చిన్నారులే అని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఫూట్‌బాల్ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన సింధ్ ప్రోవెన్సియల్ అసెంబ్లీ సభ్యుడు జావెద్ నగొరి కూడా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. -
మేఘాలయలోనూ ‘ప్రత్యేక’ సెగలు
షిల్లాంగ్/డార్జిలింగ్/గువాహటి: తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ నిర్ణయం తీసుకున్న దరిమిలా దేశంలోని పలుచోట్ల ఇప్పటికే ‘ప్రత్యేక’ ఉద్యమాలు ఊపందుకోగా, తాజాగా ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోనూ ‘ప్రత్యేక’ నిరసనలు మొదలయ్యాయి. మేఘాలయలో గారో, ఖాసీ-జయింతియా గిరిజన ప్రాంతాలను రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలంటూ ఐదు జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిరసనలు మొదలయ్యాయి. గారో హిల్స్ రాష్ట్ర ఉద్యమ కమిటీ, హిల్స్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, గారో నేషనల్ కౌన్సిల్ తదితర పార్టీలు, ప్రజా సంస్థలు దాదాపు ఇరవయ్యేళ్లుగా ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్ చేస్తున్నాయి. భాషా ప్రాతిపదికన గారోలాండ్, ఖాసీ-జయింతియా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని జీఎన్సీ ఎమ్మెల్యే క్లిఫర్డ్ మారక్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. డార్జిలింగ్‌లో ఉద్యమం ఉధృతం...: ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్యమం ఉధృతమైంది. బంద్ ప్రభావంతో మంగళవారం నాలుగో రోజూ ఈ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. గూర్ఖాలాండ్ జనముక్తి మోర్చా (జీజేఎం) అధినేత బిమల్ గురుంగ్ సహచరుడు అనిత్ థాపాను కుర్సియాంగ్లో పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ మద్దతుదారు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కలింపాంగ్ వచ్చిన గురుంగ్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా అందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించిన కొద్ది గంటలకే థాపా అరెస్టు జరగడం గమనార్హం. పాత కేసులకు సంబంధించి ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. థాపా అరెస్టుతో జీజేఎం కార్యకర్తలు కుర్సియాంగ్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. డార్జిలింగ్ పరిస్థితులను సమీక్షించేందుకు పశ్చిమ బెంగాల్ హోంశాఖ కార్యదర్శి బాసుదేవ్ బెనర్జీ సిలిగురి చేరుకున్నారు. దీంతో జీజేఎం కార్యకర్తలు సిలిగురి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని ముట్టడించి, పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాగా, డార్జిలింగ్, మిరిక్, కుర్సియాంగ్, కలింపాంగ్, సుఖియాపొఖ్రీ తదితర ప్రాంతాల్లో ఆందోళనల్లో పాల్గొన్న పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మరోపక్క.. ‘ప్రత్యేక’ డిమాండ్లతో అస్సాంలో మొదలైన ఉద్యమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. అస్సాం దిగువ ప్రాంతంలో మంగళవారం సైతం జనజీవనం స్తంభించింది. అయితే, తొలుత 1500 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన యునెటైడ్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫోరం (యూడీపీఎఫ్) బుధవారం నుంచి తన ఆందోళనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
అల్కాయిదాపై ఎదురుదాడికి అమెరికా సిద్ధం
వాషింగ్టన్: పశ్చిమ ఆసియాలోని తమ రాయబార కార్యాలయాలపై అల్‌కాయిదా దాడులకు తెగబడొచ్చన్న నిఘా హెచ్చరికలతో అప్రమత్తమైన అమెరికా తాజాగా అల్కాయిదాపై ఎదురుదాడికి సిద్ధమవుతోంది. అరేబియన్ ద్వీపకల్పం (ఏక్యూఏపీ)లోని అల్‌కాయిదా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ అక్కడున్న తమ దేశ ప్రత్యేక దళాలను అప్రమత్తం చేసింది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు చెందిన కార్యాలయాలపై దాడులకు తుది సన్నాహాలు చేసుకోవాలంటూ అల్‌కాయిదా చీఫ్ అల్‌జవహరి, ఏక్యూఏపీలో అల్‌కాయిదా నేత నసీర్ అల్వుహాషీల మధ్య సాగిన సంభాషణలను అగ్రరాజ్యం పసిగట్టిందని ‘ద న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. ఆ నేపథ్యంలో అమెరికా ఎదురుదాడికి వ్యూహం రచిస్తోంది. -
20 మంది ఉగ్రవాదులతో కలిసి భారత్‌లోకి చొరబడిన పాక్ దళాలు
జమ్మూ/కాశ్మీర్: పాకిస్థాన్ మరోసారి తన యుద్ధోన్మాదాన్ని బయటపెట్టుకుంది. చీకటి వేళ ఉగ్రవాదులతో కలిసి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైన్యం ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత జవాన్లు గస్తీ తిరుగుతుండగా ఈ దాడి జరిగింది. ఇది దేశవ్యాప్తంగాను, పార్లమెంటులోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దాడిలో గాయపడిన మరో జవాన్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఏడాది జనవరిలో హద్దు మీరిన పాక్ సైన్యం ఇద్దరు భారత జవాన్లను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరి తల నరికిన ఘటన దుమారం రేపింది. దాడి జరిగిందిలా.. ‘పూంచ్ జిల్లాలోని చకన్ దా బాగ్ సెక్టార్ పరిధిలోకి వచ్చే సార్లా ఫార్వర్డ్ పోస్ట్‌కు చెందిన ఆరుగురు సైనికులు సోమవారం గస్తీకి వెళ్లారు. అర్ధరాత్రి దాటాక 01:15 గంటల అనంతరం వారి నుంచి సైనిక స్థావరానికి ఎలాంటి సమాచారమూ అందలేదు. దీంతో 05:30 గంటల సమయంలో మరో బృందాన్ని వారి కోసం పంపగా ఐదుగురు జవాన్ల మృతదేహాలు తూటా గాయాలతో రక్తపుమడుగులో కనిపించాయి’ అని రక్షణ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. గాయపడిన మరో జవాన్‌ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. అతనికి ఎయిమ్స్‌లో చికిత్స చేస్తున్నారు. పాకిస్థాన్ సరిహద్దు యాక్షన్ టీమ్(బీఏటీ) నేతృత్వంలో ఈ దాడి జరిగిందని, పాక్ సైనికులు, సుమారు 20 మంది సాయుధ ఉగ్రవాదులు 450 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని రక్షణ శాఖ ప్రతినిధి ఎస్.ఎన్.ఆచార్య ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. మృతుల్లో ఒక నాన్ కమిషన్డ్ ఆఫీసర్, నలుగురు ఇతర ర్యాంకుల అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతులను నాయక్ ప్రేమ్ నాథ్ సింగ్, లాన్స్ నాయక్ శంభు శరణ్రాయ్, సిపాయి రవినంద్ ప్రసాద్, సిపాయి విజయ్ కుమార్ రాయ్, కులీన్ మన్నెగా గుర్తించినట్లు తెలిపారు. వీరిలో నలుగురు 21 బీహార్ రెజిమెంట్‌కు, ఒకరు 14 మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ బెటాలియన్‌కు చెందినవారు. దేశప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు: ఖుర్షీద్ పాకిస్థాన్ బలగాలు ఐదుగురు భారత జవాన్లను కాల్చిచంపిన నేపథ్యంలో దీనిపై అన్ని అంశాలను పరిశీలించి తగిన విధంగా జవాబిస్తామని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మంగళవారం మాట్లాడుతూ.... ప్రభుత్వానికి తన బాధ్యతలపై అవగాహన ఉందని అన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరమే దేశప్రయోజనాలకు అనుగుణంగా సరైన చర్య తీసుకుంటామన్నారు. ‘దేశ భద్రత, శాంతికి విఘాతం కలిగించేలా పరిస్థితులను సృష్టించుకోవాలనుకోవడం లేదు. దేశానికి ఏది అవసరమో అదే చేస్తాం’ అని పేర్కొన్నారు. మాకు సంబంధం లేదు: పాక్ ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి దాడి చేసి ఐదుగురు భారత సైనికులను హత్యచేసిన ఘటనతో తమ సైనిక బలగాలకు ఎలాంటి సంబంధమూ లేదని పాకిస్థాన్ మంగళవారం వెల్లడించింది. 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఎల్వోసీ వెంబడి పూంచ్ సెక్టార్లో జరిగిన దాడిలో ఐదుగురు భారత సైనికుల మరణానికి పాక్ బలగాలే కారణమంటూ భారత మీడియాలోని కొన్ని వర్గాలు ప్రసారం చేసిన కథనాలను పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇజాజ్ చౌదరి తోసిపుచ్చారు. ఆ ప్రాంతంలో ఎలాంటి కాల్పులు జరగలేదని తమ సైన్యం ధ్రువీకరించిందని, భారత మీడియా ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. -
'చెన్నై ఎక్స్‌ప్రెస్' తో 'మై హు షాహిద్ ఆఫ్రిద్ లేట్
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రం పాకిస్థాన్‌లో విడుదల కానుంది. ఆ నేపథ్యంలో మై హు షాహిద్ ఆఫ్రిద్ (ఎంహెచ్ఎస్హెచ్) చిత్రం రంజాన్ పండగ తర్వాత విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆ చిత్ర నిర్మాతలు మంగళవారం పాకిస్థాన్‌లో వెల్లడించారు. అయితే ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారమే ఆ చిత్రాన్నివిడుదల చేయాలనుకున్నామని, కానీ ఆఖరి నిముషంలో అవాంతరాలు ఎదురైయ్యాయని ఆ చిత్ర రచయిత వ్యాస చౌదరి ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే దేశ చలన చిత్ర రంగంలో పేరు ప్రఖ్యాతలు పొందిన ఫిల్మ్ ఎడిటర్ అజాంఖాన్ మరణం కూడా ఆ చిత్ర విడుదలకు ఏర్పడిన అవాంతరాల్లో ఒకటన్నారు. చిత్ర పూర్తి కావచ్చున చివరి నిముషంలో ఆయన మరణించారన్నారు. అలాగే చిత్రంనికి సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ అంతా విదేశాల్లో జరగడం కూడా ఇంకో కారణమన్నారు. అయితే ఇద్ పండగ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఏ చిత్రాన్ని పాక్‌లో విడుదల చేయమని అంతకుమందు డిస్టిబ్యూటర్లు, సినీ నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆఖరి నిముషంలో ఆ ఒప్పందాన్ని అతిక్రమంచి చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను విడుదల చేస్తున్నారని వ్యాస చౌదరి పేర్కొన్నరు. -
పాకిస్థాన్‌లో తీవ్రవాదుల ఘాతుకం
పాకిస్థాన్‌లోని బెలుచిస్థాన్‌లో కిడ్నాప్‌నకు గురైన 23 మంది ప్రయాణికుల్లో 13 మందిని తీవ్రవాదులు హతమార్చారని మీడియా వెల్లడించింది. మంగళవారం ఉదయం వారి మృతదేహాలను పోలీసులు కనుగోన్నారని తెలిపింది. కాగా మరో 10 మంది ప్రయాణికుల ఆచూకీ ఇంతవరకు తెలియలేదని పేర్కొంది. ఆ ప్రయాణికుల ఆచూకీ వెంటనే కనిపెట్టాలని బెలుచిస్థాన్ ప్రావెన్స్ సీఎం అబ్దుల్ మాలిక్ బెలుచి ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పింది. అలాగే ఆ ఘాతుకానికి ఒడిగట్టిన తీవ్రవాదులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని ఆయన జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారని తెలిపింది. అయితే భద్రతా సిబ్బంది లేకపోవడంతో తీవ్రవాదులు ఆ రెండు బస్సుల్లోని ప్రయాణికులను ఆపి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని అధికారులు అభిప్రాయపడతున్నారని పేర్కొంది. సోమవారం అర్థరాత్రి క్విట్టా నుంచి పంజాబ్ ప్రావెన్స్‌కు వెళ్లున్న రెండు బస్సులను భద్రత దళానికి చెందిన దుస్తులు ధరించిన సాయుధ బృందం బలవంతంగా నిలిపివేసింది. అనంతరం ఆ బస్సులోకి ప్రవేశించి ప్రయాణికులు తమ గుర్తింపుకార్డులు చూపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రయాణికులందరిని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. కాగా మంచ్ ప్రాంతంలో ఆ రెండు బస్సులను తీవ్రవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఆ బస్సుల వెంట ఉన్న భద్రత సిబ్బంది తీవ్రవాదుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో భద్రత సిబ్బంది, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ భద్రత సిబ్బంది మరణించగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని భద్రత సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. -
నైజీరియాలో తీవ్రవాదుల దాడి: 35 మంది మృతి
నైజీరియాలోఈశాన్య రాష్ట్రమైన బోర్నోలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం 35 మంది మరణించారని మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సాగిర్ ముస వెల్లడించారని స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. బామా పట్టణంలోని మొబైల్ బేస్ క్యాంప్‌పై ఆదివారం బొకొ హరం సంస్థకు చెందిన తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారని పేర్కొంది. దాంతో పోలీసులు వెంటనే ఎదురుదాడికి దిగారు. దీంతో 17 మంది బొకొ హరం తీవ్రవాదులతోపాట ఓ పోలీసు మరణించారని చెప్పారు. ఆ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. అలాగే మౌలమ్ ఫటొరి ప్రాంతంలో నైజీరియా, చద్ద్ నుంచి వచ్చిన సైనికులతో ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్‌పై అదే సంస్థకు చెందిన తీవ్రవాదులు మెరుపుదాడికి దిగారని చెప్పారు. ఆ ఘటనలో ఓ సైనికుడితోపాటు 15 మంది బొకొ హరం తీవ్రవాదులు మరణించారని ముస తెలిపారు. -
యూఎస్‌లో వ్యక్తి కాల్పులు: ఇద్దరు మృతి
అమెరికాలోని పెన్సిల్వేనియా పట్టణంలో రాస్ టౌన్షిప్లో జరుగుతున్న సమావేశంలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారని స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. ఆ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. వారిలో ఇద్దరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ప్రత్యేక విమానంలో లీహై వ్యాలీలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుందని చెప్పింది. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మీడియా తెలిపింది. -
తీవ్రవాదుల జాబితాను విడుదల చేసిన యెమెన్
ప్రముఖ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా యెమెన్ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు సమాయత్తమైంది. అందుకు దేశంలోని విదేశీ కార్యాలయాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకుందని ఆ దేశ హోంమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ సంస్థకు చెందిన 25 మంది తీవ్రవాదుల పేర్ల జాబితాను సోమవారం సాయంత్రం యెమెన్ రాజధాని సనాలో ఆ దేశ హోంమంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఆ తీవ్రవాదుల సమాచారం అందజేసిన లేదా ఆచూకీ తెలిపిన వారికి భద్రతా దళాలు రూ.23 వేల అమెరికన్ డాలర్లు పారితోషకంగా అందజేయనున్నాయని తెలిపింది. అయితే యెమెన్ ఆ ప్రకటన విడుదల చేయడంతో ముస్లిం దేశాల్లోని తమ దేశానికి చెందిన 20 దౌత్యకార్యాలయాలను అమెరికా వారం రోజులపాటు మూసివేసింది. యెమెన్‌లోని అల్‌ఖైదా శాఖ అత్యంత ప్రమాదకరమైనదని ఇటీవలే వాషింగ్టన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హిల్లరీకి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయొద్దు
అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయవద్దని దేశంలో ప్రముఖ న్యూస్ చానల్స్‌కు ద రిపబ్లికన్ పార్టీ మంగళవారం హెచ్చరించింది. యూఎస్‌లోని ప్రముఖ న్యూస్ చానల్స్ సీఎన్ఎన్, ఎన్బీసీలకు ఈ మేరకు ద రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్ రినిస్ ప్రిబస్ మంగళవారం లేఖ రాశారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఆ దేశాధ్యక్ష పదవికి డెమెక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. వ్యతిరేక కథనాల వల్ల హిల్లరీ తీవ్రంగా కలత చెందే అవకాశాలున్నాయన్నారు. అలాగే ఆమెపై రూపొందించి ప్రసారం చేసే కథనాలపై అమెరికన్లు ఆ న్యూస్ చానల్స్ ప్రశ్నించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దానితోపాటు ఆ న్యూస్ చానల్స్ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కాగా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగే ప్రాధమిక చర్చల కథనాలను మాత్రం ప్రసారం చేయాలని ఆయా న్యూస్ చానల్స్‌కు సూచించారు. అయితే హిల్లరీపై చిన్న చిన్న కథనాలను రూపొందించి ప్రసారం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎన్బీసీ తెలిపింది. అలాగే ఆమెపై డాక్యుమెంటరీని నిర్మిస్తున్నట్లు సీఎన్ఎన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రినిస్ ప్రిబస్ ఆ న్యూస్ చానల్స్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. -
పాక్, ఆఫ్ఘన్ వరదల్లో 120మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన ఆకస్మిక వరదలతో మృతి చెందినవారి సంఖ్య 120కి చేరింది. అనేకమంది గల్లంతు అయ్యారు. భారీ వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలకు ఆఫ్గనిస్తాన్‌లో 58 మంది చనిపోయారు. మరో 30 మంది వరకు గల్లంతయ్యారు. దేశ తూర్పు ప్రాంతంలోని దుర్గమప్రాంతాలైన నంగర్హార్, నూరిస్తాన్లలోని లోతట్టుప్రాంతాలు వరదలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. మట్టితో కట్టిన ఇళ్ళు పూర్తిగా కొట్టుకుపోగా, పక్కాఇళ్ళు కూలిపోయాయి. బాధితులను ఆదుకోడానికి హమీద్కర్జాయ్ ప్రభుత్వం రాజధాని కాబూల్ నుంచి ఆహారం మందులు, ఇతర అత్యవసర సామాగ్రిని పంపింది. తాలిబన్ తీవ్రవాద ముఠాలకు నిలయయమైన తూర్పు ఆఫ్గనిస్తాన్‌లోని కొండ ప్రాంత రాష్ట్రాల్లో అనూహ్య వరదలు సంభవించడం మామూలే. మరోవైపు పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీ భారీ వర్షాలకు జలదిగ్బంధనమైంది. ఆకస్మికంగా విరుచుకుపడిన వరదలకు మూడురోజుల్లో 53 మంది చనిపోయారు. వీధులన్నీ పెద్ద పెద్ద కాలువలుగా మారిపోవడంతో.. నిన్న కూడా కరాచీ వాసులు ఇళ్ళు వదిలి బైటకు రావడానికి నానా తంటాలూ పడ్డారు. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మురుగునీటితో కలిసిన వర్షం నీరు నగరవాసులను ఇబ్బందులకు గురిచేసింది. లోపభూయిష్టంగా ఉన్న కరాచీ డ్రయినేజీ వ్యవస్థ వరద పరిస్థితిని మరింత గంభీరంగా మారుస్తోంది. మరోవైపు.. మూడురోజులుగా వర్షం పట్టిపీడిస్తుండడంతో నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయడం కూడా నగర ప్రజానీకానికి గగనమైపోతోంది. రంజాన్ పండుగ సమయంలో నెలకొన్న వరద పరిస్థితి జనాన్ని ఇక్కట్లకు గురిచేస్తోంది. కాగా పాక్, ఆఫ్ఘనిస్తాన్లు వరదలకు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఇరు దేశాలకు వరద సహాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆదేశ ఉన్నతాధికారులు వెల్లడించారు. పాక్‌లో వర్షాలు, వరదలకు సుమారు 80మంది మరణించారని, వేలమంది గాయపడినట్లు తమకు నివేదికలు అందాయన్నారు. అయితే సాయం కావాలని పాక్ నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదన్నారు. సాయం కోరితే ఆహారం, మందులుతో పాటు గృహాలు నిర్మాణానికి సాయం అందిస్తామని వారు పేర్కొన్నారు. -
గల్ఫ్‌లో 19 అమెరికన్ దౌత్య కార్యాలయాల మూసివేత
వాషింగ్టన్: గల్ఫ్ దేశాల్లోని 19 దౌత్య కార్యాలయాలను అమెరికా సోమవారం మూసివేసింది. అల్‌కాయిదా హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాల్లోని ఎంబసీలను ఈనెల 10 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లో అల్ కాయిదా అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకు సిద్ధపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం లభించడంతో అమెరికా ముందు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగానే గల్ఫ్‌లోని 22 ఎంబసీలను ఆదివారం మూసివేశారు. ఈ నెలలో అల్‌కాయిదా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఉండటంతో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అమెరికా తన పౌరులను హెచ్చరించింది. రంజాన్ ముగింపులో జరిగే ఈద్ పర్వదినం సందర్భంగా గల్ఫ్ దేశాల్లోని స్థానిక పద్ధతుల ప్రకారం వారం రోజుల పాటు తమ రాయబార, దౌత్య కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి జెన్ సాకీ చెప్పారు. అయితే, అల్‌కాయిదా సంభాషణలను తాము సేకరించామని అమెరికన్ జనరల్ ఒకరు చెప్పారు. అమెరికన్లతో పాటు పాశ్చాత్య దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించాలని పథకం వేసుకుందని అమెరికా ఉమ్మడి బలగాల చైర్మన్ జనరల్ మార్టిన్ డింప్సీ చెప్పారు. -
కరెన్సీలేని దేశానికి ‘రాజాధిరాజు’!
అధికార వ్యామోహం తాగే కొద్దీ పెరిగే దుర్దాహం. జింబాబ్వే అధినేత రాబర్ట్ ముగా బే ఎనభై తొమ్మిదేళ్ల వయసులో ఏడోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ‘ఇది నా దేశం. ఇది నాదే, నిండు నూరేళ్లు నే నే దీన్ని పాలిస్తాను’ అని ఎన్నడో ఆన్న మాటను ఆయన నిలబెట్టుకునేట్టే ఉన్నారు. 1980లో జింబాబ్వే స్వతంత్ర దేశంగా అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ఆప్పటి నుంచి ఆయనే ఆ దేశానికి అధినేత. సవరించిన రాజ్యాంగం ప్రకా రం ఆయన మరోదఫా అధ్యక్ష పదవికి అర్హు లు. అంటే 99వ ఏటగానీ ఆయన స్వచ్ఛం దంగా వానప్రస్థం స్వీకరించే అవకాశం లేదు. జూలై 31న పార్లమెంటు ఎన్నికలతోపాటూ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ముగాబే నేతృత్వం లోని జింబాబ్వే అఫ్రికన్ నేషనల్ యూని యన్ (జెడ్‌ఏఎన్‌యూ-పీఎఫ్) ఘనవిజ యం సాధించింది. పలు లోటుపాట్లున్నా మొత్తంగా ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగాయని ఆఫ్రికన్ యూనియన్ పరిశీలకుల బృందం ప్రకటించింది. ‘నల్లోడి’ మాటలను నమ్మలేని పాశ్చాత్య మీడియా ఈ ఎన్నికలను బూటకంగా కొట్టిపారేస్తోంది. నేటి ప్రభుత్వంలో ప్రధాని, ఎమ్డీసీ-టీ (మూవ్మెంట్ ఫర్ డెమోక్రటిక్ ఛేంజ్) నేత మోర్గాన్ ట్సవంగిరాయ్ ముగాబేకు ప్రధాన ప్రత్యర్థి, ఆయన కూడా ముగాబే ఎన్నిక అక్రమమని సవాలు చేస్తున్నారు. ముగాబే పాశ్చాత్య దేశాల దృష్టిలో ఆఫ్రికా ఖండపు ‘బ్యాడ్ బాయ్’. కానీ ఆయన ఒకప్పుడు యావత్ ప్రపంచం మన్నించిన ఆఫ్రికన్ నేత. జింబాబ్వే జాతీయ విముక్తి నేత, ప్రజాస్వా మ్య ప్రదాత. ఆహారం, విద్య, వైద్యం తదితర సమస్యల పరిష్కారానికి ఆయన తొలి దశాబ్దంలో మంచి కృషి చేశారు. 99 శాతం అక్షరాస్యతతో ఆఫ్రికాలో అగ్రస్థానం జింబాబ్వేదే. దక్షిణాఫ్రికా ధాన్యాగారంగా విలసిల్లిన ఆ దేశం ఇప్పుడు ఆకలిచావుల పొలిమేరల్లో ఉంది. వాతావరణ మార్పుల వల్ల పెరిగే ఉష్ణోగ్రతలతో ఉపరితల జలవనరులలోని నీరు భారీగా ఆవిరైపోతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో సైతం నీటి ఎద్దడి పెరుగుతోంది. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, అవినీతి, ఆశ్రీత పక్షపాతాలకు మారుపేరుగా మారిన ముగా బే పాలన సమస్యను మరింత విషమింపజేస్తోంది. 1980కి ముందు జింబాబ్వే రొడీషియా పేర బ్రిటన్‌కు వలసగా ఉండేది. శ్వేత జాత్యహంకార ప్రధాని అయాన్ స్మిత్ మైనారిటీ పాలనకు వ్యతిరేకంగా 1960ల నుంచి గెరిల్లా విముక్తి పోరాటాన్ని నడిపిన జాతీయ హీరో ముగాబే. నెల్సన్ మండేలా సరసన నిలవాల్సిన నేత. కానీ... చరిత్ర ఆయనపై చెప్పే తీర్పు అందుకు భిన్నంగా ఉండనుంది. కార ణం ఆయన్ను అధికార దాహం, ఆశ్రీత పక్షపాతాలనే రాహుకేతువులు కాటేయడమే. స్వా తంత్య్రానంతరం ఆఫ్రికాలో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారిన జింబాబ్వే 1990లలో క్షీణ దశలోకి ప్రవేశించింది. జింబాబ్వే చెప్పుకోదగ్గ జలవనరులున్న వ్యవసాయక దేశం. పైగా ప్లాటినమ్, బొగ్గు, ముడి ఇనుము, బంగారం, వజ్రాలు తదితర ఖనిజ నిక్షేపాలు కూడా ఉన్నాయి. అయినా 85 శాతం పేదరికం, 90 శాతం నిరుద్యోగంతో జింబాబ్వే నిరుపేదదేశంగా అల్లాడుతోంది. భూసంస్కరణలు, గనులపై స్థానిక యాజమాన్యం వంటి చర్యల తదుపరి కూడా దేశ సంపదలో సగానికిపైగా 10 శాతం మంది చేతుల్లోనే ఉంది. ముగాబే ఆశ్రీత పక్షపాత, అవినీతిమయ పాలన ఫలితాలివి. 2013 జనవరిలో జింబా బ్వే మొత్తం ఖనిజాల ఎగుమతులు 180 కోట్ల డాలర్లు. కాగా, ఒక్క తూర్పు వజ్రాల గనుల నుంచే 200 కోట్ల డాలర్ల విలువైన వజ్రాలను కొల్లగొట్టారంటేనే సమస్య తీవ్రత అర్థమవుతుంది. ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో విపరీతంగా కరెన్సీని ముద్రించిన ఫలితం గా... 2008లో క్షణ క్షణమూ ధరలు రెట్టిం పయ్యే ‘హైపర్ ఇన్ఫ్లేషన్’ (అవధులు లేని ద్రవ్యోల్బణం) ఏర్పడింది. ద్రవ్యోల్బణం 23.1 కోట్ల శాతానికి చేరింది! ఈపరిస్థితుల్లో 2009లో ఏర్పడ్డ జాతీయ ప్రభుత్వం జింబా బ్వే కరెన్సీని రద్దుచేసింది. అమెరికన్ డాల ర్తో పాటూ ఇరుగుపొరుగు దేశాల కరెన్సీయే నేటికీ అక్కడ వాడుకలో ఉంది. సాహసోపేతమైన గొప్ప విప్లవ కర సం స్కరణలను సైతం తీవ్ర దుష్ఫలితాలకు దారి తీసే విధంగా అమలుచేయడానికి ముగాబే పాలన అత్యుత్తమ ఉదాహరణ. మార్క్సిస్టు, సోషలిస్టు భావాలతో ప్రేరేపితుడైన ముగాబే జనాభాలో ఒక్క శాతం శ్వేత జాతీయుల చేతుల్లోనే సగానికి పైగా భూములున్న పరిస్థితిని తలకిందులు చేయాలని ఎంచారు. బ్రిటన్ ‘ఇష్టపడ్డ అమ్మకందార్లు, ఇష్టపడ్డ కొనుగోలుదార్లు’ అనే పథకం కింద భూములను కొని, పేద రైతులకు ఇచ్చే కార్యక్రమం ప్రారంభింపజేసింది. వలస పాలనా యంత్రాంగం ఆ కార్యక్రమాన్ని ఎందుకూ పనికిరాని, నాసి రకం భూములకు భారీ ధరలను చెల్లించే కుంభకోణంగా మార్చింది. ముగాబే సహచరులు కూడా కుమ్మక్కయ్యారు. మరోవంక నిధులను సమకూర్చాల్సిన బ్రిటన్ తాత్సారం చేసి ఆ భూసంస్కరణలకు తూట్లు పొడిచిం ది. దీంతో 2000లో 1,500 మంది శ్వేత జాతీ యుల భారీ వ్యవసాయ క్షేత్రాలను స్వాధీనం చేసుకొని రైతులకు, మూలవాసులకు పం చారు. సేకరించిన భూములన్నీ సైన్యాధికారులు, ప్రభుత్వ నేతల వశమయ్యాయనే మీడియా ప్రచారం అతిశయోక్తే. లక్షకు పైగా కుటుంబాల రైతులు, మూలవాసులకు ఆ భూములలో పునరావాసం కలిగింది. అయితే భూ పంపిణీతో పాటే జరగాల్సిన వ్యవసాయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో శ్వేత జాతీయుల మార్కెట్ ఆధారిత ఆధునిక పంటల పద్ధతి అమల్లో ఉన్న భూముల్లో జీవనాధార వ్యవసాయం ప్రవేశించింది. దీంతో వ్యసాయ ఉత్పత్తి, ఎగుమతులు క్షీణించాయి. అలాగే 2009లో గనులపై యాజమాన్యం స్థానికులకే చెందేలా తీసుకున్న చర్య అక్రమ గనుల తవ్వకానికి, నీటి వనరులు కలుషితం కావడానికి దారితీసింది. 2012 నాటికి ముగాబే ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించారు. జాతీయ విముక్తి నేతగా ముగాబే ప్రతిష్టకు తోడు అది కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. ముగాబే ముందున్న తక్షణ సమస్య అత్యంత తీవ్రమైనది. ప్రధాన ఆహారమైన మొక్కజొన్న ప్రభు త్వ గోదాముల్లో పుచ్చిపోతుండగా జాంబి యా వంటి పొరుగు దేశాల నుంచి భారీ ఎత్తున దిగుమతి చేసుకోవడం ‘లాభసాటి’ గా మారింది. మంచి మొక్కజొన్నలను పుచ్చినవిగా దాణాకు తక్కువ ధ రకు అమ్మి, వాటినే సేకరణ పేరిట తిరిగి అధిక ధరలకు కొనడం పౌర, సైనికాధికారులకు అలవాటుగా మారిం ది. అలాగే తడిచిన, నిల్వకు పనికిరాని మొక్కజొన్నలను మంచి ధరకు కొని, పుచ్చిపోయాక పశువుల దాణాగా అమ్మేయడం నిరాటంకంగా సాగిపోతోంది. 2013 నాటికి దేశంలో కోటి మంది ఆకలితో అలమటిస్తున్నారని ప్రపంచ ఆహార సంస్థ అంచనా. దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా, తాను కన్న కలలు కరిగిపోతుండటం చూసి పరితపిస్తుండగా, ముగాబే తన కల లను తానే కాల్చేసుకుంటూ అధికారం వేడిలో చలి కాగుతుండటం చారిత్రక వైచిత్రి. -
ఇటలీ నావికుల కేసు ఎన్ఐఏకు
న్యూఢిల్లీ: ఇటలీ నావికుల కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించింది. ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం కేరళ పోలీసులకు లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిన నేపథ్యంలో హోంశాఖ ఆ బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించింది. భారత్ సముద్ర జలాల్లో మత్య వేటకు వెళ్లిన ఇద్దరు కేరళకు చెందిన మత్యకారులను మాసిమిలియానో లాతోర్, సాల్వతోర్ గిరోన్ అనే ఇద్దరు ఇటలీ నావికులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. గతంలోనే ఈ ఉదంతంపై వామపక్షాలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇటలీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అంతకుముందు బీజేపీ నేతలు ఇటలీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. భారత్‌ను ఇటలీ తేలికగా తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. -
జమ్మూలో కాల్పులు: గాయపడ్డ భారత జవాను
జమ్మూ: కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో సోమవారం చోటు చేసుకున్నకాల్పుల్లో ఒక భారత జవాను గాయపడ్డాడు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న సాంబా జిల్లాలో అకస్మికంగా కాల్పులు జరగడంతో రామ్ నివాస్ మీనా అనే జవాను గాయపడ్డాడు. ఈ కాల్పుల్లో 200 బెటాలియన్‌కు చెందిన మీనా ఛాతిలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్ర గాయాలైయ్యాయి. తీవ్రంగా గాయపడిన జవాన్‌కు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.. నరైన్ పూర్ సరిహద్దు ప్రాంతంలో రెండు రౌండ్లు కాల్పులు అకస్మికంగా జరిగాయాని ఓ బీఎస్ఎఫ్ అధికారి తెలిపాడు. సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పులు పాకిస్థాన్ సరిహద్దుల నుంచే జరిగి ఉండవచ్చనే సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఘటన అనంతరం బీఎస్ఎఫ్ జవాన్లు ఎటువంటి ఎదురుదాడికి పాల్పడలేదన్నాడు. . . -
భారత ఎంబసీపై దాడిని ఖండించిన అమెరికా
అఫ్ఘానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. అమాయక పౌరులు, మహిళలు, చిన్నారులను పొట్టనపెట్టుకోవడాన్ని గర్హనీయమని అమెరికా స్టేట్ డిపార్టమెంట్ అధికార ప్రతినిధి జెన్ సాకి పేర్కొన్నారు. అఫ్ఘానిస్థాన్‌లో శాంతి స్థాపనకు, సుస్థిరత, అభివృద్ధికి భారత్, అమెరికా దేశాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలను సానుభూతి తెలిపారు. అఫ్ఘానిస్థాన్లోని జలాలాబాద్‌లో భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది మరణించగా.. ముగ్గురు అఫ్ఘాన్ పోలీసులు సహా 24 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిలో రాయబార కార్యాలయ సిబ్బంది ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. ఇటీవలే కాబూల్‌కు ఒక ప్రత్యేక భద్రతా బృందాన్ని భారత్ పంపింది. ఈ నేపథ్యంలోనే బాంబు దాడి జరగడం గమనార్హం. -
అఫ్ఘాన్‌లో భారత ఎంబసీపై ఆత్మాహుతి దాడి
అఫ్ఘానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది మరణించగా.. ముగ్గురు అఫ్ఘాన్ పోలీసులు సహా 24 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిలో రాయబార కార్యాలయ సిబ్బంది ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పెంచిపోషిస్తున్న హక్కానీ నెట్వర్క్ ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. అఫ్ఘానిస్థాన్లోని భారత రాయబార కార్యాలయాలపై ఉగ్రవాద దాడులు జరగవచ్చని నిఘావర్గాల సమాచారం మేరకు.. ఇటీవలే కాబూల్‌కు ఒక ప్రత్యేక భద్రతా బృందాన్ని భారత్ పంపింది. ఈ నేపథ్యంలోనే బాంబు దాడి జరగడం గమనార్హం. భారీగా పేలుడు పదార్థాలను తీసుకుని ముగ్గురు ఉగ్రవాదులు.. జలాలాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం వైపు ఒక కారులో దూసుకువచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న అఫ్ఘాన్ పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాల్పులు ప్రారంభించారు. భారీగా పేలుడు పదార్థాలను ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు కారు దిగి రాయబార కార్యాలయం వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించగా భద్రతా సిబ్బంది కాల్చేశారు. దాంతో మరో ఉగ్రవాది కారులో ఉన్న బాంబులను పేల్చేశాడు. అదే సమయంలో సమీపంలోని మసీదుకు వెళుతున్న చిన్నారులతోపాటు, వీసాల కోసం వచ్చినవారు మృత్యువాత పడ్డారు. పేలుడు ధాటికి నేలపై పెద్ద గొయ్యిపడింది. అయితే.. భారత అధికారులకు, రాయబార కార్యాలయానికి ఎటువంటి నష్టం జరగలేదని ఢిల్లీలోని భారత అధికారవర్గాలు వెల్లడించాయి. రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడుల వంటి ఘటనలతో భారత్ భయపడబోదని, అఫ్ఘానిస్థాన్ పునర్నిర్మాణం కోసం తాము అందిస్తున్న సాయం కొనసాగుతుందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు.