శబరిమలైలో టీటీడీ తరహా సదుపాయాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

శబరిమలైలో టీటీడీ తరహా సదుపాయాలు కల్పించాలి

Nov 18 2026 1:38 AM | Updated on Nov 18 2026 1:38 AM

కడప కార్పొరేషన్‌ : శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు తిరుమల తరహాలో మెరుగైన మౌలిక సదుపాయాలు, రవాణా, వసతి కల్పించి కొండ మార్గాల అభివృద్ధి చేయాలని శాసన మండలి సభ్యులు ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కేరళ ముఖ్యమంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తరలివస్తుంటారని, తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల నుంచి అత్యధిక మంది అయ్యప్ప స్వామిపై ఉన్న అపారమైన విశ్వాసంతో భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. కాగా శబరిమలై యాత్రలో ముఖ్యంగా కొండపైకి వెళ్లే మార్గంలో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరైన రహదారులు, విశ్రాంతి ప్రదేశాలు, తగిన వసతి సౌకర్యాలు లేకపోవడం వల్ల వృద్దులు, మహిళలు, చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

కేరళ ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ

ఎంవీ రామచంద్రారెడ్డి వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement