నాగిరెడ్డిపల్లె మేజర్‌ పంచాయతీ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులదే | - | Sakshi
Sakshi News home page

నాగిరెడ్డిపల్లె మేజర్‌ పంచాయతీ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులదే

Nov 18 2026 1:38 AM | Updated on Nov 18 2026 1:38 AM

● శిరీషాకు అన్ని వర్గాల మద్దతు

● మాజీ ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి

రాజంపేట : పంచాయతీ ఎన్నికల్లో ఆది నుంచి నాగిరెడ్డిపల్లె మేజర్‌ పంచాయతీ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులదేనని నందలూరు మాజీ ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నాగిరెడ్డిపల్లె అర్బన్‌లోని ఇసుకపల్లె దళితనేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ మద్దతురాలిగా పోటీ చేస్తున్న భోగాపతి శిరీషకు అన్ని వర్గాల నుంచి ఆదరణ ఉందన్నారు. ఆమె తండ్రి వైఎస్సార్‌సీపీ నేత మటన్‌ రమణ నాగిరెడ్డిపల్లె అర్బన్‌లో సుపరిచితుడన్నారు. పోలింగ్‌ ప్రక్రియలో ఓటరు నేరుగా శిరీషాకు ఓటు వేయడం తధ్యమన్నారు. నాగిరెడ్డిపల్లె అర్బన్‌ పరిధిలో నాగిరెడ్డిపల్లె, అరవపల్లె, నాగిరెడ్డిపల్లె రైల్వే, ఇసుకపల్లె, నారాయణరాజుపేట తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అనుకూలమైన ప్రాంతాలన్నారు.

ఎమ్మెల్యే, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎంపీ మేడా రఘునాథరెడ్డిలతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు, నాగిరెడ్డిపల్లె ఓటర్లు ఆశీస్సులు భోగాపతి శిరీషకు పుష్కలంగా ఉన్నాయన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నాగిరెడ్డిపల్లె అర్బన్‌ ప్రాంతంలో శాశ్విత అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. మేడాతోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు షమీవుల్లాఖాన్‌, మోదుగల చంద్రశేఖర్‌, వైఎస్సార్‌సీపీ మహిళ నాయకురాలు పల్లె మాధవీ, మాజీ కో–ఆప్షన్‌ సభ్యుడు కలీం, మాజీ మండల ఉపాధ్యక్షుడు తుమ్మల శ్రీధర్‌గౌడ్‌, స్ధానిక పెద్దలు వెంకటసుబ్బయ్య, వంశీకృష్ణ, వేణుగోపాల్‌, వెంకటసుబ్బయ్య, పాపయ్య, కిష్టయ్య, సుధా శ్రీకాంత్‌, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement