ఎస్‌.వెంకటాపురం వాసి కువైట్‌లో మృతి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌.వెంకటాపురం వాసి కువైట్‌లో మృతి

Nov 18 2026 1:38 AM | Updated on Nov 18 2026 1:38 AM

అట్లూరు : మండల పరిధిలోని ఎస్‌.వెంకటాపురం ఉప్పుటూరు కాలనీకి చెందిన కోటా సుధాకర్‌ (40) అనే వ్యక్తి కువైట్‌లో గుండెపోటుతో మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. వారి వివరాల మేరకు.. సుధాకర్‌కు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడం భారం కావడంతో నాలుగేళ్ల కిత్రం బతుకుతెరువు కోసం సుధాకర్‌ కువైట్‌కు వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కువైట్‌కు వెళ్లి నాలుగేళ్లు కావడంతో సంక్రాంతి పండుగకు ఇంటికి వస్తానని ఫోన్‌లో చెప్పాడని కుటుంబ సభ్యులకు తెలిపాడు. మంగళవారం కువైట్‌లోని అల్‌ జహరా ప్రాంతంలో పనులు చేస్తూ ఇండియా సమయం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు సదరు కంపెనీ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పిన సుధాకర్‌ గుండెపోటుతో మృతి చెందాడని సమాచారం రావడంతో భార్య, బిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించారు.

విద్యుత్‌ ప్రమాదంలో వ్యక్తి మృతి

చక్రాయపేట : మండలంలోని కుప్పం గ్రామం చిన్నమోరయ్య గారి పల్లెకు చెందిన మూలి ధర్మారెడ్డి (42) అనే వ్యక్తి మంగళవారం విద్యుత్‌ ప్రమాదానికి గురై మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మారెడ్డి కూలి పనుల నిమిత్తం ట్రాక్టర్‌ పనికి వెళ్లాడు. అయితే కె.రాజుపల్లె నుండి కుప్పం హరిజనవాడకు వచ్చే దారి లో ట్రాక్టర్‌ దగ్గరకు రాగానే విద్యుత్‌ వైరు ఒక్కమారుగా తెగి పడటంతో ధర్మారెడ్డి షాక్‌కు గురయి మృతి చెందాడు. మృతుడికి భార్య అరుణ కుమారి తోపాటు 12 సంవత్సరాల లోపు ఉన్న ముగ్గరు సంతానం ఉన్నారు. మృత దేహాన్ని శవపరీక్షల నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మారెడ్డి భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎస్‌కెఎం హుస్సేన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement