దువ్వూరు : మండలంలోని కానగూడూరు వద్ద ఉన్న కడప కర్నూలు జాతీయ రహదారిపై తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు ..కడప వైపు నుండి కర్నూలుకు వెళుతున్న ట్రేలర్ లారీ కానగూడూరు వద్ద ఉన్న ఇండేన్ పెట్రోలు బంకు వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను దాటి ఆళ్లగడ్డ నుండి మైదుకూరుకు వెళుతున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ముందు వైపు ఢీకొంది. సమయస్ఫూర్తితో బస్సు డ్రైవర్ పక్కనున్న పొలాల్లోకి బస్సును మళ్లించాడు. లారీ కూడా పక్కనున్న పొలాల్లోకి వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనను స్థానికులు గమనించి బస్సు దగ్గరకు వెళ్లి అందులోని ప్రయాణికులను కిందికి దించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యహరించడం వల్ల ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎస్‌ఐ ధనుంజయుడు, రవాణా శాఖ అధికారులు పరిశీలించారు.
వినాయకుడి విగ్రహం
చోరీకి యత్నం
వేంపల్లె : మండలంలోని అలవలపాడు గ్రామంలో ఉన్న సాంబశివయ్య దేవాలయంలో సోమవారం రాత్రి వినాయకుడి విగ్రహాన్ని అపహరించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు యత్నించారు. ఆలయంలోని వినాయకుడి విగ్రహాన్ని ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు. రెండేళ్ల క్రితం కూడా ఇదే ఆలయంలో వినాయకుడి విగ్రహం చోరీకి ప్రయత్నం జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దేవదాయ శాఖ అధికారులతోపాటు పోలీసులకు సమాచారమందించారు. ఆలయాల్లో విలువైన విగ్రహాలు, ఆభరణాల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి దేవాలయాలకు తగిన రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.
ప్రత్యేక లోక్ అదాలత్‌పై
అవగాహన కల్పించాలి
కడప అర్బన్ : ఉమ్మడి కడప జిల్లా ప్రజల్లో ప్రత్యేక లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్‌లపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఈ బాధ్యతను ప్రతి న్యాయవాది స్వీకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యా యసేవాధికారసంస్థ చైర్మన్ జి.రామగోపాల్ పి లుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం కడప బార్ అసోసియేషన్‌న్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్ న్యాయవాదులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 21న నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్, డిసెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్, కడపబార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి. రాఘ వరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్, కార్యవర్గసభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


