కడప సెవెన్‌రోడ్స్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవరోజైన సోమవారం నామినేషన్ల కార్యక్రమం కొనసాగింది. జిల్లాలోని 13 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 726, వార్డు స్థానాలకు 1554 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలాల వారీగా పరిశీలిస్తే అట్లూరు మండలంలో సర్పంచు స్థానాలకు 38, వార్డు స్థానాలకు 100 నామినేషన్లు, బి.కోడూరులో సర్పంచులకు 46, వార్డులకు 65, బద్వేలులో సర్పంచులకు 56, వార్డులకు 111, గోపవరంలో సర్పంచులకు 34, వార్డులకు 67, కలసపాడులో సర్పంచులకు 65, వార్డులకు 114, పోరుమామిళ్లలో సర్పంచులకు 94, వార్డులకు 226, కాశినాయనలో సర్పంచులకు 55, వార్డులకు 76, సిద్దవటంలో సర్పంచులకు 66, వార్డులకు 181, ఒంటిమిట్టలో సర్పంచులకు 35, వార్డులకు 57, నందలూరులో సర్పంచులకు 51, వార్డులకు 127, రాజంపేటలో సర్పంచులకు 96, వార్డులకు 213, సుండుపల్లెలో సర్పంచులకు 51, వార్డులకు 102, వీరబల్లిలో సర్పంచ్ స్థానాలకు 39, వార్డు స్థానాలకు 115 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు వెల్లడించారు.
పోతిరెడ్డి ప్రకాష్‌రెడ్డికి జాతీయ సేవా పురస్కారం
ప్రొద్దుటూరు : పట్టణానికి చెందిన పోతిరెడ్డి ప్రకాష్‌రెడ్డి నటశేఖర పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ పేరు మీద జాతీయ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. గుంటూరులో అఖిల భారత ఎన్జీఓ వెల్ఫేర్ అసోసియేషన్, కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొడవటికంటి బాలరాజు ఆధ్వర్యంలో 8వ సమాజ సేవకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ చారిటబుల్ ట్రస్టు గౌరవాధ్యక్షుడు పోతిరెడ్డి ప్రకాష్‌రెడ్డికి నటశేఖర పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ జాతీయ సేవా పురస్కారం అందించి సత్కరించారు. కాగా ప్రకాష్‌రెడ్డిని స్థానిక వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య జి.జయచంద్ర అభినందించారు.
లేబర్ కోడ్స్ రద్దుకై డిసెంబర్లో ‘చలో ఢిల్లీ’
మైదుకూరు: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ రంగ ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో శ్రీచలో ఢిల్లీశ్రీ నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలిపారు. సోమవారం మైదుకూరు డివిజన్ ఆఫీసు వద్ద యూనియన్ నేతలు కామనూరు శ్రీనివాసులరెడ్డి, బి. నాయబ్ రసూల్, బీఎన్ నాగసుబ్బయ్య పోస్టర్లను ఆవిష్కరించారు. డివిజన్ అధ్యక్షుడు బండి రామమోహన్, పాల శీను, వెంకటరమణ పాల్గొన్నారు.


