మాజీ సర్పంచ్‌ ఇంటిపై దాడి | - | Sakshi
Sakshi News home page

మాజీ సర్పంచ్‌ ఇంటిపై దాడి

Nov 6 2026 2:44 AM | Updated on Nov 6 2026 2:44 AM

టాస్క్‌ఫోర్స్‌ : మాజీర్పంచ్‌ దండు నాగభూషన్‌రెడ్డి ఇంటిపై బుధవారం అర్ధరాత్రి పచ్చమూకలు దాడి చేశాయి. వివిరాలమేరకు...సంబేపల్లెపల్లె మండల పరిధిలోని గున్నికుంట్ల గ్రామం దండూరివాండ్లపల్లెకు చెందిన మాజీ సర్పంచ్‌ డి.నాగభూషన్‌రెడ్డికి గత కొన్ని రోజులుగా కూటమి నేతల నుంచి స్థానిక సంస్థల ఎ న్నికలకు దూరంగా ఉండాలని బెదిరింపులు వస్తున్నా యి. ఈ క్రమంలోనే మాజీ సర్పంచ్‌ నివాసంపై బుధ వారం అర్ధరాత్రి పచ్చమూకలు మారణాయుధాలతో విరుచుకుపడ్డాయి. నాగభూషణ్‌రెడ్డి ఇంటి ప్రాంగణంలోకి చొరబడిన దుండగులు తీవ్ర బీభత్సం సృష్టించారు. అక్కడ పార్క్‌ చేసి ఉన్న ఏపీ 39 జేఎఫ్‌ 0009 నంబర్‌ గల కియా కారు, ఏపీ 39 వీసీ 0009 నంబర్‌ గల బొలెరో వాహనంతో పాటు రెండు స్కూటర్లను ధ్వంసం చేశారు. ఈ దాడిపై మాజీ సర్పంచ్‌ తొమ్మిది మందిపై సంబేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద పచ్చమూకల హల్‌చల్‌

స్థానిక ఎన్నికలను అడ్డం పెట్టుకుని సంబేపల్లె మండలంలో గురువారం టీడీపీ శ్రేణులు బరితెగించాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద పచ్చమూకలు భారీగా మోహరించి హల్‌చల్‌ చేశాయి. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి రౌడీ మూకలను పెద్ద సంఖ్యలో దింపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సామాన్య ఓటర్లను బెదిరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న పచ్చమూకల తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement