ఆ ఇద్దరు.. పోరాటయోధులు | - | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు.. పోరాటయోధులు

Nov 4 2026 2:14 AM | Updated on Nov 4 2026 2:14 AM

బీకేఎం స్ట్రీట్‌లో దేవిరెడ్డి ఆదిత్య, జమీల్‌కు ఘన స్వాగతం పలికిన జనం

● టీడీపీకి ముచ్చెమటలు పట్టించిన

దేవిరెడ్డి ఆదిత్య, జమీల్‌

● ప్రజా మద్దతుతో

కార్పొరేటర్లుగా విజయం

సాక్షి ప్రతినిధి, కడప : కూటమి కుట్రలను చీల్చుకుంటూ.... అధికారుల ఆంక్షల సంకెళ్లను తెంచుకుంటూ ఆ ఇద్దరు బరిలో నిలిచారు.. పచ్చ నేతలు సాగిస్తున్న అరాచకాలను.. తమపై కక్షగట్టిన తీరును ప్రజల ముందుంచారు.. ఆశీర్వదించాలని ఓటరు దేవుళ్లను అభ్యర్థించారు. అంతకుముందు నిత్యం ప్రజా సేవలో తరించారు..ఇంకేముంది ప్రజా తీర్పు ముందు కూటమి కుట్ర ఓడిపోయింది. నిజమైన ప్రజా విజయం వారి ముంగిటకొచ్చి వాలింది. కడప కార్పొరేషన్‌ఎన్నికల్లో అన్ని అడ్డంకులు ఎదుర్కొని విజయం సాధించి పోరాటయోధులుగా నిలిచారు. వారే దేవి రెడ్డి ఆదిత్య, జమీల్‌. 33వ డివిజన్లో దేవిరెడ్డి ఆదిత్య భార్య సంధ్యారాణి, 46వ డివిజన్లో జమీల్‌ను స్థానిక డివిజన్‌ ప్రజలు కార్పొరేటర్లుగా ఆశీర్వదించారు. కాగా వీరి విజయం బాక్స్‌లో నిశ్చయమై ఉండగా, దాని సైతం తొక్కి పెట్టాలని టీడీపీ నేతలు కుయుక్తులు పన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియను ఏకంగా మూడు గంటల పాటు నిలిపేయడం గమనార్హం.

ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ పెట్టినా..

వైఎస్సార్‌సీపీ నేతలైన జమీల్‌, ఆదిత్య ఎదుగుదలకు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అడుగడుగునా అడ్డుగా నిలిచింది. కూటమి అధికారంలోకి రాగానే కక్షగట్టి ఆదిత్య వాటర్‌ ప్లాంట్‌ను మూసే యించింది. అలాగే ఇటీవల నామినేషన్‌ల సందర్భంగా ఓ ఫోన్‌ సంభాషణలో ‘జమీల్‌ను వదిలిపెట్టొద్దు.., నేనున్నా టార్గెట్‌ చేయండి’ అంటూ నేరుగా మాట్లాడుతున్న విషయం బహిర్గతమైంది. ఆ ఇద్దరిని ఓడించేందుకు విశ్వప్రయత్నం చేశారు. పోలీస్‌ పవర్‌ ఉపయోగించుకున్నారు. ప్రజా తీర్పులో అవన్నీ దిగదుడుపేనని స్పష్టమైంది.

రెండు డివిజన్లలో..

కడప కార్పొరేషన్‌ : కడప నగర పాలక సంస్థలోని 66 వార్డులకు ఇదివరకు 52 స్థానాలను కూటమి దౌర్జన్యాలతో ఏకగ్రీవం చేసుకున్న విషయం విది తమే. ఆపై 14 వార్డులకు ఎన్నికలు జరగ్గా 33, 46 డివిజన్లలో పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సంధ్యారాణి, జమీల్‌ విజ యం సాధించారు.

జమీల్‌

సంధ్యారాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement