కడప కార్పొరేషన్ : కడప మున్సిపల్ ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్ సీపీదేని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపా రు. మంగళవారం రాత్రి కడప నగర శివార్లలో ని కౌంటింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ సీపీ అభ్య ర్థి బండిదీప్తిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ అన్ని దశల్లోనూ అరాచకాలు, అక్ర మాలకు పాల్పడిందన్నారు. ఇన్ని అరాచకాలు చేసినా 33వ డివిజన్, 46వ డివిజన్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉండడాన్ని జీర్ణించుకోలేక వాటి ఫలితాలు ప్రకటించకుండా నొక్కి పెట్టారన్నారు. టేబుల్ నెం.23, 26లలో స్వస్తిక్ గుర్తుతో కాకుండా పోలింగ్ కేంద్రం నెంబరుతో ఉన్న సీలుతో రిగ్గింగ్ చేశారన్నారు. దీనిపై ఆర్వోకు ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి ఉంటే మేయర్ అభ్యర్థి దీప్తిరెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచేదన్నారు.
ఓటర్లకు శతకోటి వందనాలు
కడప కార్పొరేషన్ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి అన్నారు. మంగళవారం రాత్రి కౌంటింగ్ ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలు వైఎస్సార్సీపీకి.. పోలీసులకు మధ్య జరిగాయన్నారు. వారే విజయం సాధించారన్న ఆమె ‘పోలీసులకు కంగ్రాట్స్’ అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అనేక అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు జరిగినా ధైర్యంగా ముందుకొచ్చి తనకు ఓటేసిన 66,000 మంది ఓటర్లకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. తనపై విజయం సాధించిన సువర్ణ తోలుబొమ్మలా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని ఆమె సూచించారు.


