ఉదయం నుంచి మీడియా కౌంటింగ్ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తోంది. ఒక రౌండ్ ఫలితం కూడా రాత్రి 7గంటల వరకూ వెల్లడించకపోవడంపై కమిషనర్ భవానీప్రసాద్‌ను మీడియా ప్రతినిధులు నిలదీశారు. అన్ని ప్రాంతాల్లో మేయర్ తుది ఫలితం వెల్లడించినా తొలిరౌండ్ కూడా వెల్లడించలేని దుస్థితి ఏమిటని ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా చేతులు అడ్డంగా ఊపుతూ వెళ్లిపోవడం గమనార్హం. కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ నేతలకు ముచ్చెమటలు పట్టడంతో వాటిని తుడిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని ప్రజాస్వామ్యవాదులు ఎద్దేవా చేశారు. పోలింగ్ ఏజెంట్లు లేకపోయినా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ముందంజలోకి రావ డంతో టీడీపీ నేతల అరికాళ్లలో మంటలు పుట్టిన ట్లు తెలుస్తోంది. ఆమేరకే వారి అడుగులకు మడు గులొత్తుతూ వైఎస్సార్‌సీపీ ఓట్లు ఇన్ వ్యాలిడ్ చేయించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఎన్నికల తీరుతో ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నా అధికారులకు చీమకుట్టినట్లయినా లేకపోవడం విచారకరం.పైగా ‘మేం అనుకున్న ఫలితాన్నే వెల్లడిస్తా’మనే దిశగా అధికారులు వ్యవహరిస్తుండ డం గమనార్హం. దౌర్జన్యంతో విజయం సాధించా మని కూటమి నేతలు అనుకోవచ్చు గానీ నిజానికి ఈ ఎన్నికలే వారి పతనానికి నాంది పలికాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.


