ప్రచారపర్వం | - | Sakshi
Sakshi News home page

ప్రచారపర్వం

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

సాక్షి ప్రతినిధి, కడప : జెడ్పీ చైర్మన్‌ సీటు కోసం అధికార టీడీపీ కుట్రలకు మరింతపదును పెట్టింది. వీరికి అధికార యంత్రాంగం వత్తాసుగా నిలిచింది. జెడ్పీటీసీ నామినేషన్ల పరిశీలనలో ఈ విషయం రూఢీ అయింది. టీడీపీ నేతలు అభ్యంతరం చెబితే చాలు పక్కన పెట్టడమే తరువాయిగా ఆర్వో వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పైరవీలకు తలాడించిన ఆర్వో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల 12 నామినేషన్లు తిరస్కరించారు.

● కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఆర్‌ వెంకటసుబ్బారెడ్డి (ఆర్వీఎస్‌ఆర్‌) పోటీ చేశారు. నామినేషన్‌ పరిశీలనలో ఎలాంటి రిమార్కులు లేవంటూ అధికారులు తొలుత అనుమతించారు. ఈ నామినేషన్‌ను ఎలా గైనా తిరస్కరించాలనే ఉద్దేశంతో టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. వాటికి వివరణ తీసుకుని సంతృప్తి చెందిన ఆర్వో.. ఆపై తెల్లవారుజామున 3గంటలకు చెన్నూరు అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా 40ఏళ్లుగా ఆర్వీఎస్‌ఆర్‌కు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పైగా జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి వియ్యంకుడు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి నరేన్‌ రామాంజులరెడ్డికి మామ. ఈ పరిస్థితుల్లో పోటీ పడి విజయం సాధించలేమన్న భయంతోనే టీడీపీ ఆర్వీఎస్‌ఆర్‌ నామినేషన్‌ తిరస్కరించాలని పట్టుబట్టింది. ఆమోదించిన నామినేషన్‌ను సైతం తిరస్కరించి స్వామిభక్తి ప్రదర్శించడంలో ఆర్వో సఫలీకృతుడయ్యారని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఇదే విధంగా టీడీపీ అభ్యంతరాలకు అనువుగా నిర్ణయం తీసుకుంటూ వచ్చారు. అభ్యర్థుల వివరణ తీసుకుంటామని ప్రకటించిన ఆర్వో అర్ధరాత్రి వరకూ అభ్యర్థులు వేచి ఉన్నా ఎలాంటి వివరణ కోరకుండా 12 నామినేషన్లు తిరస్కరించారు. ఇదేవిషయమై లీగల్‌ సెల్‌ ప్రతినిధులు సైతం ప్రశ్నించినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఆ పార్టీ అభ్యర్థులు వాపోతున్నారు.

పరిశీలనలో తిరస్కరణ ఇవే..

నామినేషన్లు స్వీకరణ సందర్భంగా ముద్దనూరు, వీరపునాయునిపల్లె, కమలాపురం, చింతకొమ్మదిన్నె, ఖాజీపేట, సింహాద్రిపురం మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్లు పరిశీలన సందర్భంగా పెండ్లిమర్రి, వల్లూరు, చెన్నూరు, ప్రొద్దుటూరు, తొండూరు, చక్రాయపేట, జమ్మలమడుగు, యర్రగుంట్ల, పోరుమామిళ్ల, అట్లూరు, కొండాపురం, వీరబల్లి మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. వీటిపై అప్పీళ్లు వెళ్లిన నేపధ్యంలో తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. కాగా ప్రతి అడుగులో అధికారులను అడ్డు పెట్టుకొని టీడీపీ కుట్రలు అమలు చేస్తూ లబ్ధి పొందుతుండడం గమనార్హం.

జెడ్పీ చైర్మన్‌గిరీ సొంతం చేసుకునే ఎత్తుగడలో టీడీపీ

ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పెద్ద ఎత్తున పైరవీలు

ఏకపక్ష దిశగా అడుగులు వేస్తున్న అధికారులు

ఆదివారం వేకువజాము 3.30గంటల వరకూ నామినేషన్ల పరిశీలన

వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థుల 12 నామినేషన్లు తిరస్కరణ

స్క్రూటినీ అయిపోయేంత వరకూ అక్కడే ఉన్న ‘పోచంరెడ్డి’

తప్పులు లేకపోయినా పక్కనపెడుతున్న అధికారుల నిలదీత

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరణను పరిగణలోకి తీసుకోని ఆర్వో

ఆర్వో నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లిన వైఎస్సార్‌సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement