నేటి ‘పీజీఆర్‌ఎస్‌‘ రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ‘పీజీఆర్‌ఎస్‌‘ రద్దు

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, కడప కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రోజువారీ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాలను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి డిసెంబర్‌ 3 వరకు అమలులో ఉంటుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి ముగిసే వరకు ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ను తాత్కా లికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఎన్నికల విధులను

బాధ్యతగా నిర్వహించాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సాధారణ పరిశీలకులు జి. గణేష్‌ కుమార్‌ సూచించారు. ఆదివారం కడప నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల (మెయిన్‌)లో నిర్వహించిన సూక్ష్మ పరిశీలకుల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి ఎన్నికల విధులపై పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియలో జరిగే ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని తెలిపారు. సూక్ష్మ పరిశీలకుల సమన్వయ అధికారి, జిల్లా ఉపాధి అధికారి సురేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రచారంపై ప్రత్యేక నిఘా!

కడప సెవెన్‌రోడ్స్‌ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచురించే పోస్టులు, చిత్రాలు, వీడియోలు, లఘు చిత్రాల విషయంలో కంటెంట్‌ క్రియేటర్లు, సామాజిక మాధ్యమాల ఇన్‌ ఫ్లూయన్సర్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్‌ చెరుకూరి సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా, కులాలు, మతాలు, వర్గాల మధ్య విభేదాలు సష్టించేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లేదా అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎలాంటి ప్రచార సామగ్రిని రూపొందించవద్దని స్పష్టం చేశారు. ఇన్‌స్ట్రాగామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో వెలువడే ప్రచార అంశాలపై ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని కలెక్టర్‌ తెలిపారు.

డయల్‌ యువర్‌ సీఎండీ రద్దు

కడపకార్పొరేషన్‌ : విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్పీడీసీఎల్‌ ప్రతి సోమవారం నిర్వహించే ‘డయల్‌ యువర్‌ ఏపీఎస్పిడిసిల్‌ సీఎండీ’, ‘డయల్‌ యువర్‌ ఎస్‌ఈ’ కార్యక్రమాలను రద్దు చేసినట్లు ఆ సంస్థ చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement