కడపను ఆదర్శంగా తీర్చిదిద్దుతా | - | Sakshi
Sakshi News home page

కడపను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం?

రాయలసీమ కార్మిక, కర్షక సేవా సమితి అధ్యక్షులు సీహెచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి, రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌(ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌) పద్మావతి నా తల్లిదండ్రులు. మాజీ డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డి నా భర్త, మాకు ఇద్దరు కుమా ర్తెలు. నేషనల్‌ లా ఎగ్జామ్‌లో ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌కు ఎంపికయ్యాను. ఐదేళ్ల న్యాయవిద్యను అభ్యసించిన తర్వాత ఏపీ హైకోర్టులో అడ్వకేట్‌గా రిజిస్టర్‌ చేసుకుని కొన్నేళ్లపాటు పనిచేశాను. పెళ్లయ్యాక కిరణ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, అయ్యవారురెడ్డి మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ కరస్పాండెంట్‌గా ఉన్నాను.

రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది?

2014లో మా వార్డు జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయినప్పుడు కార్పొరేటర్‌గా పోటీ చేశాను. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలిగా ఉన్నాను. ఇప్పుడు మేయర్‌ అభ్య ర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్‌ వేశాను. నాపై నమ్మకం ఉంచి అభ్యర్థిగా ప్రకటించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాను.

కడప అభివృద్ధిపై మీ కార్యాచరణ ప్రణాళిక?

కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్‌తో మురికివాడల అభివృద్ధికి కృషి చేస్తా.. పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలకు అధిక ప్రాధాన్యత ఇస్తాను. ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను.

ఎన్నికల్లో మీ ప్రచారాస్త్రాలు ఏమిటి?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు అవుతున్నా కడప నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. బుగ్గవంకపై గుర్రాలగడ్డ, లా కాలేజీ వద్దల బ్రిడ్జిలకు రూ.20కోట్లు మంజూరైనా ఈనాటికీ ఆ పనులు పూర్తి చేయని పరిస్థితి ఉంది. బుగ్గవంక సుందరీకరణ, అప్రోచ్‌ రోడ్లు, నగరంలో ప్రధాన రహదారుల విస్తరణ, సర్కిళ్ల సుందరీకరణ, వరదనీటి కాలువల నిర్మాణం అన్నీ మహానేత వైఎస్సార్‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిల హయాంలో పూర్తి చేసినవే. కడపలో నీటి సమస్యను శాశ్వతంగా పారదోలాలన్న ధృడసంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్రహ్మంసాగర్‌ నుంచి 1.5 టీఎంసీ కేటాయించి పైపులైన్‌ వేసి గ్రావిటీ ద్వారా నీటిని తెచ్చేందుకు సుమారు రూ.500 కోట్లు మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పనులే కొనసాగిస్తున్నారు తప్పా వీళ్లు కొత్తగా చేసిందేమీ లేదు. పెండింగ్‌ పనులను 100 శాతం పూర్తి చేయడానికి కృషి చేస్తాను.

ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకుల ఆగడాలు, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడాన్ని ఎలా చూస్తారు?

ఇది చాలా అప్రజాస్వామికం. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు చేసే బదులు ఎన్నికలను రద్దు చేసి, కొత్త జీవోల ద్వారా నామినేషన్‌ పద్ధతిలో ఎన్నుకుంటే సరిపోతుంది కదా.. ఇంత దుర్మార్గ పరిస్థితి ఎప్పుడూ లేదు. వైఎస్సార్‌సీపీ విజయాన్ని ముందే ఊహించారు కాబట్టే ఇలా చేస్తున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి నిజాయితీగా పనిచేస్తా

పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలకు అధిక ప్రాధాన్యత

వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి

కడప ప్రజలు తనను ఆశీర్వదించి మేయర్‌గా గెలిపిస్తే కడపను గత

ప్రభుత్వంలో అభివృద్ధిని కొనసాగించి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి అన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచార పర్వం మొదలైన నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.

ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

– కడపకార్పొరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement