పరాకాష్టకు చంద్రబాబు కుటిల రాజకీయాలు | - | Sakshi
Sakshi News home page

పరాకాష్టకు చంద్రబాబు కుటిల రాజకీయాలు

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

కడప ఎడ్యుకేషన్‌ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో భయపెట్టి గెలవాలని సీఎం చంద్రబాబు చూస్తున్నారని, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డగింతలు, దాడులు, దౌర్జన్యాలు, చివరికి ఫేక్‌ నామినేషన్లతో బరి తెగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌ రెడ్డి మండిపడ్డారు. జగన్‌ కూడా ఇలాగే చేసి ఉంటే మీరు ఎక్కడ ఉండే వారని ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల మాటలు విని దాడులకు, అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కడపలోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. చంద్రబాబు రాజకీయమే వెన్నుపోటు నుంచి ప్రారంభమైందని.. క్లైమాక్స్‌లో పరాకాష్టకు చేరిపోయిందన్నారు.కోర్టులు మొట్టికాయలు వేసినా బాబుకు బుద్ధి రావడం లేదన్నా రు. నామినేషన్లు లేకుండా చేయడాన్ని ప్రజాస్వామ్యం అంటారా ? ఇది రాజకీయమేనా ? అని ప్రశ్నించారు.

ఫేక్‌ నామినేషన్లతో మభ్యపెట్టే యత్నం..

ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు డూప్లికేట్లు తయారు చేసి టీడీపీ వాళ్లతో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా నామినేషన్లు వేయించారని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించామని కోర్టుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని మభ్యపెట్టడానికే ఇదంతా చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫేక్‌ నానిమేషన్లు ఉన్నాయన్నారు.

అధికారులు మూల్యం చెల్లించుకోవడం ఖాయం

కడపలో 14 జడ్పీటీసీల్లో ఫేక్‌ నామినేషన్లు వేశారు. దాఖలైన 39 నామినేషన్లలో ఇప్పుడు ఆమోదించినవి చూస్తే 21 మాత్రమే. మిగతావన్నీ తిరస్కరించారు. 39 నామినేషన్లలో ఓ ఆరు నామినేషన్లు పోలీసుల్ని అడ్డుపెట్టుకుని వీళ్లు చేసిన దాష్టికానికి బలైన వాళ్లే. నామినేషన్‌ కేంద్రాల లోపల మాత్రం వందల మంది వీళ్ల నాయకు లే ఉంటారని బయటి నుంచి మా వాళ్లు ఒక్కరిని కూడా రానివ్వరన్నారు. వేటిని తిరస్కరించాలి, వేటిని ఆమోదించాలన్నది పై నుంచి అన్నీ ఒత్తిళ్లే. నామినేషన్ల తిరస్కరణకు గురైన వాళ్ల తరఫున అప్పీలుకు వెళ్తున్నాం. కలెక్టర్‌ ఏం చేస్తారో చూడాలన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూస్తాం, అందరికీ మేలు చేస్తాం, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతామని ప్రమాణం చేసి వస్తారని... కానీ అలాంటి వాళ్ల ముందే ఇవాళ బదిలీలు, సొంత పనుల కోసమో, డబ్బుల కోసమో ఇలా దిగజారిపోతున్నారని ధ్వజమె త్తారు. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శివరాం, వైఎస్సార్‌సీసీ నాయకులు రాజోలి వీరారెడ్డి, వైఎస్సార్‌సీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త నరేన్‌ రామాంజులరెడ్డి, ఆర్‌వీఎస్‌ఆర్‌ పాల్గొన్నారు.

కోర్టుల్ని, ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఫేక్‌ నామినేషన్లు

చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు

దాడులతో ఎన్నికల్లో గెలిచి ఏం సాధిస్తారు

ప్రెస్‌మీట్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌థ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement