పచ్చనేతల ఫేక్‌.. | - | Sakshi
Sakshi News home page

పచ్చనేతల ఫేక్‌..

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. నామినేషన్లు వేయకుండా దౌర్జన్యం.. పరిశీలన.. ఫేక్‌ నామి నేషన్లు ఇలా అడుగడుగునా ప్రజాస్వా మ్యాని కి తూట్లు పొడిచింది. ఫేక్‌ నామినేషన్లలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.

● ఖాజీపేట –1 స్థానానికి ములపాక సురేంద్రారెడ్డి అనే వ్యక్తి నామినేషన్‌ వేశారు. ఇతనిది తవ్వారిపల్లె గ్రామం. పక్కా టీడీపీ కార్యకర్త . వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా అసంపూర్తిగా నామినేషన్‌ పత్రంను నింపి సంతకాలు లేకుండా అధికారులకు అందించారు.

● త్రిపురవరం ఎంపీటీసీ స్థానానికి పాతాజా గాళ్ల సురేష్‌ అనే టీడీపీ కార్యకర్త వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఫేక్‌ నామినేషన్‌ దాఖలు చేశాడు. ఇతనికి త్రిపురవరం టీడీపీ నాయకుడు అగ్రహారం సొసైటీ అధ్యక్షుడు గుర్రం హరినారాయణరెడ్డి నామినీగా వేశారు. అలాగే సురేష్‌ అనే సదరు వ్యక్తే తన భార్యతో త్రిపురవరం టీడీపీ అభ్యర్థిగా పాతాజా గాళ్ళ లలితతో నామినేషన్‌ వేయించారు. దానికి ప్రతిపాదకునిగా సురేష్‌ సంతకం చేశారు.కాగా వైఎస్సార్‌సీపీ తరుపున వేసిన ఫేక్‌ నామినేషన్‌ ను సంతకం లేదని అధికారులు తొలగించారు.

● ఖాజీపేట –2 నుంచి షేక్‌ సలీం అనే టీడీపీకి చెందిన కార్యకర్త వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆయనకు ఖాజీపేట తెలుగుదేశం లీడర్‌ హబీబ్‌ బంధువు కొత్తపల్లె మౌలాలీ నామినీగా సంతకం చేశారు. ఈ దరఖాస్తు అసంపూర్తిగా ఉండటంతో రిటర్నింగ్‌ అధికారులు తొలగించారు.

67 నామినేషన్లు టీడీపీకి చెందిన వారివే

ఖాజీపేట మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు 67 నామినేషన్లు వేశారు. అందులో 56 టీడీపీకి చెందిన వారు, 5 జనసేనకు చెందినవారు, 4 వైఎస్సార్‌ సీపీకి చెందిన వారు, 2 స్వతంత్రులుగా నమోదయ్యాయి. వాస్తవానికి 67 నామినేషన్లు టీడీపీకి చెందిన వారు నామినేషన్‌ వేశారు. వారే ఇతర పార్టీ నాయకులుగా రెడీ చేసి నామినేషన్‌ వేశారు. ఆ 67 మంది ముందుగానే పార్టీ పెద్దల సమక్షంలో నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేసి ఉండడం గమనార్హం.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌

పారదర్శకథ కంచికి

అన్యాయంగా నామినేషన్‌

తొలగించారు

వైఎస్సార్‌సీపీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి కడప నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం చుట్టూ మూడు రోజులు పడిగాపులు కాశాను. చివరి రోజు టీడీపీ అల్లరి మూకలను దాటుకొని నామినేషన్‌ దాఖలు చేశాను. నామినేషన్‌ పత్రాలను కూడా సీనియర్‌ అడ్వకేట్‌ సహాయంతో పూరించాను. కాని డిక్లరేషన్‌ ఫారంలో బ్యాంక్‌ వివరాలు సక్రమంగా పూరించలేదని నా నామినేషన్‌ తిరస్కరించినట్లు కారణం చెబుతున్నారు. ఇది చాలా దారుణం. కూటమి నేతలు ఓటమి భయంతోనే ఇలా చేయిస్తున్నారు.

అంబటి సుగుణ, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి, పెండ్లిమర్రి మండలం

డిక్లరేషన్‌ పేజీలనుతొలగించారు

వల్లూరు జెడ్పీటీసీగా నేను నామినేషన్‌ దాఖలు చేశాను. ఎన్నికల అఽధికారులు చెక్‌ లిస్ట్‌ సైతం ఇచ్చారు. తరువాత వారే నా నామినేషన్‌ పత్రంలోని డిక్లరేషన్‌ ఫారంలో మొదటి, చివరి పేజీలను మాత్రం వుంచి, లోపలి పేజీలను తొలగించారు. అనంతరం పరిశీలనలో డిక్లరేషన్‌ ఫారంలో కొన్ని పేజీలు లేవనే కారణంతో నా నామినేషన్‌ను తిరష్కరించారు. మేం అన్ని పత్రాలను సక్రమంగా ఇచ్చినా ఇలా చేయడం అన్యాయం

– కనపర్తి దివ్య,

వల్లూరు జెడ్పీటీసీ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement