అభ్యర్థులకు అండదండగా పోచంరెడ్డి.. | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థులకు అండదండగా పోచంరెడ్డి..

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఉదయం 8గంటల నుంచి రాత్రి 2.30గంటల వరకూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అండగా నిలిచారు. ఓవైపు టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి జెడ్పీలో తిష్టవేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లును తిరస్కరించే చర్యలకు ఉపక్రమిస్తే, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌, లీగల్‌ సెల్‌ టీమ్‌ నాగిరెడ్డి, సూర్యప్రకాష్‌రెడ్డిలతో ఎప్పటికప్పుడు అభ్యర్థులకు భరోసాగా కావాల్సిన వివరణ అందజేస్తూ వచ్చారు. ప్రోసిజర్‌ ప్రకారం అభ్యంతరాలను స్వీకరించాలి, ఆపై అభ్యర్థుల వివరణ కోరాలి. తర్వాత నిర్ణయం తీసుకోవడం ఆర్వో వంతు. నిబంధనలు ఇలా చెబుతుంటే ఆర్వో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు 12 తిరస్కరించారు. కాగా వాటిపై వైఎస్సార్‌సీపీ కలెక్టర్‌అప్పీల్‌కు వెళ్లారు. సోమవారం అప్పీళ్లుపై పరిశీలన ఉంది. అక్కడైనా న్యాయం లభిస్తోందనే ఆశాభావం వైఎస్సార్‌సీపీ వ్యక్తం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement