ఇంత దుర్మార్గం ఎప్పుడూ చూడలేదు | - | Sakshi
Sakshi News home page

ఇంత దుర్మార్గం ఎప్పుడూ చూడలేదు

Oct 26 2026 2:28 AM | Updated on Oct 26 2026 2:28 AM

ఇంత దుర్మార్గం ఎప్పుడూ చూడలేదు

● మాజీ కార్పొరేటర్‌ను కత్తితో పొడవటం దారుణం

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి

కడప కార్పొరేషన్‌ : కడప చరిత్రలో ఇంత దుర్మార్గం ఎప్పుడూ చూడలేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం టీడీపీ కార్యకర్త దాడిలో కత్తిపోట్లకు గురైన మాజీ కార్పొరేటర్‌ ఎస్‌ఏ షంషీర్‌, షేక్‌ అలీ ఖలీద్‌ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో అరాచకం, విధ్వంసం రాజ్యమేలుతోందన్నారు. ఎక్కడ చూసినా వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని, మున్సిపల్‌ ఎన్నికల నుంచి ఇది మరింత ఎక్కువైందన్నారు. ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా కత్తులతో, కట్టెలతో, రాళ్లతో దాడులు చేయడం దుర్మార్గమన్నారు. అరాచక మూకలను, గంజాయి బ్యాచ్‌ను ప్రోత్సహిస్తున్న టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ పాకా సురేష్‌, పార్టీ నాయకులు పులి సునీల్‌, షేక్‌ ఉమైర్‌, అక్బర్‌ అలీ, ఏ1 నాగరాజు పాల్గొన్నారు.

పరామర్శ

కత్తి దాడిలో గాయపడిన మాజీ కార్పొరేటర్‌ షేక్‌ షంషీర్‌ బాషా, షేక్‌ అలీ ఖలీద్‌ను వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యులు కె.సురేష్‌ బాబు, మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి పరామర్శించారు. ఆదివారం హాస్పిటల్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచకాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంతమైన కడపలో టీడీపీ అశాంతిని రేకెత్తిస్తోందని మండిపడ్డారు. టీడీపీ నాయకులు ఇన్ని అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement