సాక్షి, టాస్క్ ఫోర్స్: జిల్లా కేంద్రమైన కడపలోని జిల్లా పరిషత్తు కార్యాలయంలో పచ్చ నేతలు హల్ చల్ చేస్తున్నారు. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నా రు. జిల్లావ్యాప్తంగా 39 జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలు పక్రియ బుధవారం నుంచి ఇక్కడ కొనసాగుతుంది. కూటమి అభ్యర్థులు మినహా మరేపార్టీకి సంబంధించిన వ్యక్తులైనా, వైఎస్ఆర్సీపీ పార్టికి చెందిన అభ్యర్థులొచ్చినా దాడులకు తెగబడటం, నామినేషన్ వేసేందుకు తీసుకుని వచ్చిన పత్రాలను నిర్ధాక్షిణ్యంగా చించి వేసే చర్యలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రెండవరోజు గురువా రం కూడా నామినేషన్ల పక్రియ రసాభాసగా సాగింది. కమలాపురం ఎమ్యెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డితో పాటు ఆయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి, యువనాయకుడు పుత్తా లక్ష్మిరెడ్డిలు మూడు చోట్ల తమ అనుచరులతో ప్ర త్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. తన కు సంబంధించి ఆనుచరులను వెంటబెట్టుకుని నామినేషన్ల వేయడానికి వచ్చిన వారిని భయబ్రాంతులకు గురి చేశారు. నామినేషన్ కేంద్రానికి వంద అడుగుల దూరంలో ఉన్న ముళ్ల కంచ వెలుపల యువ నాయకుడు, అతని చుట్టూ వందల మంది అనుచరులు వలయంగా ఏర్పడి హల్చల్ చేశారు. ఎస్పీ సెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పి టి.భవాని, సీఐలు ఎస్ఐలు సిబ్బందితో కలిసి బందోబస్తు విధులను నిర్వహిస్తున్నా అతని అనుచరులను నిలువరించలేని పరిస్థితి నెలకుంది. చివరకు ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాల పార్టీలకు చెందిన మహిళా అభ్యర్థులను కూడా వదలకుండా వారిపై దౌర్జన్యం చేసి వారి నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని చించిపడేశారు. పోలీసులు విధించిన 163 బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని ఈ నేతలు తుంగలో తొక్కేశారు. మరోవైపు కడప జెడ్పీ కేంద్రానికి మూడు వైపులా కొందరు యువతను, అల్లరి మూకలను ఒక్కొకరికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ,భోజనంతో పాటు రూ.700 రోజుకు చెల్లిస్తున్నట్లు, వారు కేవలం తమకు ఇచ్చిన టాస్క్ మేరకు అల్లర్లు,గొడవలకు పాల్పడే విధంగా దాదాపు 500 నుంచి వెయ్యి మందిని నియమించుకున్నట్లు ప్రత్యక్షంగా పరిశీలిస్తే తెలుస్తోంది.
కమలాపురం ఎమ్మెల్యే, తండ్రి, యువనేత గుప్పిట్లో జెడ్పీ కార్యాలయం
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతర పార్టీల అభ్యర్థులకు నాలుగు అంచెల పద్ధతిలో ప్రవేశం కల్పించినా తప్పని దౌర్జన్యం


