కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా పరిషత్ నామినేషన్ల పోరులో టీడీపీ నేతల దౌర్జన్యకాండ రెండవ రోజు సైతం యథేచ్ఛగా కొనసాగింది. నామినేషన్ల దాఖలు కోసం జెడ్పీ కార్యాలయానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలతోపాటు సీపీఎం అభ్యర్థుల నామినేషన్లు సైతం దౌర్జన్యంగా లాక్కొని చింపివేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో టీడీపీ రౌడీలు కట్టెలు పట్టుకుని తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేశారు. చాపాడులో ఎనిమిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా నామినేషన్ పత్రాన్ని లాక్కొని దౌర్జన్యానికి ఒడిగట్టారు. నందలూరులో ప్రధాన రహదారిపై టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణకు దిగగా, ఆ పార్టీ నాయకుడు డాక్టర్ ఆవుల బాలసుబ్రమణ్యం పిస్టల్‌తో గాలిలోకి కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా హౌస్ అరెస్టుల పరంపర కొనసాగింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నారు. కడప నగరంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ మేయర్లు కె.సురేష్‌బాబు, పాకా సురేష్ తదితరులను అదుపులోకి తీసుకుని అట్లూరు పోలీసుస్టేషన్‌లో నిర్బంధించారు. బద్వేలులో నామినేషన్ల సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సుధతోపాటు పలువురు అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను రక్తసిక్తం చేయడం ద్వారా కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా అవహేళన చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాల్సిన అధికారులు ఈ దురాగతాలను కళ్లుండి చూడలేని ధ్రుతరాష్ట్రులుగా మారడం సర్వత్రా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అవి తమకు అందలేదని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా జిల్లాలో అమలు చేయడం లేదు. దీనిపై వివిధ వర్గాల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
పరిషత్ పోరులో రెండో రోజూ
దౌర్జన్యకాండ
ప్రతిపక్ష పార్టీల నామినేషన్ల చింపివేత
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు
ప్రభుత్వ తీరుపై మండిపడిన
ప్రజా సంఘాల నేతలు


