సుప్రీం తీర్పు పెద్ద భరోసా | - | Sakshi
Sakshi News home page

సుప్రీం తీర్పు పెద్ద భరోసా

Oct 23 2026 2:21 AM | Updated on Oct 23 2026 2:21 AM

స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న దురాగతాల నుంచి తమను ఎవరు బయట వేయగలరని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో సుప్రీంకోర్టు తీర్పు పెద్ద భరోసా ఇస్తోంది. గతంలో ఎన్నడూ ఎన్నికల్లో ఇంత దుర్మార్గమైన దాడులు జరగలేదు. రిగ్గింగ్‌ లాంటివి కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండేవి. ఇప్పుడలా కాకుండా నామినేషన్లే దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఎస్‌ఈసీతోపాటు ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాంటి అత్యున్నత సర్వీసుల్లో ఉన్న వారు కూడా వీటిని అరికట్టకుండా చోద్యం చూస్తున్నారు.

– సీహెచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక కర్షక సమితి, కడప

పారా మిలిటరీ దళాలు రప్పించాలి

ఎన్నికల్లో పాటించాల్సిన మార్గదర్శకాలనే సుప్రీం కోర్టు తమ తీర్పులో పునరుద్ఘాటించింది. అవసరమైన చోట కలెక్టర్ల వద్దే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు 144 సెక్షన్‌ అమలు చేయాలి. ఏకగ్రీవాలు అయినచోట ఎన్నికలు సక్రమంగా జరిగినట్లు కాదు. సుప్రీం తీర్పును అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలి. అధికారులను బదిలీ చేసి కేంద్ర బలగాలను రప్పించి ఎన్నికలు నిర్వహించినపుడే సుప్రీం తీర్పు అమలవుతుంది.

– బి.నారాయణరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement