సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగ్గది. ప్రజాస్వామ్యం బతికే ఉందనడానికి ఇది నిదర్శనం. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలి. ఎన్నికలు రద్దు చేసి పారా మిలిటరీ దళాలను రప్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికలు జరపాలి. ఇప్పుడున్న సిబ్బందిని బదిలీ చేయాలి. ప్రజాస్వామ్యం బలహీన పడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నోరు విప్పకపోవడం బాధ్యతా రాహిత్యం. సుప్రీం ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి


