ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

Oct 23 2026 2:21 AM | Updated on Oct 23 2026 2:21 AM

తొండూరు : మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా.. టీడీపీ గూండాలు, పోలీసులు అడ్డుకుంటున్నారని విజయవాడ ఎన్నికల కమిషన్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. గురువారం తొండూరులో నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను గురుకుల పాఠశాల వద్ద పోలీసులు అడ్డుకోవడంతో జమ్మలమడుగు– ముద్దనూరు హైవే రోడ్డుపై వారు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా నామినేషన్లు వేయాలని ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను తీసుకొని వెళుతుండగా.. పోలీసులు అడ్డగించడంతోపాటు టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లు పట్టుకుని కేకలు, ఈలలు వేస్తూ నామినేషన్‌ వేస్తే మీ అంతు చూస్తామని బెదిరించారన్నారు. ఈ సంఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు మల్లేల ఎంపీటీసీ అభ్యర్థి మోరంరెడ్డి జయలక్ష్మి ఫోన్‌ చేశారు. ఎన్నికల్లో జరిగే దౌర్జన్యాలు, అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన అధికారుల నంబర్లకు ఆమె ఫోన్‌ చేశారు. వారిలో ఒక అధికారి ఫోన్‌ లిఫ్ట్‌ చేయగా.. ఆమె ఈ మేరకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ తరఫున 7 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు పోలీసులు, ఎన్నికల అధికారులు సహకరించి, తాము పోటీలో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారులు స్పందించి నామినేషన్‌ వేసేందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement