నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం కాదు దమ్ముంటే నామినేషన్లు వేయించి ప్రజాక్షేత్రంలో గెలుచుకోవాలి.. టీడీపీ నాయకులు నామినేషన్లు వేయకుండా మా పత్రాలను బలవంతంగా లాక్కొని వెళుతున్నారు. ఇది చాలా అన్యాయం. పోటీ చేయడం రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు.. ఆ హక్కు ద్వారానే మేం పోటీ చేస్తున్నాం. కానీ ఇలా టీడీపీ నాయకులు బలవంతంగా నామినేషన్ వేయకుండా చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదు.
– పీవీ వాణి, ఖాజీపేట
నామినేషన్ పత్రాలు లాక్కెళ్లడంఅన్యాయం
మహిళల నామినేషన్ పత్రాలను టీడీపీ కార్యకర్తలు లాక్కొని వెళ్లడం చాలా అన్యాయం. మహిళల పట్ల వారి ప్రవర్తన చాలా దారుణం. ప్రజలకు మేలు చేసి ఉంటే ప్రజల వద్దకు వెల్లి గెలిపించమని అడగాలి. మేలు చేసి ఉంటే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు. కానీ ఇలా నామినేషన్ వేయకుండానే ఏకగ్రీవం చేసుకోవాలని చూడటం ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్మార్గం.
– నాగవేణి, మాజీ సర్పంచ్, దుంపలగట్టు


