జిల్లా సెషన్స్‌ జడ్జి కోర్టు పీపీగా జి. శివశంకర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

జిల్లా సెషన్స్‌ జడ్జి కోర్టు పీపీగా జి. శివశంకర్‌రెడ్డి

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

కడప అర్బన్‌: వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రధాన సెషన్‌న్స్‌ జడ్జి కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ప్రముఖ న్యాయవాది గంగిరెడ్డి శివ శంకర్‌ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్‌ ఆదేశానుసారం శివశంకర్‌ రెడ్డి పేరుమీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నియామకం పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి మూడు సంవత్సరాల కాలానికి, లేదా అతని సేవలు ముగిసే వరకు ఏది ముందుగా జరిగితే అది వర్తిస్తుంది. సోమ వారం ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు.

పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలి

● సమగ్రశిక్ష ఏపీసీ అనురాధ

కడప ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని సమగ్రశిక్ష ఏపీసీ అనురాధ తెలిపారు. సమగ్రశిక్ష సమిళిత విద్య విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కడప సీపీ బ్రౌన్‌ లైబ్రరీ మీటింగ్‌ హాల్‌లో ఎంఈఓ–1, ఎంఈఓ–2లకు ఒకరోజు ఓరియంటేష్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమగ్రిశిక్ష ఏపీసీ అనురాధ, దివ్యాంగులశాఖ ఏడీ కిషోర్‌, ఐసీడీసీ అధికారి నాగేశ్వరి, కడప డిప్యూటీ ఈఓ రాజగోపాల్‌రెడ్డి, పొద్దుటూరు డిప్యూటీ ఈఓ శివప్రసాద్‌, పోలీస్‌ శాఖ ప్రతినిధి జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమగ్రశిక్ష ఏపీసీ అనురాధ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం అమలు చేస్తున్న పథకాలను పాఠశాలల్లో సక్రమంగా అమలయ్యే విధంగా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలు, కళాశాలలో 17 వేలకుపైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, వీరిలో ఇప్పటి వరకు 14 వేలకపైగా ప్రసస్త్‌ యాప్‌ను డౌన్‌లోడు చేసుకున్నారని తెలిపారు. వారంతా తమ పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల వివరాలను తప్పకుండా యాప్‌లో ఆప్‌లోడ్‌ చేయాలన్నారు. ఈ ప్రసస్త్‌యాప్‌ గురించి పాఠశాలల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఐఈ– కో ఆర్డినేటర్‌ వెంకటసుబ్బయ్య, అసిస్టెంట్‌ కో–ఆర్డినేటర్‌ రమణమూర్తి, సెక్టోరియల్‌ అధికారులు రమేష్‌ రాజా, జాఫర్‌, రాజు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ కో–ఆర్డినేటర్‌ కిరణ్‌, ఆర్పీలు వెంకటసుబ్బయ్య, మమత, విజయమ్మ, అర్షద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement