కడప వైఎస్‌ఆర్ సర్కిల్: 2026–27 ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు అధికారులు కసరత్తు పూర్తిచేశారు. 60కు పైగా మద్యం దుకాణాలకు దరఖాస్తులను స్వీకరించి, డ్రా ద్వారా లైసెన్స్‌లు మంజూరు చేయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జె. రమేష్ తెలిపారు. శుక్రవారం కడప నగరంలోని ప్రకాష్ నగర్‌లోని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెంటెండ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 60 మద్యం దుకాణాల్లో 57 దుకాణాలను జనరల్ కేటగిరీలో, మూడు దుకాణాలను గీత కూలాల కార్మికులకు కేటాయించినట్లు తెలిపారు. ఈ దుకాణాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం లాటరీ ద్వారా లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనల మేరకు డ్రా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఎకై ్సజ్ పరిధిలోని గీత కులాల కార్మికులకు మూడు దుకాణాలను ఉన్నాయని వాటిలో వీరపునాయునిపల్లె మండలంలో గౌండ్ల, పెద్దముడియం మండలం గౌడ్, చక్రాయపేట ఈడిగ కులాలకు కేటాయించినట్లు తెలిపారు.ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 1వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దరఖాస్తుదారులు ఒకటి కంటే ఎక్కువ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, ఒక్కో దుకాణానికి దరఖాస్తు రుసుము కింద రూ.3 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అక్టోబరు 3న దరఖాస్తుల పరిశీలన, 5న కొత్త కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీస్తామన్నారు. అర్హులైన వారికి డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తామన్నారు. మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆసిస్టెంట్ సూపరింటెండ్ సోమయ్య పాల్గొన్నారు.
60 మద్యం దుకాణాల్లో 57 జనరల్,
3 గీత కార్మికులకు
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్
సూపరింటెండెంట్ జె. రమేష్


