ఈ నీరు ఒడిసిపట్టాల్సిందే | - | Sakshi
Sakshi News home page

ఈ నీరు ఒడిసిపట్టాల్సిందే

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

పెన్నాలో నీటి పరవళ్లు

కడప సెవెన్‌రోడ్స్‌ : ఎగువన కురిసిన వర్షాలకు జిల్లాలోని కుందూ,పెన్నా నదులు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఎగువనున్న నంద్యాల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కుందూ పోటెత్తుతోంది. ఆ నీరంతా పెన్నాలో కలిసి జోరుగా ప్రవహిస్తోంది. సోమశిలకు చేరే వరకు ఎక్కడా నిల్వ చేసుకునే అవకాశం లేనందున ఈ నీళ్లన్నీ వృథాగా దిగువకు వెళ్లిపోతున్నాయి. కడప తాగునీటి అవసరాలకు పెన్నానే ప్రధాన నీటి వనరు. గండి, లింగంపల్లి వాటర్‌ వర్క్స్‌ నుంచి పంపింగ్‌ చేసి కడపకు తాగునీరు అందిస్తున్నారు. పాత కడప చెరువు ఆయకట్టు రైతులకు ఈ నీరే ఆధారం. అసలే తీవ్ర కరువుకాలం రాబోతోందన్న నేపథ్యంలో పెన్నా నీటిని ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా కేసీ కాలువలో కూరుకుపోయిన వ్యర్థాలను తక్షణమే తొలగించాలి. కాలువలో పూర్తి సామర్థ్యంలో నీరు వస్తే 15–20 రోజుల్లోపుగా పాతకడప చెరువు నిండిపోతుంది. అక్టోబరులో మరిన్ని వర్షాలు కురిస్తే ఆయకట్టు రైతులు వరి లేదా జొన్న తదితర ఆరుతడి పంటలు సాగు చేసుకునే వీలుంటుంది. తమ చెరువులు నింపాలని పాతకడప ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

కడప కార్పొరేషన్‌: ఎగువ కురిసిన వర్షాల వల్ల పెన్నానదిలో నీటి ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. నిన్నామొన్నటి వరకూ ఎండిపోయి కనిపించిన పెన్నానది నేడు జలకళను సంతరించుకుంది. చెన్నూరు, కొండపేట, సిద్దవటం హైలెవెల్‌ బ్రిడ్జిల నుంచి చూస్తే నీటి ప్రవాహం కనుల విందుగా ఉంది.

పెన్నా నుంచి వృథాగా వెళుతున్న

12 వేల క్యూసెక్కుల నీరు

పెన్నా నీటితో పాతకడప చెరువు నింపాలని స్థానికుల డిమాండ్‌

కడపకు తాగునీరు, ఆయకట్టు కింద

రబీ పంటలకు ఈ నీరే ఆధారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement