జీవ వైవిధ్యంతోనే జీవుల మనుగడ | - | Sakshi
Sakshi News home page

జీవ వైవిధ్యంతోనే జీవుల మనుగడ

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

కడప ఎడ్యుకేషన్‌: జీవవైవిధ్యం.. జీవుల మునుగడ పర్యావరణ సమతుల్యతకు ఆధారమని యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ బెల్లంకొండ రాజ శేఖర్‌ అన్నారు. వైవీయూ సైన్స్‌ బ్లాక్‌ లోని ఆచార్య జె. సి. బోస్‌ సెమినార్‌ హాల్‌లో బుధవారం ‘కడప జీవ వైవిధ్యం’అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో వీసీ మాట్లాడారు. ప్రకృతిపై ప్రేమ ఆసక్తులు ఉన్నవారు జీవ వైవిధ్యానికి హద్దులు దాటి అధ్యయనం చేస్తారని.. దీనికి పొరుగు రాష్ట్రానికి చెందిన పరిశోధకుడు కలివి కోడిపై చేసిన పరిశోధనే మంచి ఉదాహరణ అని అన్నారు. ప్రధాన వక్తగా హాజరైన మైసూర్‌ ప్రకృతి ఫౌండేషన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ పి.జగన్నాథం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రకృతి ప్రేమికులుగా మారాలన్నారు. జీవం ఉన్న ప్రతి జీవిని రేపటి తరం కోసం కాపాడడం మన బాధ్యత అన్నారు. కలివికోడిని అధ్యయనం చేస్తున్నామని రాత్రి సమయాలలో ఇది తిరుగుతూ ఉంటుందన్నారు. గత ఆగస్టు 24న కలివికోడి చేసిన శబ్దాలు వినిపించాయని అక్కడున్న వారు చెప్పారని తెలిపారు. వైవీయూ రెక్టార్‌ ఎ. జి. దాము మాట్లాడారు. సదస్సు కన్వీనర్లు ప్రొఫెసర్‌ అనుప్రసన్న, పర్యావరణ శాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ ఎం. శ్రీధర్‌ రెడ్డి, టి. చంద్రశేఖర్‌, నిర్వహణ కమిటీ ప్రొఫెసర్‌ ఎ. టి. వెంకట రమణ రెడ్డి , ఆచార్య వెంకట్రామిరెడ్డి, ఆచార్య ఏ మధుసూదన్‌ రెడ్డి, ఆచార్య ముని కుమారి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement