కడప సిటీ : తిరుమల తొలిగడప దేవునికడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటలకు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రాహణం నిర్వహించారు. గురువారం చతుష్ఠార్చన, యాగశాలపూజ, పవిత్ర ప్రతిష్ఠ నిత్య హోమం నిర్వహిస్తారు. శుక్రవారం పవిత్ర సమర్పణ, హోమం నిర్వహించనున్నారు. శనివారం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. ఆలయంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించనున్నారు.
వేడుకగా శ్రీ వెంకటేశ్వరుని కల్యాణం
దేవునికడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా బుధవారం స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై కల్యాణ క్రతువును తిలకించారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


