● కుర్చీల కోసం ‘కుమ్ములాట’.. | - | Sakshi
Sakshi News home page

● కుర్చీల కోసం ‘కుమ్ములాట’..

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

● కుర్చీల కోసం ‘కుమ్ములాట’..

మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు త్వరలో రానున్నందున.. మొన్నటి వినాయక చవితి పండుగనాడు ఏర్పాటు చేసిన మండపాల దగ్గర, రచ్చబండల వద్ద, వీధుల్లో మీటింగులు జోరందుకున్నాయి. ఐదేళ్లు మొహం చాటేసి ఇప్పుడు నోట్ల మూటలతో ఓటర్ల ముంగిట్లోకి వస్తున్న నాయకులు.. ‘గత ఐదేళ్లలో నేనేం చేశానో మీకు తెలుసు’’ అని ఒకరు మైక్‌ అందుకుంటే.. ‘నువ్వు చేసింది ఏమీ లేదు.. నన్ను గెలిపిస్తే గ్రామాన్ని పట్టణంగా, మున్సిపాలిటీని నగరంగా చేసి చూపిస్తా’ అని ఇంకొకరు సవాల్‌ విసురుతున్నారు. ఈ రాజకీయంలో బిర్యానీ ప్యాకెట్లతో ఓటర్లకు గాలం వేసేందుకు ‘చిరు కానుకలు’ అనే నైవేద్యాలను ఇప్పటి నుంచే అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఓటర్లు కూడా తక్కువ తినలేదు! ‘నేతలు పెట్టే నైవేద్యం తిందాం.. ఓటు మాత్రం మనకు సంక్షేమ పథకాలు అందించిన వాడికే వేద్దాం’ అని లోపల గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో సమస్యల సుడిగుండంలో ఉన్న ప్రజలు.. ఈసారి నేతల ప్రలోభాల ఆశలకు లొంగుతారా? అనేది కాలమే నిర్ణయించాలి. ఈ రాజకీయంలో నిజమైన గెలుపు ఎవరికి దక్కుతుందో ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement