వ్యాపారం ద్వారా సంఘాలు ఆర్థికంగా బలపడాలి | - | Sakshi
Sakshi News home page

వ్యాపారం ద్వారా సంఘాలు ఆర్థికంగా బలపడాలి

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

కడప అగ్రికల్చర్‌ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు వ్యాపారాలను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని డీసీఎంఎస్‌ చైర్మెన్‌ జయప్రకాష్‌ నారాయణ బాబు సూచించారు. కడప డీసీఎంఎస్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం సహకార సంఘాల అధ్యక్షుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరపతి సంఘాలు ఆర్థికంగా బలపడాలంటే వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎరువులు, పురుగు మందుల షాపులతోపాటు పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. అనంతరం సంఘానికి సంబంధించి మార్చి 2026 నుంచి ఆగష్టు 2026 వరకు జమ, ఖర్చులపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ వెంకటసుబ్బయ్య, డీఎల్‌సీఓ గోపీనాయక్‌, డీఎంఓ పరిమళజ్యోతి, డీసీఎంఎస్‌ మేనేజర్‌ రఘురామిరెడ్డి, సహకారం సంఘాల చైర్మన్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement