తృటిలో తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన ప్రమాదం

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

వీరబల్లి : మండల పరిధిలో బుధవారం గడికోట ఘాట్‌ రోడ్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అప్రమత్తంకావడంతో ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గడిగోట నుంచి మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు రాయచోటికి వస్తూ ఉండగా వీరబల్లి నుంచి గడికోటకు చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంలో గ్యాస్‌ సిలిండర్‌ తీసుకు వెళుతుండగా ఘాట్‌ రోడ్డులో సిలిండర్‌ కిందపడి పోయింది. సిలిండర్‌ బస్సుకు ఎదురుగా రావడంతో వాటిని తప్పించడానికి ఆర్టీసీ డ్రైవర్‌ బస్సును చాకచక్యంగా రోడ్డు పక్కన ఆపేశాడు. దీంతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement