మోటార్‌ కేబుల్‌ వైర్లు చోరీ | - | Sakshi
Sakshi News home page

మోటార్‌ కేబుల్‌ వైర్లు చోరీ

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

లింగాల : మండలంలోని చిన్నకుడాల గ్రామంలో వ్యవసాయ విద్యుత్‌ మోటార్ల కేబుల్‌ వైర్లను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకపోయారు. గ్రామానికి చెందిన శివనారాయణరెడ్డి అనే రైతుకు చెందిన 250మీటర్ల కేబుల్‌ వైర్లను ఎత్తుకెళ్లారు. దీని విలువ రూ.2లక్షలు ఉంటుందని రైతు వాపోతున్నాడు. నాగేంద్రనాథరెడ్డి, శంకర్‌రెడ్డి తది తర 8 మంది రైతులకు చెందిన కేబుల్‌ వైర్లను అపహరించుకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లింగాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని రైతులు తెలిపారు.

ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19

సెక్రటరీగా మురళీకృష్ణారెడ్డి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : వైఎస్సార్‌ కడప ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 సెక్రటరీగా డాక్టర్‌ పి.మురళీ కృష్ణారెడ్డిని కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నియమించారు. బుధవారం కడప నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌ , ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ జి ఎఫ్‌ క్రీడలు వివరాలు, క్రీడలు నిర్వహించే మైదానాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ డివి ఈవో ప్రకాష్‌ పట్నాయక్‌, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సూర్యారావు, ఫిజికల్‌ డైరెక్టర్లు నాగేశ్వర్‌ రెడ్డి, పోలంకి గణేష్‌ బాబు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

యువకుడిపై కత్తితో దాడి

మదనపల్లె టౌన్‌ : భూ వివాదంలో జరిగిన ఘర్షణలో ఓ యువకుడిని ప్రత్యర్థులు కత్తితో దాడి చేసి గాయపరిచారు. బుధవారం మదనపల్లి మండలంలో జరిగిన ఘటనపై బాధితుడు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ రెడ్డివారిపల్లికు చెందిన మణి (36) అదే గ్రామానికి చెందిన హరీష్‌కు కొంతకాలంగా భూ వివాదం నడుస్తోందని తెలిపారు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లి ఇంటికి వస్తున్న మణిని గ్రామానికి సమీపంలో అడ్డగించి కత్తితో దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు ఆరోపించారు. హరీష్‌ దాడిలో గాయపడిన బాధితుడిని కుటుంబీకులు చికిత్స కోసం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు అందించడంతో కోలుకుంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement