తెలుగు భాషా సాహిత్యాలకు వేదికగా ‘బ్రౌన్‌’ గ్రంథాలయం | - | Sakshi
Sakshi News home page

తెలుగు భాషా సాహిత్యాలకు వేదికగా ‘బ్రౌన్‌’ గ్రంథాలయం

Sep 24 2026 1:48 AM | Updated on Sep 24 2026 1:48 AM

కడప ఎడ్యుకేషన్‌ : తెలుగు భాషా సాహిత్యాలకు వేదికగా సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సేవలందించేలా రూపుదిద్దుతామని జిల్లా కలెక్టర్‌, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి చీఫ్‌ ప్యాట్రన్‌ డా. చెరుకూరి శ్రీధర్‌ పేర్కొన్నారు. వైవీయూ ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో బుధవారం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి సమావేశాన్ని నిర్వహించింది. ముందుగా జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, వైవీయూ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ సలహామండలి సభ్యులు నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీధర్‌, వైవీయూ ఉపకులపతి, సలహామండలి ఛైర్మన్‌ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌, సలహామండలి సభ్యులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, ఆచార్య పి.సి.వెంకటేశ్వర్లు, డా. రావి శారద, డా. మన్నం వెంకటరాయుడు, సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి, జానమద్ది విజయ భాస్కర్‌, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు మరియు సలహామండలి కన్వీనర్‌ ఆచార్య గంజి పార్వతి పాల్గొన్నారు. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ జర్నల్‌ నిర్వహించడం, మనసు ఫౌండేషన్‌ సహకారంతో తెలుగు బోధనా సమావేశాలు నిర్వహించడం, సోషియల్‌ మీడియా వేదికగా భాషా పరిశోధన కేంద్రం తరపున భాషా సాహిత్యాల ప్రచారాన్ని నిర్వహించడం లాంటి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, డా. చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement