యువతి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్యాయత్నం

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

● యువకుడి తల్లిదండ్రులు, పోలీసుల వేధింపులే కారణం

● బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణ

కడప అర్బన్‌ : కడప నగరంలోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎర్రముక్కపల్లెలో నివాసం ఉంటున్న దేవతల కళ్యాణి (22) అనే యువతి తీవ్ర మానసిక ఆవేదనతో సోమవారం సాయంత్రం డెటాయిల్‌ అనే ద్రావణాన్ని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు, బాధితురాలి తల్లిదండ్రులు శశి, అనిల్‌కుమార్‌లు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రముక్కపల్లె కంది పాలెం ప్రాంతానికి చెందిన 19 డివిజన్‌ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ దారా రంజిత్‌ కుమార్‌ కుమారుడు సంజయ్‌తో కళ్యాణికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమలో ఉండగా వారి పెద్దలు అంగీకరించలేరు. కళ్యాణి ప్రస్తుతం ఎయిర్‌ పోర్టులో ఉద్యోగం చేస్తోంది. కళ్యాణి, సంజయ్‌ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయో, లేక వీరి వివాహానికి వయోపరిమితి అడ్డమొస్తుందో, లేక ఇతరత్రా కారణాలతోనో పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతల అండదండలతో కళ్యాణిని, కుటుంబ సభ్యులను పోలీస్‌ స్టేషన్‌కు ఈనెల 18న పోలీసులు పిలిపించారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్‌లో తమ కుమార్తెను పోలీసులు అవమానకరంగా మాట్లాడాలని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. రంజిత్‌ కుమార్‌ కుటుంబ సభ్యులు, పోలీసుల అవమానకర మాటలతోనే తమ కుమార్తె డెటాల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని వారు మీడియాకు తెలియజేశారు. ఈ విషయమై కడప ఒన్‌టౌన్‌ ఎస్‌ఐ ప్రదీప్‌ కుమార్‌ను వివరణ కోరగా తాము కేవలం కౌన్సెలింగ్‌ నిర్వహించామని, ఇద్దరి భవిష్యత్తు దృష్ట్యా బాగా వుండాలని మంచిమాటలు చెప్పామని, ఎలాంటి అవమానకర మాటలు మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement