రాజంపేటలో సిలిండర్ల దొంగలు పడ్డారు! | - | Sakshi
Sakshi News home page

రాజంపేటలో సిలిండర్ల దొంగలు పడ్డారు!

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

రాజంపేట : నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో సిలిండర్ల దొంగలు పడ్డారు. దీంతో పట్టణ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా సోమవారం కూడా ఓ ఇంటిలో సిలిండర్‌ చోరీ చేశారు. దీంతో సిలిండర్ల దొంగలు పడటం ఏమిటి అని పలువురిని ఆరా తీశారు. ఒక్కొక్కరిగా సిలిండర్ల దొంగల బాధితులు బయటికి వస్తున్నారు. ఇప్పుడు ఖాళీ సిలిండర్లు దొరకడం లేదు, వీటిని దొంగలించి అమ్ముకుంటే.. డబ్బు బాగా వస్తుందనే ఉద్దేశంతో దొంగలు ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలో ముందుగా రెక్కీ కూడా నిర్వహించుకుంటున్నారు. మధ్యతరగతి నుంచి ఆ పై ఉన్న నివాస ప్రాంతాల్లో ఆరుబయటి ఖాళీ సిలిండర్లను ముందుస్తుగానే గుర్తిస్తున్నారు. సహజంగా సిలిండర్‌ ఖాళీ అయితేనే సన్‌సైడ్‌, ఇంటి ముందు ఆరుబయట ఉంచడం జరుగుతూ వస్తోంది. ఇదే అదనుగా భావించి దొంగలు వాటిని చోరీ చేసుకొని తీసుకెళుతున్నారని బాధితులు వాపోతున్నారు.

పట్టపగలే దర్జాగా..

పలు ప్రాంతాల ఇళ్లలో పట్టపగలే దర్జాగా సిలిండర్లను ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి సంఘటనలు కొందరు సీసీ కెమెరాల్లో గుర్తించారు. మరో వైపు గ్యాస్‌ ఏజెన్సీ సిబ్బందిలా వ్యవహరిస్తూ, ఇళ్లలో ఖాళీగా ఉన్న సిలిండర్లను తీసుకెళ్లడంతో పలువురు లబోదిబోమంటున్నారు. ఇటీవల కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. చాలా మంది కొత్త కనెక్షన్లు ఇవ్వని స్థితిలో దొంగ సిలిండర్లను వారి కోటాలో తీసుకొని వంట వినియోగం కొనసాగిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకుని సిలిండర్లను గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోలీసులకు ఫిర్యాదుల వెల్లువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement