90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

కడప అగ్రికల్చర్‌ : జిల్లాలో గత రెండు రోజుల నుంచి తొలకరి వర్షాలు పడుతున్నాయని, దీంతో రైతులు సాగు ఆశలు చిగురిస్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులను సబ్సిడీతో అందించి ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి కోరారు. సోమవారం కడపలో ఆయన రైతు రాష్ట్ర కార్యదర్శి శంకర్‌రెడ్డి, చెన్నూరు ఎంపీపీ సురేష్‌యాదవ్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు చెన్నకేశవరెడ్డి, కొండారెడ్డిలతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పుడైనా కనీసం రైతులపై దృష్టి పెట్టి ఎలాంటి నిబంధనలు లేకుండా 90 శాతం సబ్సిడీతో మినుములు, పెసలు, వెరుశనగక్కాయలతోపాటు 50 శాతం సబ్సిడీతో ఎరువులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఖరీఫ్‌ పూర్తిగా కరువుతో ముగిసిందని, ఆ నష్టాన్ని పూడ్చేందుకు ప్రతి ఎకరాకు 20 వేల చొప్పున రైతులకు అందించి ఆదుకోవాలన్నారు. అలాగే బ్యాంకుల్లో రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలను మంజూరు చేయాలన్నారు. మొదటి సంవత్సరం ఎత్తి వేసిన అన్నదాత సుఖీభవను కేంద్రంతో సంబంధం లేకుండా వెంటనే రూ.20 వేలు రైతులకు ఇవ్వాలన్నారు. అలాగే కూటమి అధికారంలోకి వచ్చాక పెండింగ్‌లో ఉన్న పంటల బీమా, పెట్టుబడి రాయితీ, సున్నావడ్డీ బకాయిలను కూడా రైతుల ఖాతాలకు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కేంద్రంలో పలుకుబడి ఉపయోగించి జిల్లాకు ప్రత్యేక కరువు ఫ్యాకేజీ తీసుకు వచ్చి రైతులను అదుకోవాలన్నారు. అప్పుడే కూటమికి రైతుల పట్ల నిజమైన ప్రేమ ఉన్నట్లు నిరూపణ అవుతుందన్నారు.

వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement