మైదుకూరు : మైదుకూరు మండలం వనిపెంట జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడి సంఘటన మరువక ముందే సోమవారం 9వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. పొన్నోలు సుమంత్ అనే విద్యార్థిని కార్తీక్, చైతన్య, మరికొందరు మీద పడి చేతులతో కొట్టినట్టు తెలుస్తోంది. అనంతరం సుమంత్‌ను వారు తోయడంతో డెస్క్‌కు నుదురు కొట్టుకోగా గాయమైనట్టు సమాచారం. విద్యార్థులు కొట్టుకుంటున్న విషయం గమనించిన హెడ్మాస్టర్ గురవయ్య వారిని మందలించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఇదే విద్యార్థులు సుమంత్‌పై గతంలో రెండు సార్లు దాడి చేసినట్టు తెలుస్తోంది. గాయపడిన సుమంత్‌ను ఉపాధ్యాయులు స్థానిక పీహెచ్‌సీకి తీసుకుపోగా అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. నుదుటిపై గాయం నొప్పిగా ఉందని సుమంత్ చెప్పడంతో అతన్ని ప్రొద్దుటూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై హెడ్‌మాస్టర్ గురవయ్యనున వివరణ కోరగా పిల్లలు మధ్యాహ్నం రెండవ పిరియడ్ సమయంలో తమాషా పడుతూ ఒకరినొకరు తోసుకున్నారని, ఆ సమయంలో సుమంత్ డెస్క్‌పై పడటంతో గాయం అయిందన్నారు. సంఘటన ఉదయం 10 గంటలకు జరిగిందని విద్యార్థులు చెబుతుండగా హెడ్మాస్టర్ మధ్యాహ్నం జరిగినట్టు చెబుతున్నారు.


