కడప కోటిరెడ్డిసర్కిల్ : అమృత్ భారత్ స్టేషన్ల నిర్మాణంలో భాగంగా కడప రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను 2027 మార్చిలోగా పూర్తి చేయాలని గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం కడప రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఆయన వివిధ పనులను పరిశీలించారు. వివిధ విభాగాల్లో కలియ తిరిగి ప్రస్తుతం జరిగిన పనుల వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా వెయిటింగ్ హాలు, బుకింగ్ ఆఫీసు, ఫుడ్‌కోర్టు, లిఫ్ట్, ఎస్కలేటర్, టాయిలెట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, పార్శిల్ కార్యాలయం, పార్కింగ్‌ఏరియాను పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై రైల్వే అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ ఎల్వీ మోన్‌రెడ్డి, అధికారులు జనర్దాన్, దుర్గారావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
రైల్వేశాఖ గుంతకల్ డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా


