వర్షం ధాటికి కూలిన మట్టి మిద్దె | - | Sakshi
Sakshi News home page

వర్షం ధాటికి కూలిన మట్టి మిద్దె

Sep 21 2026 6:35 AM | Updated on Sep 21 2026 6:35 AM

వర్షం ధాటికి కూలిన మట్టి మిద్దె యువకుడి ఆత్మహత్య స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ

జమ్మలమడుగు రూరల్‌ : మండల పరిధిలోని అంబవరం గ్రామంలో శనివారం రాత్రి వర్షం ధాటికి గడ్డం బాబ్జీకి చెందిన పాత మట్టి మిద్దె కూలిపోయింది. జమ్మలమడుగు మండలంలో శనివారం సాయంత్రం నుంచి వర్షం కురిసింది. గత కొంత కాలం నుంచి మిద్దె దెబ్బతిని ఉండటంతో బాబ్జీ పక్క ఇంటిలో కాపురం ఉంటున్నాడు. దీంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఇంటిలో పాత వస్తువులు మాత్రమే ఉన్నాయి.

జమ్మలమడుగు రూరల్‌ : మండల పరిధి మోరగుడి గ్రామానికి చెందిన గునిశెట్టి కిషోర్‌(27) అనే యువకుడు ఆదివారం సాయంత్రం జీవితంపై విరక్తి చెంది రేకుల ఇంటిలో ఇనుప పైపునకు చీరతో ఉరి వేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గునిశెట్టి కిషోర్‌ బేకరీల్లో కేక్‌ మాస్టర్‌గా పనులు చేసుకుని జీవించేవాడు. అవివాహితుడు కావడంతో మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కిషోర్‌ను కిందికి దించేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి శ్రీనివాసులు గత కొంత కాలం క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లి లక్ష్మీదేవి మూగది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

కడప ఎడ్యుకేషన్‌ : కడప నగరం హబీబుల్లా వీధిలోని సుల్తాన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట కన్వీనర్‌ శిర రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్టవ్యాప్తంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నట్టు తెలిపారు. అందుకు ఆప్‌ కార్యకర్తలుగా స్వచ్చంధంగా సేవా గుణం కలిగిన వారు, ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర సహాయ కన్వీనర్‌ వేంకట చలపతి, డాక్టర్‌ సేవా కుమార్‌, కడప జిల్లా కన్వీనర్‌ సాజిద్‌ హుసేన్‌, జిల్లా కోఆర్డినేటర్‌ రహమతుల్లా, జిల్లా కార్యదర్శి దస్తగిరి, అధికార ప్రతినిధి డాక్టర్‌ బేరిలా శ్రీనివాసులు, సహాయ కన్వీనర్‌ దాదా పీర్‌, అన్ని జిల్లాల కన్వీనర్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement