వినాయక మండపం వద్ద అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

వినాయక మండపం వద్ద అపశ్రుతి

Sep 21 2026 6:35 AM | Updated on Sep 21 2026 6:35 AM

వినాయక మండపం వద్ద అపశ్రుతి

● విద్యుత్‌ షాక్‌ తగిలి డిప్లొమో విద్యార్థికి తీవ్ర గాయాలు

ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని ఆర్ట్స్‌కాలేజీ రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద విద్యుత్‌ షాక్‌ తగిలి ఊటుకూరు సందీప్‌ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సందీప్‌ పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. యువకుడి తల్లి పద్మావతి అంగన్‌వాడీ వర్కర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ట్స్‌కాలేజీ రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆదివారం సాయంత్రం ప్లగ్‌ తీసేందుకు ప్లగ్‌ బాక్స్‌ను పట్టుకోగా సందీప్‌ విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో పడిపోయిన అతన్ని సన్నిహితులు, బంధువులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సీపీఆర్‌, షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వడంతో సందీప్‌ స్పృహలోకి వచ్చాడు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు చెప్పారు. వన్‌టౌన్‌ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి సందీప్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. వైద్యులతో తరచూ మాట్లాడుతూ వేగవంతమైన చికిత్స అందేలా చొరవ చూపారు. బాలుడికి ప్రాణాపాయం తప్పిందని తెలియడంతో సీఐ, ఎస్‌ఐతోపాటు బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత సీఐ, ఎస్‌ఐలు ఘటన చోటు చేసుకున్న వినాయక మండపం వద్దకు వెళ్లి అక్కడి గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ కమిషనర్‌ టి.శ్రీనివాస విశ్వనాథ్‌ ఆస్పత్రికి వెళ్లి యువకుడిని పరామర్శించారు. సందీప్‌ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement