న్యాయ సేవలపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయ సేవలపై అవగాహన పెంచుకోవాలి

Sep 19 2026 5:44 AM | Updated on Sep 19 2026 5:44 AM

కడప అర్బన్‌ : కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న న్యాయ సేవలు, న్యాయ విజ్ఞాన కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు చేరువ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్‌ సూచించారు. శుక్రవారం సాయంత్రం కడప జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు అందుతున్న న్యాయ సేవలు, ఉచిత న్యాయ సహాయం, న్యాయ విజ్ఞాన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ప్రతి నెల మూడు న్యాయ సేవలు, న్యాయ విజ్ఞాన కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తులకు సూచించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలు, విద్యాసంస్థలు, మహిళలు, పిల్లలు, వద్ధులు, కార్మికులు, ఇతర అవసరమైన వర్గాలకు న్యాయ సేవలు చేరేలా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు న్యాయం సులభంగా, సమర్థవంతంగా అందించడంలో న్యాయ సేవాధికార సంస్థలు, న్యాయస్థానాలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా న్యాయమూర్తులు,సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్‌.బాబా ఫకృద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement