అడవి పందులు అడ్డు రావడంతో.. | - | Sakshi
Sakshi News home page

అడవి పందులు అడ్డు రావడంతో..

Sep 19 2026 5:44 AM | Updated on Sep 19 2026 5:44 AM

ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య విద్యుత్‌ షాక్‌తో రిటైర్డు ఆర్మీ ఉద్యోగి మృతి

– బైక్‌ ప్రమాదంలో వ్యక్తి మృతి

బ్రహ్మంగారిమఠం : మండలంలోని తోట్లపల్లె దగ్గర అడవి పందులు అడ్డురావడంతో బైక్‌ ప్రమాదంలో తోట్లపల్లె ఎస్సీ కాలనీకి చెందిన ఎర్రంపల్లె బాల బ్రహ్మయ్య(36) శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలబ్రహ్మయ్య తోట్లపల్లె దగ్గర ఉన్న గురుకుల పాఠశాలలో వాచ్‌మెన్‌గా ఉన్నాడు. మల్లేపల్లెకు వెళ్లి వస్తుండగా తోట్లపల్లె సమీపంలో ఒక్కసారిగా అడవి పందులు రోడ్డు దాటేందుకు పరుగులు పెట్టగా.. బైక్‌ను ఢీకొట్టాయి. బాల బ్రహ్మయ్య బైక్‌ కంప చెట్లలోకి వెళ్లి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలం పైడిపాలెం గ్రామంలో శుక్రవారం వివాహిత హేమలత (20) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఘన మద్దిలేటి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పైడిపాలెం గ్రామానికి చెందిన దాసరి హేమలతకు ఏడాది వయస్సు గల కుమార్తె ఉంది. భార్యాభర్తలిద్దరూ పాప పుట్టువెంట్రుకలు వచ్చే సోమవారం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని భార్య పట్టుబట్టారు. దీనికి భర్త ఒప్పుకోకపోవడంతో హేమలత మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వేముల : మండలంలోని దుగ్గన్నగారిపల్లె గ్రామానికి చెందిన రిటైర్డు ఆర్మీ ఉద్యోగి కేశవరెడ్డి(65) శుక్రవారం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కేశవరెడ్డి ఆర్మీలో రిటైర్డు అవ్వగానే.. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం పొలం వద్దకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. అక్కడ తెగిపడిన వైర్లను గమనించని కేశవరెడ్డి మోటార్‌ ఆన్‌ చేయగానే విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి మృతుడి భార్య అరుణ కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement