రద్దీలో చేతివాటం.. క్షణాల్లో బంగారం మాయం | - | Sakshi
Sakshi News home page

రద్దీలో చేతివాటం.. క్షణాల్లో బంగారం మాయం

Sep 19 2026 5:44 AM | Updated on Sep 19 2026 5:44 AM

● చోరీ కేసులో అక్క, బావ, మరదలు అరెస్ట్‌

● 5 తులాల బంగారు గాజులు స్వాధీనం

ప్రొద్దుటూరు క్రైం : రద్దీ ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకొని వారు చోరీలు చేసేవారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులోని పాత బస్టాండులో మహిళ హ్యాండ్‌ బ్యాగ్‌ నుంచి బంగారు ఆభరణాలను దొంగలించిన ముగ్గురు నిందితులను త్రీ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ వివరాలను శుక్రవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ విభూకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఎర్రగుంట్ల మండలంలోని చిలమకూరు గ్రామానికి చెందిన సారెడ్డి లక్ష్మీదేవి ఈ నెల 12న ప్రొద్దుటూరులోని పాతబస్టాండుకు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో బస్సు ఎక్కుతుండగా రద్దీలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె హ్యాండ్‌ బ్యాగులో ఉన్న పర్సును అపహరించారు. అందులో సుమారు ఐదు తులాల బరువున్న నాలుగు బంగారు గాజులు ఉన్నాయి. ఈ విషయమై బాధితురాలు 13న త్రీ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, టవర్‌ లొకేషన్‌ ఆధారంగా నిందితులు అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గోపన్నపల్లి గ్రామానికి చెందిన షేక్‌ కరమల్ల షబీనా అలియాస్‌ పఠాన్‌ షబీనా, పఠాన్‌ ముబీనా, పఠాన్‌ షాహిద్‌ఖాన్‌లుగా గుర్తించారు. పఠాన్‌ షబీనా, పఠాన్‌ ముబీనా అక్కాచెల్లెల్లు కాగా పఠాన్‌ షాహిద్‌ ముబీనా భర్త. ఈ క్రమంలో నిందితులు ఎర్రగుంట్ల రోడ్డులోని వాసవి సర్కిల్‌ వద్ద ఉండగా సీఐ రామాంజనేయుడు, ఎస్‌ఐ సంజీవరెడ్డి సిబ్బందితో కలిసి వారిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. షబీనాపై గతంలో చోరీ కేసు ఉందన్నారు. అలాగే పఠాన్‌ షాహిద్‌ఖాన్‌పై కూడా పలు ఎకై ్సజ్‌ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరచి నిందితులను పట్టుకొని, పూర్తి స్థాయిలో సొత్తును రికవరీ చేసిన సీఐ, ఎస్‌ఐలతోపాటు ఏఎస్‌ఐ శ్రీరాములు సుబ్బన్న, కానిస్టేబుల్‌ ధనాంజనేయులు, హోంగార్డులు జనార్థన్‌రెడ్డి, ధరణిలను ఏఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement