మా కుమార్తె ఆత్మకు శాంతి చేకూరింది | - | Sakshi
Sakshi News home page

మా కుమార్తె ఆత్మకు శాంతి చేకూరింది

Sep 19 2026 5:44 AM | Updated on Sep 19 2026 5:44 AM

మా కుమార్తె ఆత్మకు శాంతి చేకూరింది

● మృతురాలి కుటుంబ సభ్యుల కొవ్వొత్తుల ప్రదర్శన

బద్వేలు అర్బన్‌ : ప్రేమ పేరుతో తమ కుమార్తెను నమ్మించి హత్య చేసిన నిందితుడికి శుక్రవారం కడప ప్రత్యేక పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో.. తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరిందని దస్తగిరమ్మ తల్లిదండ్రులు హుస్సేన్‌, హుస్సేనమ్మ పేర్కొన్నారు. దస్తగిరమ్మ హత్య కేసులో నిందితుడు జక్కల విఘ్నేష్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడిన నేపథ్యంలో శుక్రవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో దస్తగిరమ్మ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభం శుభం తెలియని తమ కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడికి.. శిక్ష పడటం ద్వారా న్యాయం గెలిచిందని అన్నారు. తమ కుమార్తె కేసు విషయంలో నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన న్యాయమూర్తి, న్యాయవాదులు, పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లతోపాటు సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇలాంటి శిక్షలు బాలికలపై నేరాలకు పాల్పడే వారికి కనువిప్పు అవుతాయని అన్నారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో బాణాసంచా కాల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement