కాలువలో కాలుజారి పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కాలువలో కాలుజారి పడి వ్యక్తి మృతి

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీలోని వేపరాలపల్లెకు చెందిన నల్లచ్చిగారి చిన్న ఓబులేసు (38) నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌ ఇన్‌లెట్‌ కెనాల్‌లో ప్రమాదవశాత్తు పడి దుర్మరణం చెందాడు. అవుకు వద్ద మన ఇన్‌ఫ్రా కంపెనీలో ప్లాంట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న చిన్న ఓబులేసు, ఇద్దరు స్నేహితులతో కలసి మంగళవారం రిజర్వాయర్‌ వద్దకు వెళ్లాడు. రిజర్వాయర్‌ ఇన్‌లెట్‌ కెనాల్‌లో ముగ్గురూ నీటిలోకి దిగి కాళ్లు కడుక్కుంటుండగా చిన్న ఓబులేసు కాలు జారి నీటిలో పడిపోయాడు. అతని స్నేహితులకు ఈత రాకపోవడంతో సహాయం కోసం కేకలు వేశారు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో చిన్న ఓబులేసు నీటిలో మునిగిపోయాడు. సంఘటనపై మృతుడి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చిన్న ఓబులేసు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో గాలింపు కష్టంగా మారింది. బుధవారం ఉదయం చిన్న ఓబులేసు మృతదేహం బయటపడింది. అవుకు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని స్వగ్రామం వేపరాలపల్లెకు తీసుకొచ్చారు. చిన్న ఓబులేసుకు భార్య మల్లేశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న ఓబులేసు మృతితో వేపరాలపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతి చెందడంతో ప్రభుత్వం ఓబులేసు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement